Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆఫ్రికా లోని జోహానిస్ బర్గ్ లో జరిగిన బిఆర్ఐసిఎస్ (‘బ్రిక్స్’) సభ్యత్వ దేశాల పదో శిఖర సమ్మేళనం తాలూకు ప్రకటన


 

http://www.mea.gov.in/images/brics26.jpg

 

4వ పారిశ్రామిక విప్లవం లో సమ్మిళిత వృద్ధి కోసమూ మరియు ఉమ్మడి సమృద్ధి కోసమూ సహకారం

2018 జులై 25-27, శాండ్‌ట‌న్ కన్ వెన్శన్ సెంటర్, జోహానిస్‌బ‌ర్గ్‌

 

 

I.   పీఠిక

 

  1.      బ్రెజిల్రష్యా , భారతదేశం, చైనా మరియు దక్షిణాఫ్రికా దేశాల అధినేతలు, ప్రభుత్వాధినేతలమైన మేము దక్షిణాఫ్రికా రాజధాని జోహానిస్ బర్గ్ లో జూలై  25 నుంచి 27 వరకు జరిగిన పదో బిఆర్ఐసిఎస్ (బ్రిక్స్) శిఖర సమ్మేళనానికి హాజరయ్యాం.  10వ శిఖర సమ్మేళనం బ్రిక్స్ చరిత్ర లో ఓ మైలురాయి వంటిది.  ఈ శిఖరాగ్ర సమ్మేళనానికి  ఆఫ్రికా లో బ్రిక్స్ : 4వ పారిశ్రామిక విప్లవం లో సమ్మిళిత వృద్ధి కోసమూ మరియు ఉమ్మడి సమృద్ధి కోసమూ సహకారంఅనేది ఇతివృత్తం గా ఉంది.

 

  2.     నెల్సన్ మండేలా శత జయంతి సందర్భంగా మేము సమావేశమవుతున్నాం.  ఆయన విలువలను, నైతిక సూత్రాలను, మానవత కు అంకిత భావంతో  ఆయన చేసినటువంటి సేవలనుఅంతర్జాతీయంగా ప్రజాస్వామ్య పోరాటాలకు అందించినటువంటి  తోడ్పాటును, ప్రపంచ వ్యాప్తంగా శాంతి సంస్కృతి ని  ప్రోత్సహించడానికి ఆయన చేసిన కృషి ని  మేము గుర్తించాం.

 

  3.     సాంకేతికతపైన ఆధారపడిన పారిశ్రామికీకరణ మరియు ప్రగతి ల నేపథ్యం లో అభివృద్ధి సమ్మిళిత వృద్ధి, ఉమ్మడి సంపద లు ప్రాతిపదికలు గా జోహానిస్ బర్గ్ శిఖర సమ్మేళనాన్ని జరుపుతున్నందుకు దక్షిణాఫ్రికా ను మేము అభినందిస్తున్నాం.

 

  4.     గడచిన పది సంవత్సరాలలో బ్రిక్స్ సాధించిన ప్రగతి పట్ల మేము సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాం.  ఈ పది సంవత్సరాలలో శాంతిని, సామరస్యాన్నిసమష్టి అభివృద్ధి ని, ఉమ్మడి సంపద ను సాధించడానికి, వాటిని మరింత బలోపేతం చేయడానికి బ్రిక్స్  దేశాల మధ్య కనబడిన సహకారం గణనీయం.  ఆ విధంగా బ్రిక్స్ ఓ బలమైన సంస్థగా  అవతరించింది.

 

  5.     పరస్పర గౌరవం, సార్వభౌమిక సమానత్వం, ప్రజాస్వామ్యం, సమీకృత పటిష్ట సహకారం వంటి సూత్రాలకు కట్టుబడిన బ్రిక్స్ విధి విధానాలకు మేము పునరంకితం అవుతున్నాం .  ప్రతి ఏటా జరిగే శిఖర సమ్మేళనాల ద్వారా బ్రిక్స్ ను మరింత బలోపేతం చేయడానికి సభ్య దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి, తద్వారా మన ప్రజలకు ప్రయోజనం చేకూర్చడానికి కట్టుబడి ఉన్నాం.  ఇందుకోసం శాంతి ని ప్రోది చేయడం, న్యాయమైన అంతర్జాతీయ వ్యవస్థను ఏర్పరచడం, నిలకడైన అభివృద్ధి ని, సమీకృత ప్రగతి ని సాధించడం లక్ష్యం.  తద్వారా ఆర్ధిక రంగం, శాంతి, భద్రత అనే మూడు స్తంభాల ఆధారంగా సహకారం పెంపొందాలి.  అది బ్రిక్స్ ను  బలోపేతం చేయడం తో పాటు సభ్య దేశాల ప్రజలకు, ప్రజలకు మధ్య ఇచ్చి పుచ్చుకోవడానికి దోహదం చేస్తుంది.

 

  6.     ప్రపంచంలో శాంతి, సుస్థిరత ల పరిరక్షణ లో ఐక్య రాజ్య సమితి కి ప్రధాన భూమిక, ఐక్య రాజ్య సమితి అధికార పత్రం లో పొందుపరచిన విధి విధానాలు లక్ష్యాలు, ఉద్దేశ్యాలు అన్నింటికీ మేము పునరంకితమవుతూ ఉన్నాం.  అంతర్జాతీయ న్యాయానికి, ప్రజాస్వామ్యానికి, న్యాయ పాలన కు ప్రోత్సాహం వంటి అంశాలను గౌరవిస్తున్నాం.  బహుళపార్శ్వికత ను  ఆమోదించడం2030 వ సంవత్సరానికల్లా నిలకడైన అభివృద్ధి లక్ష్యాలను అమలు చేయడం వంటి అంశాల సాధన కు కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉండడాన్ని పునరుద్ఘాటిస్తూనే, అందుకోసం ఎక్కువ మందికి ప్రాతినిధ్యం ఉండే ప్రజాస్వామ్యయుతమైన, సమానత్వంతో కూడిన, న్యాయమైన, నిష్పాక్షికమైన విలువలకు కట్టుబడిన అంతర్జాతీయ రాజకీయ ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు ను ప్రోత్శాహించాలన్నది  మా లక్ష్యం.

 

  7.     బహుపక్షీయత ను, అంతర్జాతీయ సంబంధాల లో న్యాయ పాలన ను బలోపేతం చేయడం తో పాటు నిష్పాక్షికమైన, న్యాయమైన, సమానత్వం తో కూడిన, ప్రజాస్వామ్యయుతమైన, ప్రాతినిధ్య తరహా అంతర్జాతీయ వ్యవస్థ ను ప్రోత్సహించడానికి కలసికట్టుగా పని చేసేందుకు మేము కృతనిశ్చయంతో ఉన్నామని  పునరుద్ఘాటిస్తున్నాం.

 

  8.     బహుపక్షీయ విధానాలకు మద్దతు ఇవ్వడంతో పాటు అంతర్జాతీయ వ్యవహారాలలో ఐక్య రాజ్య సమితి కేంద్రీయ పాత్ర ను పోషించే పద్దతి కి కట్టుబడి ఉన్నట్లు మేము పునరుద్ఘాటిస్తున్నాం.  అంతేకాక ఐక్య రాజ్య సమితి అధికార పత్రం లో పొందుపరచిన ఉద్దేశ్యాల పైన, విధానాల పైన ఆధారపడిన నిష్పాక్షికమైన, న్యాయమైన, సమధర్మంతో కూడిన అంతర్జాతీయ వ్యవస్థ ఏర్పాటు కుఅంతర్జాతీయ న్యాయాన్ని గౌరవించడం, ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడం మరియు అంతర్జాతీయ సంబంధాలలో న్యాయ పాలన.. వీటన్నింటితో పాటు సాంప్రదాయికంగాను, ఇతరత్రానూ వస్తున్న భద్రత పరమైన సవాళ్లను, చెడు అనుభవాలను ఎదుర్కోవడం వంటి వాటికి మేం కట్టుబడి ఉన్నాం. 

 

  9.     జోహానిస్ బర్గ్ శిఖర సమ్మేళనం సందర్భంగా బ్రిక్స్- అఫ్రికా అవుట్ రీచ్  మరియు బ్రిక్స్ సభ్యత్వం లేని వారితో సహకారం కోసం వర్ధమాన విపణులు మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలతో (ఇఎండిసి లు) బ్రిక్స్ ప్లస్ కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని మేము స్వాగతిస్తున్నాం.

 

  10.    ఇటీవల జరిగిన మంత్రుల స్థాయి సమావేశాల ఫలితాల  (అనుబంధం -1) పట్ల మేము సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాంఅలాగే, బ్రిక్స్ 2018 క్యాలండర్ ప్రకారం జరగవలసిన ఇతర సమావేశాల కోసం ఎదురుచూస్తున్నాం.

 

II.          బహుపక్షీయత ను పటిష్టం చేయడం, గ్లోబల్ పాలన ను సంస్కరించడం మరియు ఉమ్మడి సవాళ్ళను ఎదుర్కోవడం.

 

  11.    అంతర్జాతీయ శాంతి ని, భద్రత ను కాపాడటంతో పాటు విశ్వవ్యాప్త అభివృద్ధిని ముందంజ వేయించడం, మానవ హక్కులను ప్రోత్సహించడానికి మరియు పరిరక్షించడానికి అవసరమైన ప్రతిపత్తి ఉన్న విశ్వజనీన సంస్థగా  ఐక్య రాజ్య సమితి అధికారాలను గుర్తిస్తూ, వాటికి మేము  కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటిస్తున్నాం. 

 

  12.    అంతర్జాతీయ శాంతి ని, భద్రత ను కాపాడడంతో పాటు నిలకడైన అభివృద్ధి ని ముందంజ వేయించడం, మానవ హక్కులను ప్రోత్సహించి, పరిరక్షించే బాధ్యతలు గల విశ్వవ్యాప్త అంతర్ ప్రభుత్వ సంస్థ ఐక్య రాజ్య సమితి కి మేము మద్దతు ఇస్తున్నాం.  ఐక్య రాజ్య సమితి అధికార పత్రం లో పొందుపరచిన విధి విధానాలు లక్ష్యాలు, ఉద్దేశ్యాలు అన్నింటికీ కట్టుబడి ఉన్నామని మేము పునరుద్ఘాటిస్తున్నాము.

 

  13.                 గ్లోబల్ పరి   పాలన ను అందించే బహుళ జాతి సంస్థలు గ్లోబల్ సవాళ్ళ ను ఎదుర్కొనే విధంగా వాటిని పటిష్టం చేయాలన్న మా కట్టుబాటు ను పునరుద్ఘాటిస్తున్నాం. 

 

  14.                 విస్తృత బహుళ వ్యవస్థ లక్ష్యాల సాధన దిశగా ప్రాంతీయ స్థాయి లో జరిగే ప్రయత్నాలకు గల సామర్ధ్యాన్ని కూడా మేము గుర్తించాం.

 

  15.                  ఐక్య రాజ్య సమితి అధికార పత్రం లో పొందుపరచిన విశ్వవ్యాప్త సమష్టి భద్రత వ్యవస్థ ప్రాముఖ్యం పట్ల మాకు ఉన్న కట్టుబాటు ను పునరుద్ఘాటిస్తున్నాం.  ఐక్య రాజ్య సమితి అధికార పత్రం పునాది గా బహుళ ధ్రువ ప్రపంచం లో సహకారాన్ని, సుస్థిరత్వాన్ని పెంపొందించే విధంగా అంతర్జాతీయ  వ్యవస్థ దిశగా పని చేయవలసిన ఆవశ్యకత యొక్క ప్రాముఖ్యాన్ని మేము గుర్తించాం.  ఐక్య రాజ్య సమితి లో ముఖ్యంగా శాంతి, భద్రతల వంటి విషయాలలో ఆఫ్రికా దేశాలకు తగిన ప్రాతినిధ్యాన్ని కల్పించడంలో ఎంతో కాలాతీతం అయినట్టు మేము గమనించాం.

