Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భార‌త్‌, జ‌పాన్ దేశాల మ‌ధ్య ప‌ట్టు ప‌రుగులు, ప‌ట్టు ప‌రిశ్ర‌మ రంగాల‌లో సంయుక్త ప‌రిశోధ‌న‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం


కేంద్ర సిల్క్ బోర్డు (సిఎస్‌బి), నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆగ్రో బ‌యోలాజిక‌ల్ సైన్సెస్ మ‌ధ్య ప‌ట్టు ప‌రిశ్ర‌మ రంగంలో సంయుక్త ప‌రిశోధ‌న‌ల‌కు సంబంధించి ఉన్న ఒప్పందాన్ని (ఎమ్ఒయు)ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న ఈ రోజు జ‌ర‌గిన మంత్రి మండ‌లి స‌మావేశం దృష్టికి తెచ్చారు.

ఈ ఒప్పందం 11.11.2016న కుదిరింది. భార‌త‌దేశ వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌కు అనువైన హైబ్రిడ్ ప‌ట్టు పురుగుల‌ను అభివృద్ధి చేయ‌డానికి ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతాయి. ఈ ర‌కం ప‌ట్టు పురుగుల అభివృద్ధి వ‌ల్ల మ‌న దేశంలో ఉత్ప‌త్తి అయ్యే ప‌ట్టు రాశి, వాసి పెర‌గ‌డ‌మే గాక‌, ప‌ట్టు ఉత్ప‌త్తుల ఎగుమ‌తి కూడా పెరుగుతుంది.

ఈ ఒప్పందం వ‌ల్ల భార‌త్ జౌళి, దుస్తుల ప‌రిశ్ర‌మ ఉత్ప‌త్తుల నాణ్య‌త పెరిగి ఎగుమ‌తులు వృద్ధి చెందుతాయ‌ని భావిస్తున్నారు.