Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశం లో పామ్ ఆయిల్ విస్తీర్ణం మరియు ఉత్పత్తి పెంపొందించే చర్యలకు మంత్రిమండలి ఆమోదం


భారతదేశం లో పామ్ ఆయిల్ విస్తీర్ణం మరియు ఉత్పత్తి పెంపొందించే చర్యలకు ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన కేంద్రమంత్రి మండలి ఆమోదం. 

ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

  1. నూనె గింజలు మరియు పామ్ ఆయిల్ పై జాతీయ మిషన్ (NMOOP) కింద పామ్ ఆయిల్ సాగుకు భూ సీలింగ్ పరిమితి సడలింపు. 

 

పామ్ ఆయిల్ పట్ల కార్పొరేట్ సంస్థలను ఆకర్షించి, 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడం కోసం – NMOOP కింద 25 హెక్టార్ల కంటే ఎక్కువ ప్రాంతానికి సహాయం కల్పించడంలో ఉన్న ఆంక్షలను సడలించడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 

 

ii .      NMOOP కి చెందిన మినీ మిషన్ – I I కింద సహాయం చేయడానికి నిబంధనల సడలింపు

 

ముఖ్యంగా మొక్కలు నాటడానికి ఉపయోగపడే వస్తువులు, నిర్వహణ వ్యయం, అంతర పంటల వ్యయం తో పాటు పామ్ ఆయిల్ మొక్కలను  ఆకర్షణీయంగా తయారు చేయడానికి గొట్టపు బావుల నిర్మాణం మొదలైన వాటికోసం – మంత్రిమండలి నిబంధనలు సడలించడానికి కూడా తన ఆమోదం తెలిపింది. 

 

ఈ చర్యలు దిగువ తెలియజేసిన ఫలితాలను ఇస్తాయి.

 

*           కార్పొరేట్ సంస్థల ద్వారా పెద్ద ఎత్తున పామ్ ఆయిల్ చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడానికి – అలాగే బంజరు భూములను ఉపయోగించుకోడానికి.  NMOOP కింద నిబంధనలను సడలించడం ద్వారా – ప్రయివేటు పారిశ్రామిక వేత్తలు / సహకార సంస్థలు / భాగస్వామ్య వెంచర్లు – పామ్ ఆయిల్ చెట్ల పెంపకం లోనూ, NMOOP సహాయం ఉపయోగించుకోవడం లోనూ తమ ఆసక్తి ని వ్యక్తపరుస్తాయి. 

 

*          పెద్ద మొత్తంలో పామ్ ఆయిల్ సాగు చేపట్టే విధంగా రైతులను ప్రోత్సహించడం. వ్యయ నిబంధనల సవరణ – రైతులను పామ్ ఆయిల్ చెట్ల పెంపకం చేపట్టే విధంగా ఛైతన్య పరుస్తుంది. 

 

సవరించిన వ్యయ నిబబంధనల ఆధారంగా – రాష్ట్రాల / వివిధ సంస్థల వార్షిక కార్యాచరణ ప్రణాళిక (AAP) ను – వ్యవసాయం, సహకారం మరియు రైతుల సంక్షేమ శాఖ ఆమోదిస్తుంది.  తమ రాష్ట్రాల్లో పామ్ ఆయిల్ మొక్కల పెంపకం కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు – ప్రయివేటు సంస్థలు / సహకార సంస్థలు / జాయింటు వెంచర్లను ఆహ్వానిస్తాయి. 

 

ప్రస్తుతం ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మిజోరాం, ఒడిశా, కేరళ, తెలంగాణా, ఛత్తీస్గఢ్, గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అస్సామ్ వంటి 12 రాష్ట్రాలలో అమలౌతోంది.  ఈ 12 రాష్ట్రాలలోని సుమారు 133 జిల్లాలలో పామ్ ఆయిల్ సాగు చేస్తున్నారు. పామ్ ఆయిల్ సాగుకు అనువైన అన్ని రాష్ట్రాలు NMOOP కింద కు వచ్చాయి. 