 

    16.            మనం అందరమూ పరస్పర సహకారం తో పని చేసి ఎదుర్కోవలసిన అంతర్జాతీయ సవాళ్లు మన ముందు ఉన్నాయి.  ఈ నేపథ్యం లో మానవాళి ప్రయోజనార్ధం నిష్పాక్షికమైన, న్యాయమైన మరియు అందరికి ప్రాతినిధ్యం గల బహుళ ధ్రువ అంతర్జాతీయ వ్యవస్థ ఏర్పాటు కై మేము కట్టుబడి ఉన్నాం.  ఆ వ్యవస్థ లో బల ప్రయోగం పై పూర్తి నిషేధమే కాక ఐక్య రాజ్య సమితి నిబంధనలను అతిక్రమించి ఏకపక్షంగా నిర్భంధ చర్యలకు పాల్పడేందుకు కూడా తావు ఉండకూడదు.  శాంతి కి, భద్రత కు ఉన్న అవిభాజ్యత ను మేము నొక్కి చెబుతున్నాం.  అయితే ఏ దేశం కూడా మరో దేశ భద్రత ను పణంగా పెట్టి తమ దేశ భద్రత ను పెంచుకోకూడదని మేము ఉద్ఘాటిస్తున్నాం.

 

     17.           2005 లో జరిగిన ప్రపంచ దేశాల సభ తీర్మానాల పత్రాన్ని మేము  జ్ఞప్తి కి తెస్తున్నాం.   అధిక ప్రాతినిధ్యంతో, ఉపయుక్తంగా, సమర్ధవంతంగా మరియు గ్లోబల్ సవాళ్ళకు తగిన విధంగా ప్రతిస్పందించే తీరు లో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రాతినిధ్యం పెంచే విధంగా భద్రత మండలితో సహా ఐక్య రాజ్య సమితి లో సమగ్ర సంస్కరణలు చేయవలసిన అవసరం ఉందని  మేము పునరుద్ఘాటిస్తున్నాం.  అంతర్జాతీయ వ్యవహారాలలో బ్రెజిల్, భారతదేశం, దక్షిణాఫ్రికా ల హోదా కు, పాత్ర కు గల ప్రాధాన్యాన్ని చైనా, రష్యా లు నొక్కి పలికాయి.  అంతేకాక ఐక్య రాజ్య సమితి లో  మరింత పెద్ద పాత్ర ను పోషించాలన్న ఆ మూడు దేశాల ఆకాంక్ష కు మద్దతు ను కూడా తెలిపాయి.

 

      18.            తమ ఉత్తర్వులను కట్టుదిట్టంగా, సమర్ధంగా అమలు చేసే విధంగా ఐక్య రాజ్య సమితి ని తీర్చిదిద్దడానికి గల ప్రాముఖ్యాన్ని మేము గుర్తించాం.  ఐక్య రాజ్య సమితి వనరులను, బడ్జెటు ను, పాలన ను పెంపొందించడం తో పాటు సమితి ప్రతిష్ఠకు భంగం కలుగకుండా, పొరబాట్లకు తావు లేకుండా చేయూత ను అందించేందుకు బ్రిక్స్  దేశాల పక్షాన మరింత తోడ్పాటు ను మేము ప్రోత్సహిస్తున్నాం.

 

       19.            బహు విధ కార్యక్రమాల ద్వారా క్రమబద్ధమైన మార్పులతో సహా ఉమ్మడి ప్రయోజనం గల క్షేత్రాలలో బ్రిక్స్ సభ్యత్వ దేశాల మధ్య సహకారం కొనసాగింపు నకు మేము మద్దతు ఇస్తున్నాం.

 

         20.           పేదరికాన్ని 2030 వ సంవత్సరానికల్లా నిర్మూలించాలనే తుది లక్ష్యాన్ని చేరుకొనేందుకు ఆర్ధిక, సామాజిక, పర్యావరణ సంబంధిత మూడు పార్శ్వాలలో సమతుల్యతను మరియు సమగ్రతతో కూడినటువంటి సమధర్మ, సంఘటిత, బహిరంగ, వినూత్న సర్వతోముఖ ధారణీయ అభివృద్ధి ద్వారా నిలకడైన అభివృద్ధి అజెండా 2030 యొక్క అమలు మరియు ధారణీయ అభివృద్ధి లక్ష్యాల సాధనకు కట్టుబడి ఉన్నామని మేము పునరుద్ఘాటిస్తున్నాం.  ప్రపంచ వ్యాప్తంగా 2030 అజెండా అమలు సమీక్ష మరియు సమన్వయం, అజెండా అమలు లో సభ్యత్వ దేశాలకు తోడ్పాటు ను అందించేందుకు ఐక్య రాజ్య సమితి అభివృద్ధి వ్యవస్థను సంస్కరించడానికి ధారణీయ అభివృద్ధి ఉన్నతాధికార రాజకీయ వేదిక (హెచ్ఎల్ పిఎఫ్)తో సహా ఐక్య రాజ్య సమితి ప్రధాన భూమిక ను మేము సమర్దిస్తున్నాం.  అధికార అభివృద్ధి సహాయాన్ని (ఒడిఎ) అందించేందుకు ఇచ్చిన హామీ లను సకాలంలో పూర్తిగా నేరవేర్చవలసిందిగా అభివృద్ధి చెందిన దేశాలకు విజ్ఞప్తి చేస్తున్నాం; అంతేకాక అభివృద్ధి చెందుతున్న దేశాలకు అదనపు వనరులను సమకూర్చవలసిందిగా కూడా కోరుతున్నాం.

 

     21.               ఇక జల వాయు పరివర్తన విషయానికి వస్తే, పారిస్ ఒప్పందం మేరకు చేయ తలపెట్టిన కార్యక్రమానికి  తుది రూపాన్ని ఇచ్చే విషయంలో సాధించిన ప్రగతి పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం.  అంతే కాక ఇతర భాగస్వామ్య పక్షాలతో నిర్మాణాత్మక కృషి జరిపేందుకు సంసిద్ధత ను వ్యక్తం చేస్తున్నాం.  పోలండ్ లో 2018 డిసెంబర్  లో  జరిగే జల వాయు పరివర్తన అంశంపై  ఐక్య రాజ్య సమితి యంత్రాంగ సమ్మేళనం (యుఎన్ఎఫ్ సిసిసి)  24వ మహా సభ కు మేము మద్దతు ను ప్రకటిస్తున్నాం.  ఆయా దేశాలు వేరువేరు గా నిర్వహించే బాధ్యత లకు అనుగుణంగా ఉమ్మడి సూత్రాలు, తమతమ సామర్థ్యాల మేరకు ఐక్య రాజ్య సమితి సమ్మేళనం లో ఆమోదించిన పారిస్ ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేసేందుకు కృషి చేయవలసిందిగా అన్ని దేశాలకు  పిలుపునిస్తున్నాం; ఇంకా, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థికంగా, సాంకేతికంగా, సామర్థ్యం పెంపొందించుకునేందుకు- సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందడానికి, పద్దతులను దత్తత తీసుకుని అమలుచేయడానికి- మద్దతు ను ఇవ్వవలసిందిగా అభివృద్ధి చెందిన దేశాలకు విజ్ఞప్తి చేస్తున్నాం.

 

     22.              శక్తి రంగంలో బ్రిక్స్ సహకారాన్ని మరింత పటిష్టం చేయడానికి మేము పూనుకొంటున్నాము.  ముఖ్యంగా పర్యావరణ హితమైన శక్తి వ్యవస్థల వైపు పరివర్తన చెందడం ద్వారా గ్లోబల్ నిర్వహణీయ అభివృద్ధి కార్యక్రమ పట్టిక అమలు కోసం సమతుల్యమైన ఆర్థిక ప్రగతి మరియు ప్రజలందరి సమష్టి ఆర్థిక సామాజిక హితం కోసం పని చేయాలన్నది సంకల్పం.  అందరికీ అందుబాటులో శక్తి, శక్తి భద్రత, అందుబాటు ధరలో శక్తి, కాలుష్యం తగ్గించడం, పర్యావరణ పరిరక్షణ వంటి వాటి కోసం మేము మా కృషి ని కొనసాగిస్తాం.  అక్షయ  శక్తి వనరులు, కర్బనం తక్కువగా ఉండే శక్తి వనరులు సహా శక్తి సరఫరా వనరుల వివిధీకరణ, శక్తి రంగంలో పెట్టుబడులు, శక్తి మౌలిక సదుపాయాలు, శక్తి పరిశ్రమ మరియు విపణి అభివృద్ధి, ఇంకా ప్రాథమిక శక్తి వనరుల వనరుల వినియోగానికి బ్రిక్స్ సభ్యత్వ దేశాల మధ్య అంతర్గత సమన్వయం వంటి చర్యల ద్వారా ఇంధన భద్రత కు మద్దతు ను పునరుద్ఘాటిస్తున్నాం.   రవాణా, వేడి చేయడం, మరియు పారిశ్రామిక వినియోగాలలో శక్తి పరివర్తన ను వేగవంతం చేయవలసిన ఆవశ్యకత ను మేము గుర్తించాము.

 

     23.       శక్తి సామర్థ్యం యొక్క ప్రాముఖ్యంతో పాటు శక్తి ని సమర్థంగా వినియోగించుకొనే జీవన సరళి వ్యాప్తి కి ప్రాముఖ్యాన్ని ఇవ్వాలనే విషయాన్ని, అటువంటి విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల  శక్తి భద్రత, పారిశ్రామిక స్పర్ధ, ఉద్గారాల తగ్గింపు, ఆర్థిక ప్రగతి, ఉపాధి కల్పన తదితర రంగాలలో కలిగిన ఫలితాలు ఏమిటో మేము గుర్తించాం.

 

    24.          బ్రిక్స్ సభ్యత్వ దేశాల శక్తి శాఖ మంత్రులు బ్రిక్స్ ఇంధన పరిశోధన సహకార వేదిక ఏర్పాటు కు అంగీకరించిన విషయాన్ని మరియు దాని విధి విధానాలను ఖరారు చేయడం, ఇందుకోసం జరుగుతున్న చర్చ లను మేము గుర్తించాం.

 

      25.          ఇండియా 2016లో ప్రవేశపెట్టిన బ్రిక్స్ వ్యవసాయ పరిశోధన వేదిక (ఎఆర్ పి) ఏర్పాటు కు మేము మద్దతివ్వడంతో పాటు ఆ వేదిక ఏర్పాటును పునరుద్ఘాటిస్తున్నాం.  పరిశోధన యొక్క మౌలిక ప్రాముఖ్యతనుస్థిరమైన ప్రగతిని, పోటీతత్వాన్ని పెంపొందించడంలో వినూత్నతను  మేము ప్రశంసిస్తున్నాం.  బ్రిక్స్ దేశాల మధ్య వ్యవసాయ పరిశోధన లో సమన్వయాన్ని పటిష్టం చేసేందుకు ప్రయత్నిస్తాం.   మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా లాఘవం తో సాగే  సమష్టి వ్యవసాయ ఆహార వ్యవస్థ ను పెంపొందించడానికి మేము ప్రయత్నిస్తాము.  ఎఆర్ పి లక్ష్యాలను, ఉద్దేశాలను అమలు చేయడానికి చేపట్టవలసిన తదనంతర చర్యల ఆవశ్యకత ను మేము గుర్తించాము.  వ్యవసాయ పరిశోధన వేదిక మరియు మౌలిక వ్యవసాయ సమాచార మార్పిడి వ్యవస్థ (బిఎఐఇఎస్) చట్రం లో బ్రిక్స్ దేశాల మధ్య అంతర్గత సమన్వయాన్ని పెంపొందించేందుకు మేము కట్టుబడి ఉన్నాం.

