Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రేపు వార‌ణాసిని సంద‌ర్శించ‌నున్న ప్ర‌ధాని


ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రేపు వార‌ణాసిని సంద‌ర్శించ‌నున్నారు. వార‌ణాసిలో ఏర్పాటు చేసిన ఓ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని హాజ‌ర‌వుతారు. రిక్షా సంఘ్ ఆధ్వ‌ర్యంలో జ‌ర‌గ‌నున్న ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన‌మంత్రి జ‌న్ ధ‌న్‌ యోజ‌న కింద‌ 602 కుటుంబాల‌కు ప్యాకేజీ ని అందజేస్తారు. 501 పెడ‌ల్ రిక్షాలు, 101 ఇ-రిక్షాలను ల‌బ్ధిదారుల‌కు ఇస్తారు. 1000 సౌర‌శ‌క్తి విద్యుత్ లాంత‌ర్లను రిక్షాలకూ, తోపుడు బ‌ళ్ల‌వారికీ, వీధుల్లో వ్యాపారాలు చేసుకునేవారికీ అంద‌జేస్తారు. ఆ త‌రువాత ల‌బ్ధిదారుల‌ను ఉద్దేశించి ప్ర‌ధాని మాట్లాడుతారు.

అనంత‌రం డి.ఎల్‌.డ‌బ్ల్యూ. మైదానం లో జ‌రిగే బ‌హిరంగ స‌భ‌లో ఇంటిగ్రేటెడ్ ప‌వ‌ర్ డెవ‌ల‌ప్ మెంట్‌ ప‌థ‌కాన్ని ప్ర‌ధాని ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన మౌలిక వ‌న‌రుల క‌ల్ప‌న ప్రాజెక్టు కు శంకుస్థాప‌న చేస్తారు. బ‌నార‌స్ హిందూ విశ్వ‌విద్యాల‌యం లోని ట్రామా సెంట‌ర్ ను రిమోట్ కంట్రోల్ తో జాతికి అంకితం చేస్తారు. రామ్ న‌గ‌ర్‌ పోస్టాఫీసు లో ప్ర‌యాణికుల రిజ‌ర్వేష‌న్ సౌక‌ర్యాన్ని కూడా రిమోట్ తో ప్రారంభిస్తారు.