 

ప్రాంతీయ ఆంక్షలు సడలించడంలో మరియు రాయితీ నిబంధనలను తగ్గించడంలో కొన్ని ఆర్ధిక చిక్కులు ఉన్నాయి. అయితే వాటిని NMOOP నిధి కి లోబడి  కల్పించవచ్చు. అందువల్ల అదనపు నిధుల అవసరం ఉండదు. 

 

12వ పంచవర్ష ప్రణాళిక లో సంవత్సరాల వారీగా భౌతిక, ఆర్ధిక ప్రగతి ఈ విధంగా ఉంది : 

 

లక్ష్యం  

సాధించినది  

 కేటాయింపు విడుదల 

 

2012-13

 

ISOPOM 

& OPAE

 

49932

 

26300

 

22705.74

 

6412.62

 

2013-14

 

ISOPOM & OPAE 

 

41347

23183

 

19776.19

 

11849.09

 

2014-15

 

NMOOP

 

28146

 

17143

 

7290.58

 

4112.47

 

2015-16

 

NMOOP

 

27337

 

14425

 

6683.80

 

3823.49

 

2016-17*

 

NMOOP

 

30061

 

9968

 

8038.68

 

4241.57

 

సంవత్సరం 
 
పధకం      పేరు  పామ్ ఆయిల్ ప్రాంత విస్తరణ  (హెక్టార్లలో)
 
 మొత్తం 
(లక్షల రూపాయలలో)
 

 

*  2016 డిసెంబర్ వరకు 

 

ప్రస్తుతం పామ్ ఆయిల్ అభివృద్ధి కార్యక్రమాన్ని  రైతుల స్వంత క్షేత్రాల్లోనే చేపట్టడం జరుగుతోంది. అందువల్ల పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపట్టే – ప్రయివేటు పారిశ్రామిక వేత్తలు / కార్పొరేట్ సంస్థలు / భాగస్వామ్య వెంచర్లకు నేరుగా సహాయం అందించడానికి అవకాశం లేదు.    పామ్బం ఆయిల్ సాగు చేపడుతున్న రాష్ట్రాల్లో – బంజరు భూమి / సారవంతం కానీ భూమి / సాగుకు అనువైన భూములను – పామ్ ఆయిల్ మొక్కల పెంపకం కోసం ప్రయివేటు పారిశ్రామికవేత్తలు / సహకార సంస్థలు / భాగస్వామ్య వెంచర్లకు  లీజు / అద్దెకు లేదా కొనుగోలు ద్వారా సమకూర్చవచ్చు.    అయితే, NMOOP కింద 25 హెకార్లకు మాత్రమే ఆర్ధిక సహాయం అందుతుంది.   అందువల్ల, పామ్ ఆయిల్ పట్ల కార్పొరేట్ సంస్థలను ఆకర్షించడానికి మరియు నూరు శాతం ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల ప్రయోజనాన్ని పొందడానికి NMOOP కింద నిబంధనలను సడలించవలసిన అవసరం ఉంది. స్వంత వ్యవసాయం, కాంట్రాక్టు వ్యవసాయం, సమిష్టి వ్యవసాయం (భూ పరిమితి నిబంధనలను సడలించడం ద్వారా ) వంటి వాటిని కలిపి అమలుచేయడం ద్వారా మాత్రమే దేశంలో పామ్ ఆయిల్ సాగును పెంపొందించే అవకాశం ఉంది.   NMOOP కార్యక్రమం రూపొందించే సమయంలో అమలులో ఉన్న ధరల ఆధారంగా వివిధ పథకాల కింద సహాయానికి నిబంధనలను నిర్ణయించడం జరిగింది.  మొక్కలు నాటడానికి ఉపయోగించే వస్తువులు, గోతులు తవ్వడానికి, మొక్కలు నాటడానికి, ఎరువులు, సాగు నీరు మరియు నాలుగు సంవత్సరాల పాటు ఎటువంటి ఆదాయం లేకుండా  మొక్కలను  పెంచడానికి భారీగా పెట్టుబడి అవసరమైన దృష్ట్యా  – ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు పామ్ ఆయిల్ మొక్కల పెంపకం చేపట్టడానికి విముఖత చూపుతున్నారు.   దీనికి తోడు, పామ్ ఆయిల్ సాగుకు అనుకూలంగా ఉండే ఈశాన్య రాష్ట్రాల్లో – కొండ ప్రాంతాల కారణంగా అక్కడ భూమిని సిద్ధం చేయడానికి అదనపు పెట్టుబడి అవసరమవుతుంది. 