 

          26.           నిర్వహణీయ వినియోగం మరియు ఉత్పత్తి కోసం వర్తుల ఆర్ధిక వ్యవస్థ పై  బ్రిక్స్ దేశాల మధ్య సహకారంఇతివృత్తం పై జరిగిన 4వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం తీర్మానాలు మా దృష్టికి వచ్చాయి.  వ్యర్ధ  పదార్థాలను తగ్గించే సామర్ధ్యం  పర్యావరణ హితమైన నిలకడైన ప్రక్రియ లను సృష్టించడం ఆర్థిక ప్రగతి కి ఉపాధి కల్పన కు తోడ్పాటు ను అందిస్తూ మన ఆర్థిక వ్యవస్థ లను వివిధీకరించడం వర్తుల ఆర్థిక వ్యవస్థ లో ఉండే ప్రధాన అంశం.

 

         27.          పర్యావరణ హితమైన సాంకేతిక వేదిక అమలు  సహా పరిశుభ్రమైన నదుల ఛత్రం కార్యక్రమం అమలు చేయడం పట్టణాలలో పర్యావరణం పరిరక్షణ చర్యలలో భాగస్వామ్యం వంటి వివిధ అంశాలపై బ్రిక్స్ పర్యావరణ మంత్రులు వరుసగా జరుపుతున్న సమావేశాల నిర్ణయాలను  మేము తెలుసుకున్నాం.  అంతేకాక బ్రిక్స్ పర్యావరణ సాంకేతిక సహకార వేదిక సహకార వేదిక ఏర్పాటు లో సాధించిన ప్రగతి ని కూడా గుర్తించాము.  ఇది ఆచరణీయంగా, ఫలితాలను ఇచ్చే విధంగా ఉంటుంది.  ఇందులో భాగస్వాములువిజ్ఞాన సంస్థలు, పౌర సమాజం, ప్రైవేట్ రంగం, ఆర్థిక సంస్థ లు భాగంగా ఉంటాయి. 

 

          28.           సమగ్ర పద్ధతి లో నిలకడైన అభివృద్ధి ని సాధించేందుకు జల మార్గాల సాధన, వరదల నుంచి రక్షణ, కరవు పర్యవేక్షణ, నీటి సరఫరా మరియు పారిశుధ్యం, నీరు మరియు వాతావరణం, క్రమ పద్ధతి లో జల కాలుష్య నివారణ మరియు నియంత్రణనదులు సరస్సుల పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ మరియు పరిరక్షణ, పర్యావరణ వ్యవస్థ ను  పదిలంగా ఉంచడం మరియు నీటి వనరుల నిర్వహణ  వంటి అంశాలపై దృష్టి ని కేంద్రీకరించడం ద్వారా జల క్షేత్రం లో సహకారాన్ని పెంపొందించాలన్న కట్టుబాటు ను మేము స్వాగతిస్తున్నాం.

 

             29.            ప్రకృతి వైపరీత్యాలను, విపత్తులను పర్యవేక్షించే అధిపతుల బ్రిక్స్ సమావేశం బఫెలో నగరం లో జరిగింది.  ఈ సమావేశం లో 2018-2020 కార్యాచరణ ప్రణాళిక ను ఆమోదించడమైంది.  ఈ రంగం లో మన సహకారాన్ని మరింత పెంపొందించేందుకు బ్రిక్స్ జాయింట్ టాస్క్ ఫోర్స్ మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేయడమైంది.     

 

           30.            జీవ వైవిధ్య పరిరక్షణ, నిలకడైన వినియోగం, అందరికీ సమాన అవకాశాలు, జీవ వనరులను అందరికి అందుబాటులోకి తేవడం, అందరూ పంచుకోవడం వంటి రంగాలలో బ్రిక్స్ దేశాల మధ్య సహకారం, సమన్వయం పెంపొందించాలన్న ఉద్దేశాన్ని మేము పునరుద్ఘాటిస్తున్నాం.   జీవ జాతులు, జాతీయ ఉద్యానవన సంస్థలు వంటి అంశాలపై జరిగే  అంతర్జాతీయ  జీవ వైవిధ్య సమ్మేళనం మరియు వేదిక లలో మన సహకారాన్ని ప్రాత్సహించాడానికీ  మేము కట్టుబడి ఉన్నాము.

 

            31.      సముద్ర ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధి కోసం బ్రిక్స్ దేశాల మధ్య విస్తృత సహకారాన్ని, సమన్వయాన్ని పెంపొందించడానికి గల అవకాశాలను మేము గుర్తించాము.  సముద్ర ఆర్ధిక వ్యవస్థ బహుళ రంగాలకు విస్తరించింది. సముద్ర జలాలలో రవాణా, నౌకా నిర్మాణం, సముద్రం లో నుంచి చమురును వెలికి తీయడం మరియు అన్వేషణ, జల సంపద, జల పెంపకం, ఓడరేవుల అభివృద్ధి, పరిశోధన మరియు సాంకేతిక రంగం పరిరక్షణ సముద్ర వనరుల పరిరక్షణ మరియు వినియోగం నిర్వహణీయ వినియోగం కోస్తా తీర పర్యటకం, ఆర్థిక మరియు బీమా సేవలు కోస్తా పారిశ్రామిక మండల అభివృద్ధి వంటివి వాటిలో వ్యూహాత్మకంగా చెప్పుకోవలసిన రంగాలు.  

 

            32.         జనాభా సంబంధిత అంశాలపై 2014 లో జరిగిన బ్రిక్స్ దేశాల మంత్రుల సమావేశం జనాభా సంబంధిత అంశాలపై 2015 -2020 వరకు అనుసరించవలసిన బ్రిక్స్ కార్యక్రమ పట్టిక ను ఖరారు చేసింది.  ఆ కార్యక్రమ పట్టిక  ను ఆచరణలో కి తీసుకు రావడానికి మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. బ్రిక్స్  దేశాలలో జనాభా నిష్పత్తిలో వస్తున్న తేడాలు ఎన్నో సవాళ్లను వాటితోపాటు అవకాశాలను కల్పిస్తున్నాయి. ముఖ్యంగా స్త్రీ- పురుష అసమానతలు మరియు మహిళల హక్కులు, యువత అభివృద్ధి, ఉపాధి మరియు భవిష్యత్ పని అవకాశాలు, నగరీకరణ, వలసలువయో వృద్ధి రేటు ల వంటివి ఉన్నాయి.

 

             33.            కొన్ని బ్రిక్స్ దేశాలతో సహా ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద దాడులు కొనసాగడాన్ని మేము ఖండిస్తున్నాం.  ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, ఏ రకంగా ఉన్నా, ఎక్కడ జరిగినా, ఎవరి ద్వారా జరిగినా మేము ఖండిస్తున్నాం.  ఐక్య రాజ్య సమితి ఆధ్వర్యం లో స్థిరమైన అంతర్జాతీయ న్యాయ నిబంధనల మేరకు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి కలసికట్టు గా చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.  టెరరిజానికి వ్యతిరేకంగా సమర్థవంతమైన పోరాటం జరపడానికి సమగ్ర విధానం అవసరమని, దానికి మేము కట్టుబడి ఉన్నామని ఈ విషయంలో మా కృత నిశ్చయాన్ని ప్రకటిస్తున్నాం.  అంతేకాక ఉగ్రవాదులకు, ఉగ్రవాద సంస్థలకు, వారి కార్యకలాపాలకు ఆర్థిక సహాయాన్ని అందించే దేశాలను నిరోధించవలసిన అవసరం ఉంది.  వారి భూభాగాల నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు జరగకుండా చూడాలని , అది ఆయా దేశాల బాధ్యత అని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నాం.

 

          34.            ఉగ్రవాదాన్ని ప్రతిఘటించడానికి అచ్చమైన, విస్తృత అంతర్జాతీయ సంకీర్ణాన్ని ఏర్పాటు చేయాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపు ఇస్తున్నాం.  ఉగ్రవాదులను ఎదుర్కొనే చర్యల సమన్వయకర్తగా వ్యవహరించే  ఐక్య రాజ్య సమితి కి అంతర్జాతీయ సంకీర్ణం మద్దతు ఇవ్వాలి.  ఉగ్రవాదంపై పోరాటాన్ని ఐక్య రాజ్య సమితి నియమావళి తో పాటు  అంతర్జాతీయ న్యాయం, అంతర్జాతీయ శరణార్థులు జీవ కారుణ్య న్యాయం, మానవ హక్కులు, ప్రాథమిక హక్కులకు  అనుగుణంగా టెరరిజంపై పోరాటం సాగించాలి. ఐక్య రాజ్య సమితి కౌంటర్ టెనరిజం యంత్రాంగాన్ని మరింత సమర్థంగా రూపొందించడంఐక్య రాజ సమితి ఆధ్వర్యంలో టెరరిజానికి వ్యతిరేకంగా పని చేస్తున్న వివిధ అనుబంధ సంస్థల మధ్య సహకారం మరియు సమన్వయం పెరగడంటెరరిస్టు దాడుల నుంచి ఇబ్బంది పడుతున్న సభ్య దేశాలకు సాంకేతిక సహాయాన్ని అందించడం అనే అంశాల పట్ల మా కట్టుబాటు ను మేము పునరుద్ఘాటిస్తున్నాం.  వీలైనంత త్వరగా అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర సమ్మేళనాన్ని నిర్వహించి ఐక్య రాజ్మయ సమితి సాధారణ సభ లో  సత్వర తీర్మానాన్ని రూపొందించాలని మేము పిలుపునిస్తున్నాం.

   

             35.              రసాయన, జీవ సంబంధ ఉగ్రవాదం వల్ల కలిగే ముప్పు ను ఎదుర్కోవడానికి బహుళ పక్ష సంప్రదింపులు జరిపి నిరాయుధీకరణ మహాసభ తో సహా రసాయన, జీవ సంబంధ ఉగ్రవాదం అణచివేత కు తీసుకోవలసిన చర్య లపై అంతర్జాతీయ సమ్మేళనం ఏర్పాటు కు మద్దతు ఇస్తూ ఆ  ఆవశ్యకతను నొక్కి చెప్తున్నాం.

 

           36.               ఉగ్రవాద దాడులు, కుట్ర పన్నడం, ఉగ్రవాద చర్య లకు మద్దతివ్వడం వంటి చర్యలకు బాధ్యులైన వారిని అందుకు జవాబుదారులను చేయాలని మేము గట్టిగా నమ్ముతున్నాం.   టెరరిజాన్ని  ఎదుర్కోవడానికి అన్ని దేశాలు ఒక సమగ్ర విధానాన్ని అవలంబించాలని, దానిలో  విప్లవ సంస్థలలో కొత్త వారిని చేర్చుకోవడాన్ని, విదేశీ ఉగ్రవాదుల రాకను అడ్డుకోవడం, ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం అందుతున్న మార్గాలను మూసివేయడం- ఉదాహరణకు వ్యవస్థీకృత నేరాలైన హవాలా లావాదేవీలు, ఆయుధాల సరఫరా, మాదక ద్రవ్యాల అక్రమ చేరవేత, ఇతర నేర కార్యకలాపాల- వంటి వాటిని నియంత్రించడం, ఉగ్రవాద స్థావరాలను కూల్చివేయడం, ఉగ్రవాద సంస్థలు  అధునాతన సమాచార కమ్యూనికేశన్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం ద్వారా ఇంటర్ నెట్ ను దుర్వినియోగం చేయకుండా నిరోధించాలని  మేము పిలుపు ఇస్తున్నాం.

 

            37.              అధునాతన సమాచార కమ్యూనికేశన్ సాంకేతిక పరిజ్ఞానం (ఐసిటి) వినియోగం తో లభించే ఇంటర్ నెట్ సౌకర్యాన్ని ఉగ్రవాద సంస్థలు  దుర్వినియోగం చేస్తున్నాయి.  దీనిని ఎదుర్కోవలసిన అవసరం ఉంది.  దీనిని ఎదుర్కోవడానికి ఐక్య రాజ్య సమితి నియమాలు, నిబంధనలు మరియు సూత్రాల ప్రకారం అధునాతన సమాచార సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించే సమయంలో భద్రత పై  ఆయా దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అనే అంశానికి ప్రాముఖ్యాన్ని ఇస్తూ దాన్ని మేము పునరుద్ఘాటిస్తున్నాం.

