Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వార‌ణాసికి ఫైనాన్షియ‌ల్ ఇంక్లూజ‌న్ ప్రారంభించిన ప్ర‌ధాని

ప్ర‌ధాని శ్రీ‌ న‌రేంద్ర‌మోదీ శుక్ర‌వారం వార‌ణాసి ప్ర‌జ‌ల‌కు ఫైనాన్షియ‌ల్ ఇంక్లూజ‌న్ ను ప్రారంభించారు. ఇందులో భాగంగా వార‌ణాసిలోని అల్పాదాయ వ‌ర్గాల‌కు 101 ఇ రిక్షాలు, 501 పెడ‌ల్ రిక్షాలు, తోపుడు బ‌ళ్ల‌ను పంపిణీ చేశారు. ల‌బ్ధిదారులంద‌రికీ ప్ర‌ధాన‌మంత్రి జ‌న్ ధ‌న్ యోజ‌న కింద బ్యాంకు ఖాతాలు, రూపే కార్డులు జారీ చేయ‌నున్నారు. ఇ రిక్షాల‌న్నింటికీ జిపిఆర్ఎస్‌, కెమెరాల వంటి డిజిట‌ల్ గాడ్జెట్లు అమ‌ర్చారు.

సిడ్బి, ఐడిబిఐ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌, అమెరికా ఇండియా ఫౌండేష‌న్ వంటి వివిధ సంస్థ‌ల నిర్వ‌హ‌ణ‌లోని ఫైనాన్షియ‌ల్ ఇంక్లూజ‌న్ కార్య‌క‌లాపాల‌తో వాటిని అనుసంధానం చేశారు. ఆ సంస్థ‌ల‌కు చెందిన సీనియ‌ర్ అధికారులంద‌రూ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

వార‌ణాసి ప్ర‌జ‌ల జీవితాల్లో మార్పున‌కు ఇది ఒక శుభారంభ‌మ‌ని ప్ర‌ధాని ప్ర‌క‌టించారు. పేద‌రిక నిర్మూల‌న‌కు గ‌తంలో కూడా ఎన్నో కార్య‌క్ర‌మాలు అమ‌లు జ‌రిగాయ‌ని, ద‌శాబ్దాలు గ‌డిచినా అవి ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేద‌ని ప్ర‌ధాని అన్నారు. పేద‌రిక నిర్మూల‌న‌కు చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల ఫ‌లితాలు మ‌రింత‌గా విస్త‌రించాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని, వాటి వేగం పెంచాల్సి ఉన్న‌ద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. భ‌విష్య‌త్ త‌రాల జీవ‌న ప్ర‌మాణాలు మెరుగుప‌రిచేందుకు శ్ర‌మించి ప‌ని చేసేందుకు పేద ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నార‌ని ప్ర‌ధాని చెప్పారు. పేద‌లు స్వ‌యం స‌మృద్ధిని సాధించేందుకు నైపుణ్యాల వృద్ధి కోసం ప్ర‌భుత్వం ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు.
రిక్షాలు, తోపుడు బ‌ళ్లు పొందిన ల‌బ్ధిదారుల‌తో ప్ర‌ధాని అంత‌కు ముందు మాట్లాడారు. త‌మ పిల్ల‌ల‌కు మంచి విద్య అందించ‌డం నుంచి తోపుడు బ‌ళ్ల‌ ద్వారా తాము ఆర్జించే ఆదాయాలు పెంచుకోవ‌డం వ‌ర‌కు వారి క‌ల‌ల గురించి ఆ స‌భ‌కు హాజ‌రైన ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు.

ఇటీవ‌ల ర‌క్షాబంధ‌న్ ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా వార‌ణాసి నుంచి త‌న‌కు భారీ సంఖ్య‌లో అందిన రాఖీల గురించి ప్ర‌స్తావిస్తూ ఆ రాఖీల ద్వారా త‌మ శుభాశీస్సులు అందించిన త‌ల్లులు, సోద‌రీమ‌ణుల‌కు ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.