పిఎంఇండియా
బిఎస్ఎన్ఎల్ కు చెందిన మొబైల్ టవర్ ఆస్తులను మరొక కంపెనీగా మార్చే ప్రక్రియను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదించింది.
దీని వల్ల బిఎస్ఎన్ఎల్ మరొక కంపెనీని ఏర్పాటుచేసి, తన మొబైల్ టవర్ ద్వారా ఆదాయం సమకూర్చుకుంటుంది. దేశంలో ఉన్న 4,42,000 మొబైల్ టవర్లలో 66,000 టవర్లు బిఎస్ఎన్ఎల్ కు చెందినవే. ఈ కంపెనీ ద్వారా వీటిని అద్దెకు ఇవ్వడం వల్ల బిఎస్ఎన్ఎల్ కు ఆదాయం పెరగనుంది.