 

         38.             నాలుగో పారిశ్రామిక విప్లవం నేపధ్యం లో సమాచార సాంకేతిక రంగం (ఐసిటి)లో వచ్చిన అధునాతన మార్పులు కొత్త ప్రయోజనాలను అందుబాటు లోకి తీసుకువచ్చాయనేది వాస్తవం.  ముఖ్యంగా ఎన్నో అధునాతన ప్రక్రియలు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటు లోకి వచ్చాయి.  అయితే ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర కార్యకలాపాలకు దుర్వినియోగం చేస్తుండడం వల్ల సాంకేతిక పరిజ్ఞానం కొత్త సవాళ్ళతో పాటు కొత్త ముప్పు లను తెచ్చిపెట్టింది.  ఇటీవల కాలంలో అపకార బుద్ధి తో సాంకేతిక పరిజ్ఞానం అక్రమ కార్యకలాపాలకు ప్రభుత్వాలుప్రభుత్వేతర సంస్థల వారు వినియోగిస్తున్నారు ఈ నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానం దుర్వినియోగం జరగకుండా  ఉగ్రవాదం మరియు నేర పూరిత నేర కార్యకలాపాలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ  సహకారాన్ని పెంపొందించవలసిన అవసరం ఉంది. ఇందుకోసం ఐక్య రాజ్య సమితి లో ఒక విశ్వవ్యాప్త నియంత్రణ సంస్థ ను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ను మేము ఉద్ఘాటిస్తున్నాం. సమాచార సాంకేతిక పరిజ్ఞానం మరియు ఉమ్మడి గా అంగీకరించిన క్రియా విధానం వంటి వాటి వినియోగం వల్ల భద్రత కు భంగం కలగకుండా చూసేందుకు ఒక ఆచరణాత్మక సహకారానికి బ్రిక్స్ మార్గనిర్దేశం చేసింది.  సమాచార సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో భద్రత ఉండేలా చూసేందుకు బ్రిక్స్ సభ్య దేశాల మధ్య  సహకార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయవలసిన ప్రాముఖ్యాన్ని కూడా మేము గుర్తించాం.  ఈ విషయం లో సహకారం పై  బ్రిక్స్ అంతర్ ప్రభుత్వ ఒప్పందాన్ని పరిశీలించి విస్తృతం చేయడానికి సభ్య దేశాలు కృషి చేస్తాయి. 

III.       ప్రపంచ శాంతి, భద్రత లలో బ్రిక్స్ సహకారాన్ని పటిష్ఠం చేసి సంఘటితం చేయడం

 

       39.          వివాదాలను రాజకీయ చర్చలు, దౌత్యపరమైన పద్ధతుల్లో పరిష్కరించుకోవడానికి నిబద్ధమై ఉన్నామని పునరుద్ఘాటిస్తున్నాం. ప్రపంచ శాంతి, భద్రతలను పరిరక్షించడంలో ఐక్య రాజ్య సమితి భద్రత మండలి ది ప్రధానమైన బాధ్యత అని నమ్ముతున్నాం.

 

         40.          మధ్య ప్రాచ్య ప్రాంతం లో జరుగుతున్న ఘర్షణలు, పెరుగుతున్న ఉద్రిక్తతల పట్ల ఆందోళన ను వెలిబుచ్చుతున్నాం.  ఏ ఘర్షణలోనైనా బలప్రయోగానికి పాల్పడకూడదని, విదేశీ జోక్యం ఉండకూడదని, చిరకాలం శాంతి నెలకొనాలంటే విస్తృత ప్రాతిపదికన చర్చలు జరపడం, స్వాతంత్ర్యానికి విలువ ఇస్తూ అందరికీ భాగస్వామ్యం ఉండేలా జాతీయ సంప్రదింపుల ద్వారా, ఆ ప్రాంతం లోని ప్రతి దేశం ప్రాదేశిక సమగ్రత కు ప్రాధాన్యాన్ని ఇస్తూ చర్చల ద్వారా పరిష్కారం కుదరాలనేది మా అభిప్రాయం.  ఆ ప్రాంతంలోని అన్ని దేశాల ప్రజలకు పౌర, రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులు, ప్రాథమికమైన స్వేచ్ఛ, ముఖ్యంగా ఇజ్రాయిల్-పాలస్తీనా విషయం లో ఇవన్నీ ఉండాలని అంగీకరిస్తున్నాం.

 

          41.            మధ్య ప్రాచ్యం లోనూ, ఉత్తర ఆఫ్రికా లోనూ కొనసాగుతున్న ఘర్షణల కారణంగా దీర్ఘ కాలిక ఘర్షణల, ముఖ్యంగా పాలస్తీనా- ఇజ్రాయిల్ ఘర్షణల పరిష్కారంలో జాప్యం ఉండకూడదని అంగీకరిస్తున్నాం.  ఐక్య రాజ్య సమితి తీర్మానాలకు అనుగుణంగా, మాడ్రిడ్ సూత్రాలకు అనువుగా, అరబ్ శాంతి ప్రతిపాదనల ప్రకారం సంప్రదింపుల ద్వారా స్వతంత్రమైన, సుస్థిర, ప్రాదేశిక నిరంతరత కలిగిన పాలస్తీనా రాజ్యం ఏర్పడడానికి వీలుగా ఇజ్రాయిల్-పాలస్తీనా ఘర్షణ కు పరిష్కారం కుదరాలని భావిస్తున్నాం. ఈ రెండు రాజ్యాలు శాంతియుతంగా ఉండాలని, ఇజ్రాయిల్ నుంచి భద్రత ఉండాలని అనుకుంటున్నాం. ఇజ్రాయిలీ లకు, పాలస్తీనియన్ లకు మధ్య జెరూసలేం స్థితి ఏమిటి అని ఆలోచించి తుది నిర్ణయానికి రావాలని భావిస్తున్నాం. గాజా పరిస్థితికి సంబంధించినంత వరకు మేం పాలస్తీనా ప్రజల సంక్షణకు ఐక్య రాజ్య సమితి సాధారణ సభ తీర్మానానికి (ఎ/ఆర్ఇఎస్/ఇఎస్-10/20) మద్దతు ను పునరుద్ఘాటిస్తున్నాం.

 

        42.           నియర్ ఈస్ట్ లో పాలస్తీనా శరణార్థుల విషయంలో ఐక్య రాజ్య సమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ కి (యుఎన్ఆర్ డబ్ల్యుఎ) మద్దతు ను పునరుద్ఘాటిస్తున్నాం. దాదాపు 5.3 మిలియన్  పాలస్తీనా శరణార్థులకు ఆరోగ్యం, విద్య, ఇతర మౌలిక సేవలను అందించడానికి ఈ వ్యవస్థ నిర్వహిస్తున్న కీలక పాత్రను అభినందిస్తున్నాం.  ఈ సహాయం వల్ల ఆ ప్రాంతంలో సుస్థిరత సాధ్యం అవుతుందని, ఈ సంస్థ కు తగినంత, సరిపోయేటంత, నికరమైన సహాయాన్ని నిలకడగా అందించవలసిన అవసరం ఉందని భావిస్తున్నాం.

 

        43.           ఎమెన్ రిపబ్లిక్ లో కొనసాగుతున్న ఘర్షణలు, మానవతావాద సంక్షోభం మరింత ఆదోళనకరంగా ఉంది.  ఎమెన్ లోని అన్ని ప్రాంతాలకు మానవతావాదంతో కూడిన సహాయం నిరాటంకంగా అందుబాటు లో ఉండాలని, అంతర్జాతీయ సమాజం సత్వరం అవసరమైన సహాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.  అన్ని పక్షాలు అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని, విద్వేషాలను విడనాడాలని ఐక్య రాజ్య సమితి మధ్యవర్తిత్వం లో చర్చలను పున: ప్రారంభించాలని, ఇవి ఎమెన్ లోని అందరికీ అవకాశం ఉండే రీతిలో ఘర్షణ కు శాంతియుత పరిష్కారం కనుగొనే రీతి లో ఉండాలని కోరుతున్నాం.

 

          44.           గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుతం ఏర్పడిన దౌత్య సంక్షోభం లో ప్రత్యక్ష సంబంధం ఉన్న అన్ని పక్షాలు వారి విభేదాలను  విడనాడి సంప్రదింపుల ద్వారా ఈ విషయంలో కువైత్ చేస్తున్న ప్రయత్నాలను స్వాగింతించాలని ఆకాంక్షిస్తున్నాం.

 

            45.          ‘‘అఫ్గానిస్తాన్ నాయకత్వంలోని, అఫ్గాన్ అధ్వర్యంలోని’’ జాతీయ శాంతి సాధన కు, రాజీ ప్రక్రియ కు మద్దతు ప్రకటిస్తున్నాం. అఫ్గాన్ జాతీయ భద్రత దళాలు, ప్రభుత్వం, పౌరుల మీద ఉగ్రవాద దాడులు పెచ్చరిల్లడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాం.  శాంతి సాధనకు కృషి చేయడానికి అఫ్గానిస్తాన్ ప్రభుత్వం, ప్రజలు చేస్తున్న ప్రయత్నాలకు సహకరించాలని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం.  అఫ్గాన్ పార్లమెంటు కు 2018 అక్టోబర్ లో, అధ్యక్ష స్థానానికి 2019 లో ఎన్నికలను స్వాగతిస్తున్నాం.

 

          46.           సిరియా ఘర్షణకు ‘‘సిరియా నాయకత్వంలో, సిరియా అధ్వర్యం’’ లో రాజకీయ ప్రక్రియ ద్వారా, సిరియా స్వాతంత్ర్యాన్ని, ప్రాదేశిక సమగ్రత ను పరిరక్షించే రీతిలో, ఐక్య రాజ్య సమితి భద్రత మండలి తీర్మానం 2254 (2015) నేపథ్యం లో సోచి లో జరిగిన సిరియా జాతీయ సంప్రదింపుల మహా సభ అభిప్రాయాన్ని పరిగణన లోకి తీసుకుని రాజకీయ పరిష్కారం కుదరాలన్న మా నిబద్ధత ను పునరుద్ఘాటిస్తున్నాం.   జెనీవా ప్రక్రియ, ఐక్య రాజ్య సమితి మధ్యవర్తిత్వం నెరపడానికి సంసిద్ధత ను వ్యక్తం చేయడంతో పాటు అస్తానా ప్రక్రియ సైతం క్షేత్ర స్థాయి లో సానుకూల పరిణామాలకు దారి తీస్తోంది కనుక, ఈ ప్రయత్నాలు ఒక దానికి మరొకటి అనుకూలంగా ఉన్నాయి కనుక వీటికి మద్దతు ను ప్రకటిస్తున్నాం. సిరియా సంక్షోభానికి శాంతియుత పరిష్కారం కుదరాలన్న మా భావన ను పునరుద్ఘాటిస్తున్నాం. అదే సమయంలో ఐక్య రాజ్య సమితి లక్ష్యాలకు, ఐక్య రాజ్య సమితి భద్రత మండలి అధికారాలకు, ప్రమాణాలకు విరుద్ధంగా జరుగుతున్న పరిమాణాలను వ్యతిరేకిస్తున్నాం.  సంబంధిత యుఎన్ఎస్ సి తీర్మానాలకు కట్టుబడుతూ సిరియా లో ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం కొనసాగడానికి ఉన్న ప్రాధాన్యాన్ని మళ్లీ గుర్తు చేస్తున్నాం.  ఏ పక్షమైనా, ఏ ప్రయోజనాల కోసమైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా రసాయనిక ఆయుధాలను వినియోగించడాన్ని ఖండిస్తున్నామని పునరుద్ఘాటిస్తున్నాం.   సమగ్రమైన, నిరపేక్షమైన, స్వతంత్రమైన, దాపరికం లేని పద్ధతి లో సకల సంఘటనల మీద దర్యాప్తు జరగాలని మరో సారి కోరుతున్నాం.  పునర్నిర్మాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సిరియా ప్రజలకు మానవతావాద దృష్టితో మరింత సహాయాన్ని అందించడానికి ప్రయత్నించాలని అభ్యర్థిస్తున్నాం.

