Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దేశ కార్మిక వర్గానికి సామాజిక భద్రతా పరిధి విస్తరణను వివరించే కథనాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని


దేశంలో పెద్ద సంఖ్యలో కార్మిక వర్గం సామాజిక భద్రతా పరిధిలోకి వచ్చిన తీరును వివరిస్తూ.. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ శ్రీ అశోక్ కుమార్ లాహిరి రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు.

ఈపీఎఫ్ వేతన పరిమితిని పెంచడం, తద్వారా పెద్ద సంఖ్యలో కార్మికులు భవిష్య నిధి, పింఛను, బీమా రక్షణ పరిధిలోకి రావడం వంటి అంశాలను శ్రీ లాహిరి తన వ్యాసంలో వివరించారు. ఉద్యోగాల్లో నిలకడ, స్థిరత్వం, మరింత క్రమబద్ధీకరణల దిశగా ఈ విస్తృత స్థాయి కవరేజీ ఎలా దోహదపడుతుందో ఆయన చర్చించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొన్నది:

“దేశంలో శ్రామిక శక్తిని విస్తృతంగా సామాజిక భద్రత పరిధిలోకి తీసుకొస్తున్నాం.

ఈపీఎఫ్ వేతన పరిమితిని పెంచడం, తద్వారా పెద్ద సంఖ్యలో కార్మికులు భవిష్య నిధి, పింఛను, బీమా రక్షణ పరిధిలోకి రావడం తదితర అంశాలపై @NITIAayog వైస్ చైర్మన్ శ్రీ అశోక్ కుమార్ లాహిరి వివరంగా ఈ వ్యాసంలో పేర్కొన్నారు.

ఉద్యోగులు దీర్ఘకాలం పనిచేయడం, ఉద్యోగ స్థిరత్వం, ఉద్యోగాల్లో మరింత క్రమబద్ధీకరణల్లో ఈ విస్తృత స్థాయి కవరేజీ ఎలా దోహదపడుతుందో ఆయన చర్చించారు.

ఉద్యోగాల్లో నిలకడ, స్థిరత్వం, మరింత క్రమబద్ధీకరణల దిశగా ఈ విస్తృత స్థాయి కవరేజీ ఎలా దోహదపడుతుందో ఆయన వివరంగా చర్చించారు.

https://www.livemint.com/opinion/online-views/epfo-wage-ceiling-hike-25000-workers-social-security-benefits-11795167904065.html” 

***