Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఎస్ యు- 30ఎమ్ కెఐ నుండి ప్రప్రథమంగా బ్రహ్మోస్ ఎఎల్ సిఎమ్ ను విజయవంతంగా పరీక్షించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ప్ర‌ధాన మంత్రి


ఎస్ యు- 30ఎమ్ కెఐ యుద్ధ విమానం నుండి తొలి సారి బ్రహ్మోస్ ఏర్ లాంచ్ డ్ క్రూజ్ మిసైల్ (ఎఎల్ సిఎమ్) ను విజయవంతంగా పరీక్షించడం పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రశంసాయోగ్య సాహసకృత్యంలో పాలు పంచుకొన్న వారందరినీ ప్రధాన మంత్రి అభినందించారు.

‘‘ఎస్ యు- 30ఎమ్ కెఐ యుద్ధ విమానం నుండి తొలి సారి బ్రహ్మోస్ ఏర్ లాంచ్ డ్ క్రూజ్ మిసైల్ (ఎఎల్ సిఎమ్) ను విజయవంతంగా పరీక్షించడం సంతోషదాయకం. ఈ ప్రశంసాయోగ్య సాహసకృత్యంలో పాలు పంచుకొన్న వారందరికీ అభినందనలు’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.