 

         47.            ఇరాన్ అణు కార్యక్రమం లో సంయుక్త, సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (జెసిపిఒఎ) ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తూ అంతర్జాతీయ శాంతి, ప్రాంతీయ శాంతి, భద్రత లు పెంపొందించడానికి జెసిపిఒఎ ను అమలు చేయాలని కోరుతున్నాం.

 

           48.           కొరియా ద్వీపకల్పాన్ని సంపూర్ణమైన అణ్వస్త్ర రహిత ప్రాంతంగా మార్చడానికి, ఈశాన్య ఆసియా లో శాంతి సుస్థిరత సాధించడానికి ఇటీవల జరుగుతున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నాం.

 

         49.            అంతరిక్షం లో ఆయుధ స్పర్ధ పెరగడాన్ని, అంతరిక్షం సైనిక ఘర్షణలకు నెలవుగా మారడం పట్ల ఆందోళన ను వ్యక్తం చేస్తున్నాం.  అంతరిక్షంలో అణ్వాయుధాలను నియోగించకుండా ఉండడం, ఆయుధ స్పర్ధ ను నివారించడంవల్ల అంతర్జాతీయ శాంతి, భద్రత లకు తీవ్ర ముప్పును దూరం చేయవచ్చని విశ్వసిస్తున్నాం. అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాలకు మాత్రమే వినియోగించుకోవాలన్న ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలకు కట్టుబడి ఉండాలని కోరుతున్నాం.  ఈ ఏర్పాట్లను మరింత పటిష్ఠం చేయవలసిన అవసరం ఉందని నొక్కి పలుకుతున్నాం. అంతరిక్షం లో ఆయుధాలను మోహరించకుండా, ఆయుధ స్పర్ధ ను నివారించడానికి సముచితమైన చట్టాన్ని రూపొందించడానికి గల అవకాశాలను చర్చించడానికి ప్రభుత్వాల నిపుణుల బృందం చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నాం. అంతరిక్షం లో ఆయుధాలను మోహరించకుండా ఉండాలంటే ఆచరణాత్మకమైనవిధానాలను, దాపరికం లేని విధానాలను అనుసరించాలని, పరస్పరం విశ్వాసం పాదుకొల్పే పద్ధతులు అనుసరించ వలసిన అవసరం ఉందని పునరుద్ఘాటిస్తున్నాం. అంతరిక్షం లో అన్ని అంశాలలో ఆయుధ పోటీ ని నిరోధించడానికి సముచితమైన బహు పక్షీయ ఒప్పందాలను కుదర్చడంలో నిరాయుధీకరణ కు ఉన్న ఏకైక నిరాయుధీకరణ వేదిక కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నాం.

 

       50.             ప్రిటోరియా లో 2018 జూన్ 4న బ్రిక్స్ విదేశాంగ/అంతర్జాతీయ సంబంధాల మంత్రుల సమావేశానికి దక్షిణాఫ్రికా  ఆతిథ్యం ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తున్నాం.  ఈ సమావేశంలో  అందరికీ సంబంధించిన ప్రధానమైన అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక అంశాలపై, బ్రిక్స్ సహకారాన్ని పెంపొదించడం పై మంత్రులు పరస్పరం చర్చించుకుని ఒకరి అభిప్రాయాలను మరొకరు తెలుసుకున్నారు.  ఐక్య రాజ్య సమితి సాధారణ సభ 73వ సమావేశాల సందర్భంగా బ్రిక్స్ మంత్రుల సమావేశం కోసం ఎదురుచూస్తున్నాం.

 

         51.              అంతర్జాతీయ భద్రత వాతావరణం, ఉగ్రవాద ప్రతిఘటన, ఐసిటి ల వాడకం లో భద్రత, ప్రపంచం లో ఘర్షణలు విపరీతంగా ఉన్న ప్రాంతాలు, అనేక దేశాలలో వ్యవస్థీకృత నేరాలు, శాంతి పరిరక్షణ, జాతీయ భద్రత, అభివృద్ధి సమస్య ల మధ్య సంబంధం మొదలైన అంశాలు చర్చించడానికి డర్బన్ లో 2018 జూన్ 28, 29 తేదీల్లో బ్రిక్స్ దేశాల భద్రత కోసం ఉన్నత ప్రతినిధుల సమావేశం జరగడాన్ని స్వాగతిస్తున్నాం.  పై అంశాల మీద చర్చించినందుకు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం.

 

        52.            అంతర్జాతీయ శాంతి, భద్రత ను కాపాడడంలో ఐక్య రాజ్య సమితి శాంతి పరిరక్షణ దళం నిర్వహిస్తున్న ముఖ్యమైన పాత్ర ప్రాధాన్యాన్ని నొక్కి పలుకుతున్నాం.  ఈ విషయంలో బ్రిక్స్ కృషిని అభినందిస్తున్నాం.  ఐక్య రాజ్య సమితి లో శాంతి పరిరక్షణ అంశాలపై బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సంప్రదింపులు మరింత అవసరం అని గుర్తిస్తున్నాం. ఈ విషయంలో బ్రిక్స్ కార్య బృందం విషయంలో దక్షిణాఫ్రికా చూపిన చొరవ ను అభినందిస్తున్నాం.

 

               53.           ఆఫ్రికా ఖండంలో ఘర్షణలను పరిష్కరించడానికి ఆఫ్రికన్ యూనియన్  ప్రయత్నాన్ని అభినందిస్తున్నాం.  ఐక్య రాజ్య సమితి భద్రత మండలి కి, ఆఫ్రికన్ యూనియన్ శాంతి, భద్రత మండలి కి మధ్య సహకారం అభినందనీయమైంది. ‘‘2020 కల్లా తుపాకుల మోత వినిపించకూడదు’’ అన్న లక్ష్యానికి ఆఫ్రికన్ యూనియన్ నిబద్ధమై వుండడాన్ని, ఆఫ్రికా శాంతి, భద్రతల ప్రయత్నాలను పెంపొందింప చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను అభినందిస్తున్నాం.

 

IV.      అంతర్జాతీయ ఆర్థిక పునరుద్ధరణ, ఆర్థిక నిర్వహణ అంతర్జాతీయ సంస్థల సంస్కరణ, 4వ పారిశ్రామిక విప్లవం

             54.      అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడాన్ని ఆహ్వానిస్తున్నాం.  అయితే ఈ అభివృద్ధి లో సామ్యం తక్కువగా ఉంది. బెదరింపులు కొనసాగుతూనే ఉన్నాయి.  వాణిజ్యపరమైన ఘర్షణలు, భౌగోళిక రాజకీయ ఇబ్బందులు, వస్తువుల ధరల్లో హెచ్చు తగ్గులు, ప్రైవేటు రంగంలో, ప్రభుత్వ రంగంలో రుణ భారం అధికం కావడంలో అసమానతల వంటి సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. అభివృద్ధి ఫలాలు అందరికీ అందుబాటు లో ఉండడం చాలా కీలకమైంది. అంతర్జాతీయ వాణిజ్య వాతావరణం మరింత అనుకూలంగా ఉండడానికి ప్రాధాన్యమివ్వాలి.

 

            55.             బ్రిక్స్ ఆర్థిక విధానాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, దృక్పథం విస్తరించడాన్ని సమర్థిస్తున్నాం.  సమ్మిళిత అభివృద్ధి ని సాధించడానికి కోశ సంబంధ, ద్రవ్య, నిర్మాణాత్మక విధానాలు జమిలిగా అమలైతేనే నిలకడగా ఉండే అభివృద్ధి, సమతూకం తో కూడిన, సమ్మిళిత అభివృద్ధి సాధ్యం.  కొన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో తీసుకుంటున్న స్థూల ఆర్థిక విధానాల ప్రభావం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల మీద, వాటి అభివృద్ధి మీద ప్రతికూల ప్రభావాన్ని ప్రసరిస్తున్నాయి.  విధానాల విషయం లో సంప్రదింపులను కొనసాగించాలని, ఈ ప్రమాదం గురించి జి20, ఎఫ్ఎస్ బి ల వంటి వేదికల మీద సంప్రదింపులు జరపాలని ప్రధానమైన, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ లకు విన్నవిస్తున్నాం.

 

          56.              నాలుగో పారిశ్రామిక విప్లవం పైన దృష్టి పెట్టి జోహానిస్ బర్గ్ శిఖర సమ్మేళనాన్ని గుర్తు చేస్తూ, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక శాఖలు నిర్వహించే బ్రిక్స్ దేశాల మంత్రుల సమావేశం లో ఒనగూరినటుంటి ఫలితాలను, నూతన పారిశ్రామిక విప్లవం (పార్ట్ ఎన్ఐఆర్) ను నెలకొల్పడం ముదావహం.  పార్ట్ ఎన్ఐఆర్ పూర్తి స్థాయిలో పని చేయడానికి సలహా మండలి ని ఏర్పాటు చేస్తాం.  ఇందులో బ్రిక్స్ దేశాల పరిశ్రమల మంత్రులు ఉంటారు.  వివిధ మంత్రిత్వ శాఖలను సంప్రదించి అభివృద్ధి సాధించడానికి మొదట 4వ  పారిశ్రామిక విప్లవ ప్రాధాన్యాలను నిర్ణయించి ఆ నిర్ణయాలను బ్రిక్స్ అధ్యక్ష స్థానానికి అందజేస్తాం.  డిజిటలీకరణ, పారిశ్రామికీకరణ, వినూత్నత్వం, సమ్మిళిత తత్వం, పెట్టుబడులు పెంపొందించడానికి బ్రిక్స్ దేశాల మధ్య సహకారం పెంపొందింప చేయడం పార్ట్ ఎన్ఐఆర్ లక్ష్యం. దీనివల్ల 4వ పారిశ్రామిక విప్లవ సవాళ్లను ఎదుర్కోవడం సాధ్యం అవుతుంది.  దీనివల్ల సాపేక్షంగా సానుకూల అంశాలు పెరిగి ఆర్థికాభివృద్ధికి, ఉత్పత్తి సామర్థ్యానికి, శాస్త్ర, సాంకేతిక  పార్కుల మధ్య నెట్ వర్క్ ఏర్పాటు చేయడానికి బిజినెస్ ఇంక్యుబేటర్ లు ఏర్పాటు చేయడానికి వీలవుతుంది. సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా అవసరమైన చోట్ల చిన్న, మధ్య తరహా వ్యవస్థలకు తోడ్పడడానికి వీలవుతుంది.  బ్రిక్స్ దేశాల శాస్త్ర సాంకేతిక పార్కులు, బిజినెస్ ఇన్ క్యుబేటర్ లను ఏర్పాటు చేయడం ఈ దిశగా తీసుకునే చర్యగా ఉంటుంది.

 

          57.               ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అభివృద్ధి సాధించడంలో ఇంటర్ నెట్ నిర్వహించే కీలక పాత్ర ను గుర్తిస్తున్నాం. ఐసిటి లను అన్ని దేశాల భాగస్వామ్యం తో ఇంటర్ నెట్ పరిణామక్రమం, పని విధానం, నిర్వహణ సురక్షితమైన, బహిరంగమైన, శాంతియుత, సహకార, క్రమ పద్ధతిలో వినియోగించడానికి ప్రస్తుత వ్యవస్థ లను ఉపయోగించుకోవడానికి ఉమ్మడి గా కృషి చేయడానికి నిబద్ధమై ఉంది.  ఈ విషయంలో అన్ని దేశాలకు సమాన అవకాశాలు ఉండడానికి, ఆ దేశాలు తమ పాత్ర, బాధ్యత నిర్వర్తించడానికి అనువుగా కృషి చేస్తాం.

