Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కాబూల్ లో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండించారు; దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల సంతాపం తెలిపారు.


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కాబూల్ లో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండించారు. దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

“కాబూల్ లో ఉగ్రవాదులు దాడికి తెగబడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ దుశ్చర్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల సంతాపం తెలుపుతున్నాను. ఉగ్రవాదంపై అఫ్గానిస్తాన్ సాగిస్తున్న పోరాటంలో భారతదేశం అఫ్గానిస్తాన్ కు అండగా నిలబడుతుంది” అని ప్రధాన మంత్రి అన్నారు.

***