Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వ్యవసాయం, ఇంకా చేపల వ్యాపార రంగాలలో భారతదేశం మరియు కొలంబియా ల మధ్య ఎమ్ఒయు పై సంతకాలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


భారతదేశం, కొలంబియా ల మధ్య వ్యవసాయం మరియు చేపల వ్యాపార రంగాలలో అవగాహనపూర్వక ఒప్పంద పత్రం ( ఎమ్ఒయు) పైన సంతకాలు చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఈ ఒప్పందం, వినూత్నమైన వ్యవసాయ పద్దతులకు మరియు యాంత్రీకరణకు సంబంధించి పరస్పర సహకారానికి వీలు కలిపిస్తుంది.

అదే విధంగా, విజయవంతమైన వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ రంగంలో పరస్పర సహకారానికి, వ్యవసాయ పరిశ్రమ సహకారంతో విత్తన ఉత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటు, పండ్లు, పూలు, కూరగాయలు వంటి ఉద్యానవన పంటలకు అదనపు విలవను చేకూర్చే వినూత్న ఉత్పత్తుల తయారీ రంగాలలో పరస్పర సహకారానికి అవకాశం కలిపిస్తుంది.

అలాగే, సమాచార ఆదాన ప్రదానం, ఉభయ దేశాలకు చెందిన వ్యవసాయ రంగ నిపుణుల పరస్పర పర్యటనలకు ఈ ఒప్పందం అవకాశం కలిపిస్తుంది.

జట్రోఫా ఇంకా కరాయా, నూనె గింజలు, ఆయిల్ పామ్ ల సంబంధిత పరిశోధన రంగంలో సహకారం ఈ ఒప్పందం లోని మరో కీలక అంశంగా ఉంటుంది.

ఇక చేపల వ్యాపారాభివృద్ధి విషయానికి వస్తే, సముద్రపు చేపల వేట, చేపల అభివృద్ధి, పరిశోధన, శిక్షణ రంగాలలో పరస్పర సహకారం, పశువులు, గొర్రెలు,మేకలు, పందులు వంటి చిన్నా పెద్దా పశువుల ఉత్పాదకత వ్యాధి నిరోధం, వ్యాధి నిర్ధారణ, పంది మాంసం ఉత్పత్తి పద్దతులలో సహకారం వంటి అంశాలు ఇందులో భాగంగా ఉన్నాయి.

అవగాహనపూర్వక ఒప్పంద పత్రం పరిధిలో, రానున్న రెండు సంవత్సరాల కాలానికి నిర్దిష్ట కార్య ప్రణాళికను రూపొందించడం/ తుది నిర్ణయం చేయడం కోసం సంయుక్త కార్యాచరణ బృందాన్ని (జెడబ్ల్యుజి ని) నియమిస్తారు. అవగాహనపూర్వక ఒప్పందం తొలుత ఐదు సంవత్సరాల కాలానికి అమలులో ఉంటుంది. దీనిని రద్దు చేసుకొనే కోరికను/ అభిప్రాయాన్ని ఉభయ పక్షాలలో ఏ పక్షమైనా వ్యక్తం చేయనట్లయితే, దానంతట అదే మరో ఐదు సంవత్సరాలకు పొడిగింపు నకు లోనవుతుంది.

***