 

          58.             సుస్థిరమైన అభివృద్ధి ని, సమ్మిళితమైన అభివృద్ధి ని పెంపొందించడానికి బ్రిక్స్ శాస్త్ర, సాంకేతిక, పారిశ్రామిక సంస్థల మధ్య సహకారానికి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తిస్తాం.  విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం, వినూత్న ఆవిష్కరణల రంగాలలో బ్రిక్స్ దేశాల మధ్య గతిశీలమైన అభివృద్ధి అవసరం.  ఈ రంగం లో ఉమ్మడి కృషి కి ప్రాధాన్యాన్ని ఇస్తాం.  బ్రిక్స్ శాస్త్ర, సాంకేతిక, వినూత్న శక్తిని వినియోగించడానికి బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి చాలా విలువ ఉంటుంది.  4వ పారిశ్రామిక విప్లవ సవాళ్లను ఎదుర్కోవడానికి ఇది తోడ్పడుతుంది.

 

         59.             బ్రిక్స్ ఐపిఆర్ సహకారం కొనసాగుతున్న తీరు ను అభినందిస్తున్నాం. వర్ధమాన దేశాలకు సహా సాంకేతికత ను బదిలీ చేయడం, అంతర్జాతీయ అభివృద్ధి సుస్థిరంగా, సమతూకం తో ఉండడానికి మేధోపర హక్కుల విషయం లో సహకారం బలపడాలి.  ఇది వినూత్నతకు, కొత్త సాంకేతికత ను రూపొదించడానికి, తద్వారా సమాజానికంతటికీ ఉపకరిస్తుంది.

 

          60.          ఆర్థిక వ్యవస్థలను సమీకృతం చేయడం, ప్రపంచ విలువ శృంఖలాలను సమానత్వ రీతి లో సంఘటితం చేయడం వల్ల సాంకేతిక అభివృద్ధి, వస్తూత్పత్తి, సేవలు అందించడానికి, ప్రజల ఆదాయానికి బాగా తోడ్పడుతుంది.  సాంకేతిక అభివృద్ధి వల్ల వర్ధమాన దేశాలు ప్రయోజనం పొందడానికి, ఈ సాంకేతికత ను ముందే అనుసరించకపోవడం వల్ల నష్టం కలగకుండా ఉండడానికి వీలుగా తగిన విధానాల రూపకల్పన కు చొరవ తీసుకోవాలి.  డిజిటల్ విధానాన్ని వినియోగించుకోవడం లో అంతరాలు లేకుండా చేయడానికి, సాంకేతిక పరిజ్ఞాన్ని వినియోగించడం ద్వారా ప్రజలు నేర్చుకోవడానికి సహకరించడానికి, సంబంధిత సాంకేతికత ను బదిలీ చేయడానికి సమర్థమైన విధానాలను రూపొందించడం అత్యవసరం.

 

         61.            ప్రపంచం ప్రస్తుతం సాంకేతికత మీద, విజ్ఞానాధారిత ఆర్థిక అంశాల మీద ఆధారపడుతోంది కాబట్టి పాత సాంకేతికత ను వినియోగించే వారికి, కొత్త సాంకేతికత ను వినియోగించే వారికి మధ్య పొంతన కుదరని పరిస్థితి ఉండకుండా చేయడానికి నైపుణ్యాభివృద్ధి అవసరం ఉందన్న విషయాన్ని గట్టిగా విశ్వసిస్తున్నాం.  ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ పెంపొందుతున్న తీరు, విస్తృతి దీనిని మరింత సవాళ్ల మయంగా చేస్తోంది.  అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ లలో గిరాకీ పెరుగుతున్నందువల్ల, పని తీరు మారుతున్నందువల్ల  వృత్తి విద్య గరపడానికి, జీవితాంతం నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి నాణ్యమైన అప్రెంటిస్ శిప్ ను ప్రోత్సహించడానికి జి20 దేశాలు చేపట్టిన కార్యక్రమాలను, చేసిన సిఫారసులను, పేదరికాన్ని నిర్మూలించడానికి, తగ్గించడానికి బ్రిక్స్ రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ను సమర్థిస్తున్నాం.

 

       62.            నిబంధనల మీద ఆధారపడ్డ, దాపరికం లేని, వివక్షకు తావు లేని, బాహాటమైన, సమ్మిళితమైన, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) నిర్దేశించినట్టుగా బహుపక్షీయ వాణిజ్యం పెంపొందవలసిన అవసరం ఉందని గుర్తిస్తున్నాం.  బహుపక్షీయ వాణిజ్యాన్ని పెంపొందించడానికి సకల చర్యలూ తీసుకుంటాం.

 

   63.           బహుపక్షీయ వాణిజ్యానికి అపూర్వమైన సవాళ్లు ఎదురవుతున్నాయని గుర్తిస్తున్నాం.  ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లో అందరికీ అవకాశం ఉండాలని, ప్రపంచీకరణ ఫలితాలు అన్ని దేశాలకు అందాలని, ఈ అభివృద్ధి ఫలితాలు అందరికీ దక్కాలని, సుస్థిర అభివృద్ధి ని సాధించాలని, అన్ని దేశాలు అభ్యున్నతి చెందాలని కోరుకుంటున్నాం. డబ్ల్యుటిఒ లో సభ్యత్వం ఉన్న దేశాలన్నీ ఆ సంస్థ నిబంధనలకు కట్టుబడి ఉండాలని, బహుపక్షీయ వాణిజ్య వ్యవస్థ నియమాలను గౌరవించాలని, నిబద్ధమై ఉండాలని కోరుతున్నాం.

 

        64.             డబ్ల్యుటిఒ వివాద పరిష్కార వ్యవస్థ బహుపక్షీయ వాణిజ్య వ్యవస్థకు గీటు రాయి వంటిదని గుర్తు చేస్తున్నాం. ఇది అంతర్జాతీయ వాణిజ్యం లో భద్రతకు పూచీ పడుతుంది.  ఈ వ్యవస్థ అప్పిలేట్ విభాగం సభ్యులను ఎంపిక చేయడంలో ప్రతిష్టంభన ఆందోళనకరం.  దీనివల్ల వివాద పరిష్కారంలో జాప్యం కావడంతో పాటు సభ్య దేశాల హక్కులకు, విధులకు విఘాతం కలుగుతుంది.  ఈ సవాలును ఎదుర్కోవడానికి ప్రాధాన్యమివ్వాలని సభ్య దేశాలన్నింటికీ విజ్ఞప్తి చేస్తున్నాం.

 

          65.            డబ్ల్యుటిఒ విధులను కొనసాగించవలసిన ఆవశ్యకత ఉందని గుర్తిస్తున్నాం.  ప్రస్తుతం ఉన్న బహుపక్షీయ వాణిజ్య చట్టం పరిధి ని మరింత విస్తరించడానికి నిర్మాణాత్మకంగా కృషి చేయడానికి అంగీకరిస్తున్నాం.  ఈ విషయంలో డబ్ల్యుటిఒ సభ్య దేశాల సమస్యలన్నింటినీ, ముఖ్యంగా వర్ధమాన దేశాల సమస్యలను పరిగణన లోకి తీసుకుంటాం.

 

          66.            ఆఫ్రికా లో మౌలిక వ‌స‌తుల అభివృద్ధి, అనుసంధానాల‌కు గ‌ల ప్రాముఖ్యాన్ని మేం గుర్తించాం.  అంతే కాకుండా ఈ ఖండ‌పు మౌలిక వ‌స‌తుల సంబంధిత స‌వాళ్ల‌ను ప‌సిగ‌ట్ట‌డం, ప‌రిష్క‌రించ‌డం కోసం ‘‘ఆఫ్రికా అభివృద్ధికి న‌వ్య భాగస్వామ్యం’’ (NEPAD), ‘‘ఆఫ్రికాలో మౌలిక స‌దుపాయాల అభివృద్ధి కార్యక్రమం’’ (PIDA) ద్వారా ఆఫ్రికా స‌మాఖ్య చేస్తున్న కృషి లో పురోగ‌తి ని కూడా గుర్తించాం. పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగ సృష్టి, నైపుణ్యాల అభివృద్ధి, ఆహారం-పోషకాహార భద్రత, పేదరిక నిర్మూలన స‌హా ఆఫ్రికా లో సుస్థిర అభివృద్ధికి మద్దతు ఇచ్చేలా పరస్పర ప్రయోజన ఆధారిత మౌలిక సదుపాయాల పెట్టుబడులను ప్రోత్సహించడానికి ప్రాముఖ్యం ఉంద‌న్న వాద‌న‌ను కూడా మేం స‌మ‌ర్థిస్తున్నాం.  ఆ మేర‌కు ఆఫ్రికా లో సుస్థిర మౌలిక వ‌స‌తుల అభివృద్ధితో పాటు అందుకు ఆటంకంగా ఉన్న ఆర్థికప‌ర‌మైన కొర‌త ను తీర్చే విష‌యం లోనూ మా మ‌ద్ద‌తును పున‌రుద్ఘాటిస్తున్నాం.

 

         67.            ఆఫ్రికా పారిశ్రామికీకరణతో పాటు ఆఫ్రికా సమాఖ్య ల‌క్ష్యం-2063 వాస్త‌వ రూపం దాల్చవలసిన అవ‌స‌రం గురించి మాకు స్ప‌ష్టంగా తెలుసు.  ‘‘ఆఫ్రికా ఖండపు స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతం’’ (ఎఎఫ్ సిఎఫ్ టిఎ) ఒప్పందం పై సంత‌కాలు చేసినందుకు ఆఫ్రికా దేశాల‌ను, ఆఫ్రికా స‌మాఖ్య‌ను మేం అభినందిస్తున్నాం.  ఈ ఖండం లో ఆర్థిక స‌మ‌గ్ర‌త‌కు, ఆఫ్రికావ్యాప్తంగా గల అద్భుత వాణిజ్య సామ‌ర్థ్య ఆవిష్క‌ర‌ణ‌కు మాత్ర‌మే గాక సామాజిక‌-ఆర్థిక స‌వాళ్ల‌ను ఎదుర్కొనే దిశ‌గా ఈ ఒప్పందం ఒక ముఖ్య‌మైన ముంద‌డుగు.  దీనికి సంబంధించి ల‌క్ష్యం-2063కు మ‌ద్ద‌తుతో పాటు ఖండాంతర సమైక్య‌త‌ ను, అభివృద్ధిని ప్రోత్సహించేందుకు కృషి చేస్తామ‌ని పున‌రుద్ఘాటిస్తున్నాం.

 

                 68.                 సుదృఢ‌మైన, సుర‌క్షితమైన అంత‌ర్జాతీయ ద్ర‌వ్య వ్య‌వ‌స్థ‌ ను మేం ఆకాంక్షిస్తున్నాం.  ఆ వ్య‌వ‌స్థ‌ కు త‌గిన వ‌న‌రులు ఉన్న, కోటా ఆధారితమైన అంత‌ర్జాతీయ ద్ర‌వ్య‌ నిధి (ఐఎమ్ఎఫ్) కేంద్రంగా ఉండాల‌న్న‌ది మా కోరిక‌.  ఈ దిశ‌గా కొత్త కోటాల విధానం స‌హా కోటా ల‌పై 15వ సార్వ‌త్రిక స‌మీక్ష‌ ను ఐఎంఎఫ్ 2019 వసంత‌కాల స‌మావేశాలలో లేదా 2019 వార్షిక స‌మావేశాల లోపు పూర్తి చేసేందుకు మా క‌ట్టుబాటు ను పున‌రుద్ఘాటిస్తున్నాం.  అదే స‌మ‌యంలో నిరుపేద దేశాల గ‌ళానికి త‌గిన ర‌క్ష‌ణ ఉండాల‌న్న‌ది మా డిమాండు.  త‌ద‌నుగుణంగా ఐఎంఎఫ్‌ లో పాల‌న సంస్క‌ర‌ణ‌లు స‌హారా ఎడారి ద‌క్షిణ‌ప్రాంత ఆఫ్రికా స‌హా నిరుపేద స‌భ్య‌దేశాలన్నింటి గ‌ళాన్ని బ‌లోపేతం చేయాల‌న్న‌ది మా ప్ర‌గాఢ వాంఛ‌.

