Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశం, బాంగ్లాదేశ్ ల మధ్య కోస్తా తీర మరియ ప్రోటోకాల్ రూట్ లలో ప్రయాణికుల సముద్ర యాత్ర సేవలకు సంబంధించిన ఎమ్ఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


భారతదేశం, బాంగ్లాదేశ్ ల మధ్య కోస్తా తీర మార్గాలలోను, ప్రోటోకాల్ రూట్ లలోను ప్రయాణికుల సముద్ర యాత్ర సేవలకు సంబంధించిన అవగాహనపూర్వక ఒప్పందం (ఎమ్ఒయు)కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇరు దేశాల నడుమ జల మార్గాలలో చిన్న ఓడల ద్వారా ప్రయాణికులు, పర్యటకులు క్రమం తప్పక రాకపోకలు జరపడాన్ని ప్రారంభించేందుకు ఉద్దేశించిన ఎమ్ఒయు ఇది.

ఈ ఎమ్ఒయు ఆచరణలోకి వస్తే, ఉభయ దేశాల మధ్య ఆర్థికపరమైన, సాంఘికపరమైన మరియు సంస్కృతిపరమైన పురోగతులకు సంబంధించి ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలకు ప్రోత్సాహం లభించగలదు. అంతే కాకుండా ఇది భారతదేశం, బాంగ్లాదేశ్ ల ప్రజలకు ఉపాధి అవకాశాలను కూడా అందించగలుగుతుంది.

****