దేశంలో కీలక ఖనిజాల ప్రాసెసింగ్‌కు ప్రోత్సాహం దిశగా కేపెక్స్ మద్దతు పథకానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ సమావేశమైన నేపథ్యంలో ఐదేళ్ల కాలానికిగాను లిథియం, నికెల్ ప్రాసెసింగ్‌కు ప్రాధాన్యంతో రూ.2,814 కోట్ల మేర నిధుల కేటాయింపు ప్రతిపదనను అనుమతించింది.
కీలక ఖనిజాల ప్రాసెసింగ్ ప్రక్రియ భౌగోళికంగా ప్రపంచంలోని కొన్ని దేశాలకు, ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉంది. తద్వారా సరఫరా శ్రేణిలో భౌగోళిక-రాజకీయ అంతరాయాలు, ధరల అనిశ్చితి, సరఫరాలో పరిమితులు వంటి ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. సరఫరా శ్రేణుల పునరుత్థాన సామర్థ్యం, ఆర్థిక భద్రతకు ఈ పరిణామాలు తీవ్ర ముప్పు కలిగిస్తాయి. దీని వల్ల జాతీయ భద్రత, ఆర్థిక సార్వభౌమత్వం, కర్బనీకరణ నిరోధం వంటి లక్ష్యాలను సకాలంలో సాధించే కృషిపై దుష్ప్రభావం పడుతుంది.
ప్రస్తుతానికి దేశంలో లిథియం, నికెల్, కోబాల్ట్ వంటి కీలక ఖనిజాల శుద్ధి-ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఈ కారణంగా శుద్ధి చేసిన మధ్యంతర ఉత్పత్తులు, అధిక స్వచ్ఛత గల కీలక ఖనిజ పదార్థాల కోసం భారత్ దిగుమతులపై గణనీయంగా ఆధారపడాల్సి వస్తోంది. అంతేగాక కీలక ఖనిజాల దేశీయ ప్రాసెసింగ్ సామర్థ్యం పరిమితం కాబట్టి, వాణిజ్య స్థాయి ప్రాజెక్టులకు అధిక మూలధన అవసరాలు, అనువైన సాంకేతికతలతోపాటు ముడి పదార్థాల పరిమిత లభ్యత వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అందువల్ల గరిష్ఠ స్థాయిలో విలువ పెంపుదల, దిగుమతి ప్రత్యామ్నాయ సాధన, సంపూర్ణ విలువ వ్యవస్థల పటిష్టీకరణ దిశగా దేశీయ ప్రాసెసింగ్ సామర్థ్యం మరింత బలోపేతం కావడం అత్యంత అవశ్యం.
ఈ నేపథ్యంలో దేశీయ ప్రాసెసింగ్ సౌకర్యాల కల్పన, కార్యాచరణ దిశగా లక్షిత మూలధన వ్యయ మద్దతు కోసం “కీలక ఖనిజ ప్రాసెసింగ్ ప్రోత్సాహక మూలధన వ్యయ మద్దతు పథకం” రూపొందింది. విలువ జోడింపు నిమిత్తం దేశీయంగా మద్దతు, దిగుమతి పరాధీనత తగ్గింపు, విలువ శ్రేణి వృద్ధి, దేశీయ ప్రాసెసింగ్ సామర్థ్యం పెంపు వంటివి ఈ పథకం లక్ష్యాలు. ప్రధానంగా లిథియం, నికెల్ ధాతువులు/మధ్యంతర ఉత్పత్తులను అధిక స్వచ్ఛత గల సమ్మేళనాలుగా రూపొందించడం దీని ధ్యేయం. నికెల్ ఉత్పత్తిలో ఉప-ఉత్పత్తిగా కోబాల్ట్‌ను కూడా వెలికితీయవచ్చునని అంచనా. విద్యుత్ రవాణా, బ్యాటరీ ఇంధన నిల్వ వ్యవస్థ, ఎలక్ట్రానిక్స్, రక్షణ, స్పెషాలిటీ స్టీల్ వగైరా కీలక రంగాలకు ఈ పథకం మద్దతిస్తుంది.
****
ఈ ప్రతిపాదిత పథకం 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31దాకా కొనసాగుతుంది. ఈ ఐదేళ్ల కాలానికిగాను రూ.2,814 కోట్ల మేర నిధుల కేటాయింపు అవసరం. తదనుగుణంగా నాలుగు కీలక ఖనిజ శుద్ధి కర్మాగారాల ఏర్పాటు, అర్హత గల పెట్టుబడిపై 30 శాతం మూలధన రాయితీని ఈ పథకం కింద కల్పిస్తారు. వీటిలో (ఒక్కొక్కటి కనీసం 30 కేటీ సామర్థ్యంగల) 2 లిథియం శుద్ధి కర్మాగారాలు, (ఒక్కొక్కటి కనీసం 50 కేటీ సామర్థ్యంల) 2 నికెల్ శుద్ధి కర్మాగారాలు ఉంటాయి. గరిష్ఠ మూలధన మద్దతు కింద వరుసగా లిథియం, నికెల్ లబ్ధిదారు సంస్థలకు రూ.500 కోట్లు, రూ.900 కోట్ల వంతున పరిమితితో ఆర్థిక మద్దతు లభిస్తుంది.
ఇందుకోసం రెండు దశల ప్రక్రియ ద్వారా లబ్ధిదారు సంస్థలను ఎంపిక చేస్తారు. తొలిద శలో దరఖాస్తులను సాంకేతిక అర్హత కోసం మదింపు చేస్తారు. సాంకేతికంగా అర్హత సాధించిన దరఖాస్తుదారులు మాత్రమే రెండో దశ ఆర్థిక బిడ్డింగ్‌లో పాల్గొనడానికి అర్హులవుతారు. ప్రతి ఖనిజానికీ అత్యల్ప వ్యయ ప్రమాణం ప్రాతిపదికగా… అంటే- బిడ్డర్లు కోరే అత్యల్ప కేపెక్స్ మద్దతు ప్రకారం రెండు సంస్థలను ఎంపిక చేస్తారు. నిర్దిష్ట లక్ష్యాల సాధనకు ముడిపెడుతూ మూడు విడతలుగా ప్రోత్సాహకాలను మంజూరు చేస్తారు.
పటిష్ట దేశీయ ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాల కల్పనకు మద్దతుతోపాటు కీలక ఖనిజ విలువ వ్యవస్థ అంతటా దేశీయ సామర్థ్య బలోపేతం ద్వారా స్వయంసమృద్ధ భారత్ లక్ష్యాల దిశగా ప్రస్థానంలో ఇదొక కీలక ఘట్టం అనడంలో సందేహం లేదు.
Do you feel India should depend on other countries for processing the critical minerals that power our future? I certainly don’t! Lithium, nickel, cobalt…these are essential for EVs, batteries, electronics and defence. Yet, we remain heavily dependent on imports of refined materials. To address this, the Cabinet has approved a scheme to change this. Key highlights: New critical mineral processing plants. Capital subsidy to boost investment. Greater domestic value addition. Stronger supply chains. The principle is clear...India must have capabilities to build technologies of the future! https://t.co/deencvjivt
— Narendra Modi (@narendramodi) November 4, 2026