 

             69.                  అంతర్జాతీయ ద్రవ్య-ఆర్థిక కమిటీ చైర్మ‌న్‌ గా దక్షిణాఫ్రికా రిజర్వు బ్యాంకు గవర్నర్ లెసెత్జా కన్యాగో నియామకంపై హర్షం ప్రకటిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాం.

 

            70.                బ్రిక్స్ ఆగంతుక నిధి వ్యవస్థ’ (సిఆర్ఎ)ను బలోపేతం చేయడంతో పాటు నిర్వహణ సంసిద్ధత కల్పించేందుకు తీసుకున్న చర్యలను మేం గమనించాం.  సిఆర్ఎ యంత్రాంగం నుండి వేరుప‌ర‌చిన విభాగం ప‌నితీరుపై ప్ర‌యోగాత్మ‌క ప‌రీక్ష విజ‌యవంతం కావ‌డం హ‌ర్ష‌ణీయం.  సిఆర్ఎ, ఐఎంఎఫ్‌ ల మ‌ధ్య స‌హ‌కారాన్ని మేం ప్రోత్స‌హిస్తాం.

 

          71.                  బ్రిక్స్ స్థానిక ద్ర‌వ్య బాండ్ల నిధి ఏర్పాటు దిశ‌గా ప్ర‌గ‌తిని గుర్తించ‌డంతో పాటు మేం సంతృప్తి వ్య‌క్తం చేస్తున్నాం.  అదే స‌మ‌యంలో అది త‌న కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించే స‌మ‌యం కోసం ఎదురుచూస్తున్నాం.

 

         72.                  బాండ్ల జారీ స‌హా ఈ అంశానికి సంబంధించిన త‌దుప‌రి కార్య‌క‌లాపాలలో బ్రిక్స్ దేశాల అకౌంటింగ్ ప్రమాణాలు- ఆడిటింగ్ పర్యవేక్షణ వ్య‌వ‌స్థ‌ల కేంద్రీక‌ర‌ణ దిశ‌గా స‌హ‌కార బ‌లోపేతానికి మేం ఆమోదం తెలియ‌జేస్తున్నాం.

 

             73.             డిజిటల్ ఆర్ధిక వ్యవస్థ పురోగ‌మ‌నం నేప‌థ్యంలో ‘‘గ‌ణాంక నిధి స్వ‌తంత్ర నిర్వ‌హ‌ణ‌- అనుక‌ర‌ణ‌కు తావు లేని సాంకేతిక ప‌రిజ్ఞాన భాగ‌స్వామ్యం’ (డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ & బ్లాక్ చైన్ టెక్నోలాజీ)పై సంయుక్త ప‌రిశోధ‌న‌ల కోసం అవ‌గాహ‌న ఒప్పందం పై సంత‌కాలు చేయ‌డాన్ని స్వాగ‌తిస్తున్నాం.  ఆవిష్కృత‌మ‌వుతున్న ఇంటర్ నెట్ ఆర్థిక వ్యవస్థ కు అనుగుణంగా మ‌న మ‌ధ్య స‌హ‌కారానికి ఇది తోడ్ప‌డుతుంద‌ని విశ్వ‌సిస్తున్నాం.

 

           74.                ఉత్పాదకతకు ఉత్తేజాన్ని ఇచ్చి, సమగ్రతను పెంచగల మౌలిక వసతులు, పెట్టుబడులు, అంతర్జాతీయ అభివృద్ధి సాయం లభించే పథకాలు వంటివే సుస్థిర ఆర్థిక ప్రగతికి, వృద్ధికి మూలస్తంభాలు.  ఆ మేరకు మౌలిక సదుపాయాల అభివృద్ధి, మరింత సన్నిహిత ఆర్థిక సంబంధాలను ప్రోత్సహించే సమగ్రతలకు గల ప్రాధాన్యాన్ని మేం నొక్కి చెబుతున్నాం.

 

           75.               ప్రభుత్వ మౌలిక సదుపాయాల అభివృద్ధి ప‌థ‌కాల‌తో పాటు ఇత‌ర‌త్రా పెట్టుబడుల దిశ‌గా ప్రైవేటు రంగ ఆర్థిక తోడ్పాటు ను ప్రోత్స‌హించ‌డంలో బహుళ పక్ష అభివృద్ధి బ్యాంకులు (MDB).. ప్రత్యేకించి న‌వ్యాభివృద్ధి బ్యాంకు (ఎన్ డిబి) పోషిస్తున్న పాత్రను శ్లాఘిస్తున్నాం.

 

             76.                మ‌న దేశాల సామాజిక‌-ఆర్థిక‌, ప‌ర్యావ‌ర‌ణ భ‌విత‌ కు తోడ్ప‌డ‌గ‌ల వ‌న‌రులను స‌మ‌కూర్చ‌డంలో ఎన్‌డిబి సాధించిన పురోగ‌తి పై సంతృప్తి ని వ్య‌క్తం చేస్తున్నాం.  అదే స‌మ‌యంలో ప‌థ‌కాల రూప‌క‌ల్ప‌న నిధి కార్య‌క‌లాపాలు త్వ‌ర‌లో ప్రారంభం కావాల‌ని ఆశిస్తున్నాం.  బ్రెజిల్‌ లోని సావో పావొలో లో అమెరికా ప్రాంతీయ కార్యాల‌యం ఏర్పాటు ను స్వాగ‌తిస్తున్నాం.  ఆయా ఖండాలలో ఎన్‌డిబి త‌న ఉనికి ని సుస్థిరం చేసుకునేందుకు ఆఫ్రికా ప్రాంతీయ కేంద్రం త‌ర‌హా లో అది తోడ్పడుతుంది.  ప్ర‌గ‌తి కి ఆర్థిక సాయం లో వినూత్న విధానాల‌పై చైనా లోని శంఘాయి లో మే 28, 29 తేదీల‌లో ఎన్‌డిబి పాల‌క‌ మండ‌లి 3వ వార్షిక స‌మావేశం చ‌ర్చించ‌డాన్ని అభినందిస్తున్నాం.  మారుతున్న అంత‌ర్జాతీయ ప‌రిస్థితుల న‌డుమ ఎన్‌డిబి భావి ప్ర‌గ‌తి పై ఈ సంద‌ర్భంగా చ‌ర్చ‌లు సాగ‌డం ముదావ‌హం.

 

             77.               బ్రిక్స్ దేశాల ప్ర‌గ‌తి అవ‌స‌రాలకు అనుగుణంగా, వాస్త‌వ (వ‌స్తు సేవ‌ల ఉత్పాద‌న సంబంధ‌) ఆర్థిక వ్య‌వ‌స్థ‌ కు మెరుగ్గా తోడ్ప‌డ‌గ‌ల రీతిలో ఆర్థిక స‌హ‌కారాన్ని పెంచుకోవలసిన అవ‌స‌రాన్ని నొక్కి చెబుతున్నాం.  ఈ దిశ‌గా ద్ర‌వ్య సంస్థ‌ల స‌మూహాన్ని ప్రోత్స‌హించడం ద్వారా ద్ర‌వ్య విప‌ణి స‌మ‌న్వ‌యానికి మా క‌ట్టుబాటు ను పున‌రుద్ఘాటిస్తున్నాం.  ఇందులో భాగంగా బ్రిక్స్ దేశాల న‌డుమ ఆయా దేశ వ‌ర్త‌మాన నియంత్ర‌ణ వ్య‌వ‌స్థ‌ల ప‌రిధిలో.. డ‌బ్ల్యుటిఒ నిర్దేశిత జిఎటిఎస్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఆర్థిక సేవ‌లు అందాలి.  అంతే కాకుండా ఆర్థిక రంగ నియంత్ర‌ణ వ్య‌వ‌స్థ‌ల న‌డుమ మ‌రింత ఉన్న‌త‌స్థాయి చ‌ర్చా సంబంధాలు నెల‌కొనేందుకు వీలు క‌ల్పించాలి.  ప్ర‌తి దేశ కేంద్ర బ్యాంకు చ‌ట్ట‌బ‌ద్ధ నిర్దేశ‌కాల మేర‌కు ద్ర‌వ్య స‌హ‌కారాన్ని అందించ‌డంతో పాటు స‌హ‌కార విధానాలలో కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల అన్వేష‌ణ‌ను కొన‌సాగిస్తాం.  బ్రిక్స్ దేశాలలో సుస్థిర ప్ర‌గ‌తిని ప్రోత్స‌హించేలా హ‌రిత ఆర్థిక‌ సాయాన్ని కూడా మేం మ‌రింత విస్త‌రిస్తాం.

 

         78.             ఆర్థిక చ‌ర్య‌ల కార్యాచ‌ర‌ణ బ‌ల‌గం (ఎఫ్ఎటిఎఫ్), ప్ర‌పంచ సుంకాల వ్య‌వ‌స్థ (డబ్ల్యుసిఒ) తోడ్ప‌డ‌డం స‌హా అక్ర‌మ ద్ర‌వ్య ప్ర‌వాహ నిరోధం లో అంత‌ర్జాతీయ స‌హ‌కారానికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని పున‌రుద్ఘాటిస్తున్నాం.  దీనికి సంబంధించి ప‌ర‌స్ప‌ర ఆదాన‌ ప్ర‌దానం, స‌మాచార భాగ‌స్వామ్యం పెంచుకోవ‌డానికి గ‌ల ప్రాముఖ్యాన్ని నొక్కి చెబుతున్నాం.  ఎఫ్ఎటిఎఫ్ ల‌క్ష్యాల‌ను స‌మ‌ర్థిస్తూ వాటికి మ‌ద్ద‌తు ప‌ల‌క‌టానికి గ‌ల ప్రాధాన్యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాం.  అలాగే అక్ర‌మ ద్ర‌వ్య చ‌లామ‌ణీ, ఉగ్ర‌వాదానికి నిధులు చేర‌వేత‌పై పోరాటంతో పాటు ఎఫ్ఎటిఎఫ్ వ్యాప్తి కి సంబంధించిన కార్యాచ‌ర‌ణ‌, ప్ర‌మాణాల పెంపు దిశ‌గా మ‌న స‌హ‌కారాన్ని మ‌రింత ముమ్మ‌రం చేయాలి.

 

         79.            అవినీతి నేడు దీర్ఘ‌కాలిక ప్ర‌భావాన్ని ప్రసరిస్తూ అంత‌ర్జాతీయ స‌వాలుగా మార‌డ‌మే గాక ఆయా దేశాల చ‌ట్ట వ్య‌వ‌స్థ‌ల‌ను ల‌క్ష్య‌పెట్ట‌ని స్థాయికి పేట్రేగింది.   ఏదైనా దేశంలో అవ‌స‌ర‌మైన స్థానిక లేదా విదేశీ పెట్టుబ‌డులను నిరుత్సాహ‌ప‌రుస్తూ ఆర్థిక వ్య‌వ‌స్థ వృద్ధి కి ముప్పుగా త‌యారైంది.  ఈ నేప‌థ్యంలో అవినీతి కి వ్య‌తిరేకంగా ఐక్య‌ రాజ్య స‌మితి స‌ద‌స్సు తీర్మానం (యుఎన్ సిఎసి)లోని నాలుగో అధ్యాయం పేర్కొంటున్న రీతిలో అంత‌ర్జాతీయ స‌హ‌కారం అందించేందుకు మా క‌ట్టుబాటును పున‌రుద్ఘాటిస్తున్నాం.  ఇందులో భాగంగా బ్రిక్స్‌ లోని అవినీతి నిరోధ‌క కార్యాచ‌ర‌ణ బృందం నిర్దేశాల‌కు అనుగుణంగా  అంత‌ర్జాతీయ స‌హ‌కార బ‌లోపేతానికి క‌ట్టుబ‌డి ఉంటామ‌ని ప్ర‌క‌టిస్తున్నాం.  అవినీతి నిరోధ‌క చ‌ట్టాల అమ‌లు, నేర‌గాళ్ల అప్ప‌గింత‌, ఆర్థిక‌- అవినీతిప‌రులైన నేర‌గాళ్ల బ‌హిష్క‌ర‌ణ‌, ఆస్తుల స్వాధీనం, అవినీతి తో ప్ర‌మేయం గ‌ల నేర‌ పూరిత‌, నేర‌ ర‌హిత అంశాలపై దేశీయ చ‌ట్ట వ్య‌వ‌స్థ‌ల‌కు అనుగుణంగా మేం స‌హ‌క‌రిస్తాం.  అదే స‌మ‌యంలో నేర‌గాళ్ల‌కు ఆశ్ర‌యం ఇవ్వ‌రాద‌ని, అక్ర‌మ సంపాద‌న‌కు ర‌క్ష‌ణ నిరాక‌రించాల‌ని అంత‌ర్జాతీయ స‌మాజానికి పిలుపునిస్తున్నాం.  బ్రిక్స్ అవినీతి నిరోధ‌క స‌హ‌కారం పెంపు, ప‌ర‌స్ప‌ర అవ‌గాహ‌న కోసం అనుభ‌వాల భాగ‌స్వామ్యం, ఆదాన‌ ప్ర‌దానాలు కీల‌క‌మ‌ని మేం భావిస్తున్నాం.  ఇంత‌కుముందు సంవ‌త్స‌రాలలో చేసిన‌ట్లుగానే ఈ విష‌యంలో మా కృషి ని కొన‌సాగిస్తాం.  యుఎన్‌సిఎసి అమ‌లులో ప‌ర‌స్ప‌ర మ‌ద్ద‌తు ను విస్త‌రిస్తాం.  ఇందుకోసం స‌మాచార ఆదాన‌ ప్ర‌దానానికి, బ‌హుళ ప‌క్ష వేదిక‌ల మ‌మేకానికి వీలుగా వేదికల‌ను సృష్టిస్తాం.  ఈ సంవత్సరాన్ని అవినీతిపై పోరాట సంవ‌త్స‌రంగా ఆఫ్రికా సమాఖ్య ప్ర‌క‌టించడాన్ని అభినందిస్తున్నాం.