 

నేపధ్యం

 

ఇళ్లల్లో ఉపయోగించే ఆహార పదార్ధాలలో వంట నూనె చాలా ముఖ్యమైనది.   దేశంలో మొత్తం వంటనూనెల ఉత్పత్తి 9 మిలియన్ మెట్రిక్ టన్నులు కాగా దేశీయ వినియోగానికి దాదాపు 25 మిలియన్ మెట్రిక్ టన్నులు అవసరమౌతాయి.    ఈ డిమాండ్ మరియు సరఫరా మధ్య వ్యత్యాసాన్ని దిగుమతుల ద్వారా భర్తీ చేసుకుంటున్నాము.  ఇది 2015-16 (తాత్కాలికం) లో 68 వేల కోట్ల రూపాయలుగా ఉంది.    మొత్తం వంటనూనెల దిగుమతిలో పామ్ ఆయిల్ వాటా 70 శాతం ఉంది. హెక్టారుకు దిగుబడి ఎక్కువగా ఉండటం వల్ల – చౌకగా లభించే నూనెల్లో ఇది ఒకటిగా ఉంది.   ప్రపంచంలోనే కూరగాయల నూనెల్లో హెక్టారుకు దిగుబడి ఎక్కువగా వచ్చే అతి సమర్ధవంతమైన పంటల్లో ఒకటిగా పామ్ ఆయిల్ పేరుగాంచింది.  అదేవిధంగా పామ్ ఆయిల్  ప్రపంచంలోనే అతి పెద్ద కూరగాయల నూనెల వనరుల్లో ఒకటిగా ఉంది. మలేషియా, ఇండోనేషియా, నైజీరియా, థాయిలాండ్, కొలంబియా దేశాలు పామ్  ఆయిల్ ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాలు గా ఉన్నాయి.   పండిన గింజల నుండి అత్యధికంగా హెక్టారుకు 1.3 టన్నుల దిగుబడి కాగా – పామ్ ఆయిల్ నుండి హెక్టారుకు 4 నుండి 5 టన్నుల సరాసరి దిగుబడి నమోదయ్యింది.   భారత ప్రభుత్వం 1986-87 నుండి పలు కార్యక్రమాలను అమలుచేయడం ద్వారా –  వీటితోపాటు 2014-15 నుండి NMOOP ద్వారా – పామ్ ఆయిల్ ను ప్రోత్సహిస్తోంది.   2016-17 చివరినాటికి 1.25 లక్షల హెక్టార్ల అదనపు భూమిని పామ్ ఆయిల్ సాగులోకి తీసుకురావాలని NMOOP ఉద్దేశించింది.    పామ్ ఆయిల్ సాగు భూమిని విస్తరించడానికి చేపట్టిన చర్యల ఫలితంగా 1991-92 లో 8,585 హెక్టార్లుగా ఉన్న పామ్ ఆయిల్ సాగు విస్తీర్ణం 2015-16 చివరినాటికి దాదాపు 3 లక్షల హెక్టార్లకు చేరుకుంది.    అదేవిధంగా, తాజా పండ్ల గుత్తుల ఉత్పత్తి (FFBs) 1992-93 లో 21,233 టన్నుల నుంచి 2014-15 నాటికి 11,50,000 టన్నులకు పెరిగింది. అలాగే ముడి పామ్ ఆయిల్ (CPO) 1992-93 లో 1,134 టన్నుల నుంచి 2014-15 నాటికి 1,98,00 టన్నులకు చేరుకుంది.  

 

                                    *****