Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బ్రిక్స్‌ నాయకుల సమావేశం లో ప్రధాని ప్రసంగం

బ్రిక్స్‌ నాయకుల సమావేశం లో ప్రధాని ప్రసంగం

బ్రిక్స్‌ నాయకుల సమావేశం లో ప్రధాని ప్రసంగం


గౌర‌వ‌నీయ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌

గౌర‌వ‌నీయ ప్రెసిడెంట్ జీ జిన్ పింగ్‌

గౌర‌వ‌నీయ ప్రెసిడెంట్ జాక‌బ్ జుమా

గౌర‌వ‌నీయ ప్రెసిడెంట్ దిల్మా రూసెఫ్‌

మ‌న‌కి ఆతిథ్యం ఇస్తున్న ప్రెసిడెంట్ పుతిన్ చేసిన అద్భుత‌మైన ఏర్పాట్ల‌కు, బ్రిక్స్‌కు ఆయ‌న అందిస్తున్న నాయ‌క‌త్వానికి కృత‌జ్ఞ‌త‌లు.

ఏడ‌వ బ్రిక్స్ స‌ద‌స్సు విజ‌య‌వంతంగా నిర్వ‌హించుకుంటున్న‌ సంద‌ర్భంగా అంద‌రికీ అభినంద‌న‌లు

గౌర‌వ‌నీయ మిత్రులారా

పారిస్‌లో జ‌రిగిన అత్యంత భ‌యంక‌ర‌మైన ఉగ్ర‌వాద దాడిని మ‌నంద‌రం ముక్త‌కంఠంతో తీవ్రంగా ఖండించాల్సిఉంది. సినాయ్‌లో జ‌రిగిన ప్రాణ‌న‌ష్టం విష‌యంలో ర‌ష్యాకు కూడా మ‌నం పూర్తి సానుభూతి, మ‌ద్ద‌తు ప్ర‌క‌టిద్దాం. ఉగ్ర‌వాదం త్వ‌రిత‌గ‌తిన విస్త‌రిస్తున్న‌ద‌నేందుకు అంకారా, బీరూట్ దాడులు కూడా నిద‌ర్శ‌న‌మే.

ఉగ్ర‌వాద చ‌ర్య‌ల‌ను యావ‌త్ మాన‌వాళి ఒక్క‌టిగా నిలిచి ఖండించాల్సి ఉంది. ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా ప్ర‌పంచం యావ‌త్తు ఒక్క‌టిగా పోరాడేందుకు ఇంత‌కు మించిన స‌మ‌యం మ‌రొక‌టి ఉండ‌దు. బ్రిక్స్ దేశాలు కూడా దీన్ని ప్రాధాన్య‌తా ప్రాతిప‌దిక‌న చేప‌ట్టాలి.

బ్రిక్స్ వేదిక ఏర్పాట‌యిన‌ప్పుడు అస‌లు ఈ వేదిక అవస‌ర‌మా, ఇది దీర్ఘ‌కాలం మ‌న‌గ‌లుగుతుందా అని అనుమానించిన‌వారున్నారు. కాని వ‌ర్త‌మాన ప్ర‌పంచంలో బ్రిక్స్ వంటి వేదిక ఎంత అవ‌స‌ర‌మో కార్యాచ‌ర‌ణ ద్వారా మ‌నం ప్ర‌పంచానికి చాటి చెప్పాం. తీవ్ర స‌వాళ్ళ‌తో కూడిన అంత‌ర్జాతీయ వాతావ‌ర‌ణంలో బ్రిక్స్ అవ‌త‌రించింది.

బ్రిక్స్ దేశాలు ఏర్పాటు చేసుకున్న కొత్త అభివృద్ధి బ్యాంకు, క‌రెన్సీ రిజ‌ర్వ్, బ్రిక్స్ ఆర్థిక స‌హకార వ్యూహం మ‌నంద‌రి ఉమ్మ‌డి క‌ట్టుబాటుకు, ఉమ్మ‌డి దిశ‌కు నిద‌ర్శ‌నం. మ‌నంద‌రం క‌లిసిక‌ట్టుగా జి 20కి కూడా ఒక రూపం ఇవ్వ‌గ‌లం.

బ్రిక్స్‌కు భార‌త్ అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. 2016 ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీన బ్రిక్స్ సార‌థ్య బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం కూడా మాకు ప్ర‌త్యేక గౌర‌వం. ఇత‌ర స‌భ్యులంద‌రూ ఇప్ప‌టివ‌ర‌కు ఈ వేదికను ప‌టిష్ఠంగా నిలిపేందుకు చేసిన కృషిని మేం కొన‌సాగిస్తాం.

బ్రిక్స్‌కు బాధ్య‌తాయుత‌మైన‌, స‌మ్మిళిత‌, ఉమ్మ‌డి ప‌రిష్కారాల సాధ‌న (బిల్డింగ్ రెస్పాన్సివ్‌, ఇంక్లూజివ్ అండ్ క‌లెక్టివ్ సొల్యూష‌న్స్) అన్న‌ది బ్రిక్స్‌కు సార‌థ్యం వ‌హించే స‌మ‌యంలో మేం అనుస‌రించాల‌నుకుంటున్న సూత్రం. మ‌న కూట‌మి విలువ‌ల‌కు ఇది చ‌క్క‌ని ద‌ర్ప‌ణంగా నిలుస్తుంది.

బ్రిక్స్ భాగ‌స్వామ్య దేశం చైనా డిసెంబ‌ర్‌లో జి 20 సార‌థ్య బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం ఆనంద‌దాయ‌కం. చైనా సార‌థ్యం వ‌హించే స‌మ‌యంలో ఆ దేశానికి మా సంపూర్ణ స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తామ‌ని నేను హామీ ఇస్తున్నాను.

***