 

            80.         బ్రిక్స్ ఆర్థిక భాగ‌స్వామ్య వ్యూహం అమ‌లులో బ్రిక్స్ దేశాల వాణిజ్య మంత్రుల 8వ స‌మావేశం నాటి సానుకూలత‌ల పాత్ర‌ను మేం హ‌ర్షిస్తున్నాం.  వాణిజ్య‌, ఆర్థిక‌ప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌పై బ్రిక్స్ సంప్ర‌దింపుల బృందం (సిజిఇటిఐ)  ప్ర‌స్తుత కార్య‌క‌లాపాలు ఇందుకు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నాయి.  ఆర్థిక‌-వాణిజ్య స‌హ‌కారంపై బ్రిక్స్ కార్యాచ‌ర‌ణ కార్య‌క్ర‌మం అమ‌లులో ప్ర‌గ‌తిని కూడా మేం స్వాగ‌తిస్తున్నాం.  అంత‌ర్జాతీయ విలువ శృంఖ‌లాల్లో ఊర్ధ్వ ప‌య‌నం, విలువ జోడింపు, విస్తృత భాగ‌స్వామ్యం విష‌యంలో మా సంస్థ‌ల ముంద‌ంజ కు మ‌ద్ద‌తునిచ్చే చ‌ర్య‌లను మేం ప్రోత్స‌హిస్తాం.  ప్ర‌త్యేకించి  ప‌రిశ్ర‌మ‌లు- సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా సంస్థ‌లు; వ్య‌వ‌సాయం విష‌యంలో ఈ చ‌ర్య‌లు ముదావ‌హం.  పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్స‌హించ‌డం కోసం విధాన వెసులుబాటు ప‌రిర‌క్ష‌ణ ద్వారానూ చ‌ర్య‌లు హ‌ర్ష‌ణీయం.  బ్రిక్స్ దేశాల మ‌ధ్య విలువ జోడింపు వాణిజ్యం పెరుగుద‌ల‌ ప్రాముఖ్యానికి గుర్తింపుగా సిజిఇటిఐ ప‌రిధి లోని వాణిజ్య ప్రోత్సాహ‌క కార్యాచ‌ర‌ణ బృందాన్ని, బ్రిక్స్ ఇ-కామ‌ర్స్ కార్యాచ‌ర‌ణ బృందాన్ని పున‌రుద్ధ‌రించినందుకు వాణిజ్య మంత్రుల‌ను అభినందిస్తున్నాం.  అలాగే బ్రిక్స్ అంత‌ర్గ‌త విలువ జోడింపు వాణిజ్యానికి ప్రోత్సాహంపై బ్రిక్స్ సంయుక్త వాణిజ్య అధ్య‌య‌నం స‌మీక్ష‌ను ప్రారంభించ‌డాన్ని మేం స్వాగ‌తిస్తున్నాం.  ఐపిఆర్, ఇ-కామ‌ర్స్‌, సేవ‌ల వాణిజ్యం, ఇ-కామ‌ర్స్‌ లో స‌హ‌కారం పెంపు, ప్రామాణిక‌- సాంకేతిక నిబంధ‌న‌లు, ఎంఎస్ఎంఇ లు- న‌మూనా ఇ-పోర్ట్‌ తదిత‌రాల‌పై బ్రిక్స్ వాణిజ్య మంత్రుల 8వ స‌మావేశంలో ఒన‌గూడిన సానుకూల ఫ‌లితాల‌పై హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నాం.

 

             81.             ప్రాంతీయ విమానయానంపై బ్రిక్స్ అవగాహన ఒప్పందాన్ని మేం స్వాగతిస్తున్నాం.  మౌలిక సదుపాయాలు, అనుసంధానం రంగాలలో బ్రిక్స్ సహకారం బలోపేతం కావడంలో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా పరిగణిస్తూ దీన్ని మేం స్వాగతిస్తున్నాం.

 

           82.                బ్రిక్స్ వ్యూహాత్మ‌క‌ సుంక‌పు స‌హ‌కార వ్య‌వ‌స్థ ను అమ‌లు చేయ‌డంలో బ్రిక్స్‌ లో భాగ‌మైన‌  సుంక‌పు యంత్రాంగాల మ‌ధ్య స‌హ‌కార ఫ‌లితాల‌ను మేం ప్ర‌శంసిస్తున్నాం.  అలాగే సంబంధిత విధివిధానాల‌ను త్వ‌రగా ముగించి బ్రిక్స్ ప‌ర‌స్ప‌ర‌ సుంక‌పు వ్య‌వ‌స్థ‌ల స‌హాయ ఒప్పందంలో భాగ‌స్వాముల‌య్యే ప్ర‌య‌త్నాలు స‌హా దాని దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల‌ను స్వాగ‌తిస్తున్నాం.  త‌ద్వారా ఆర్థిక కార్య‌క‌లాపాల నిర్వాహ‌కులు, నియంత్ర‌ణ‌ల‌ను ప‌ర‌స్ప‌రం గుర్తించ‌డం స‌హా బ్రిక్స్ అధీకృత ఆర్థిక నిర్వ‌హ‌ణ కార్య‌క్ర‌మం 2022 చివ‌రిక‌ల్లా ప‌నిచేయ‌డం ప్రారంభిస్తుంది.  దీనికి సంబంధించి బ్రిక్స్ సుంక‌పు వ్య‌వ‌స్థ స్వ‌ల్ప‌, మ‌ధంత‌ర‌, దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల సాధన‌కు, బ్రిక్స్ సుంక‌పు శిక్ష‌ణ కేంద్రాల ఏర్పాటుకు స‌మ‌ష్టిగా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను రూపొందించే బ్రిక్స్ సుంక‌పు కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను కూడా మేం మ‌రింత‌గా స్వాగ‌తిస్తున్నాం.  బ్రిక్స్ సుంక‌పు స‌హ‌కార క‌మిటీ సామ‌ర్థ్యాన్ని కూడా మేం గుర్తిస్తున్నాం.  వాణిజ్య సౌల‌భ్య క‌ల్ప‌న‌, చ‌ట్టాల అమ‌లు, అత్యాధునిక స‌మాచార సాంకేతిక‌త‌ల వినియోగం, సామ‌ర్థ్యం నిర్మాణం స‌హా సంబంధిత బ‌హుళ వేదిక‌ల విష‌యంలో  బ్రిక్స్ అంత‌ర్గ‌త స‌హ‌కారానికి మేం పిలుపునిస్తున్నాం.

 

             83.              అంత‌ర్జాతీయంగా స‌ముచిత‌, సార్వ‌త్రికంగా పార‌ద‌ర్శ‌క ప‌న్ను వ్య‌వ‌స్థ దిశ‌గా అన్ని ర‌కాల‌ ప్ర‌పంచ‌వ్యాప్త చ‌ర్య‌లకు బ్రిక్స్ రెవిన్యూ ప్రాధికార సంస్థ‌లు అందిస్తున్న నిరంత‌ర మ‌ద్ద‌తును మేం ప్ర‌శంసిస్తున్నాం.  డిజిట‌ల్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో ఎదుర‌య్యే చిక్కుల ప‌రిష్కారానికి మా క‌ట్టుబాటును కొన‌సాగిస్తాం.  ఈ క‌ట్టుబాటుకు లోబ‌డి… ప్ర‌త్యేకించి చ‌ట్టాలలోని లొసుగుల ఆధారంగా ప‌న్ను ఎగ‌వేత‌, లాభాల‌ను ప‌న్నుర‌హిత ప్ర‌దేశాల‌కు త‌ర‌లించే ప‌రిస్థితి నివార‌ణ‌, అభ్య‌ర్థ‌న మేర‌కు లేదా దానితో ప‌నిలేకుండా ప‌న్ను స‌మాచార ఆదాన‌ ప్రదానానికి, వ‌ర్ధ‌మాన దేశాల కోసం అవ‌స‌ర ఆధారిత సామ‌ర్థ్య నిర్మాణం త‌దిత‌రాల‌కు అంత‌ర్జాతీయ ప‌న్ను వ్యవ‌స్థ‌ ల‌లో పార‌ద‌ర్శ‌క‌త‌కు భ‌రోసా క‌ల్పించ‌డం మా ల‌క్ష్యం.  స‌మాచార మార్పిడి, అనుభ‌వాల భాగ‌స్వామ్యం, ఉత్త‌మాచ‌ర‌ణ‌లు, ప‌ర‌స్ప‌ర అభ్యాసం, ప‌న్ను అంశాల‌లో సిబ్బంది ఆదాన‌ ప్ర‌దానం వంటివాటికీ క‌ట్టుబాటును మ‌రింత లోతుకు విస్త‌రించేందుకు క‌ట్టుబ‌డి ఉన్నాం.  అలాగే బ్రిక్స్ రెవిన్యూ ప్రాధికార సంస్థ‌ల సామ‌ర్థ్య నిర్మాణ యంత్రాంగం ఏర్పాటును మేం స్వాగ‌తిస్తున్నాం.

 

          84.              మౌలిక స‌దుపాయాలు, తయారీ, ఇంధ‌నం, వ్య‌వ‌సాయ వాణిజ్యం, ఆర్థిక సేవ‌లు, ప్రాంతీయ విమాన‌యానం, సాంకేతిక ప్ర‌మాణాల స‌మాంత‌రీక‌ర‌ణ‌, నైపుణ్యాభివృద్ధి త‌దిత‌రాలలో వాణిజ్య‌, వ్యాపార స‌హ‌కారం మెరుగు దిశ‌గా బ్రిక్స్ వ్యాపార వేదిక‌, బ్రిక్స్ వాణిజ్య‌మండ‌లి ల సేవ‌ల‌ను, మండ‌లి 5వ వార్షిక నివేదిక‌ ను మేం ప్ర‌శంసిస్తున్నాం.  బ్రిక్స్ వాణిజ్య మండ‌లి చ‌ట్రం ప‌రిధిలో డిజిట‌ల్ ఆర్థిక వ్య‌వ‌స్థ కార్యాచ‌ర‌ణ బృందం ఏర్పాటును స్వాగ‌తిస్తున్నాం.

 

          85.               సుస్థిర ఆర్థిక‌, సామాజిక అభివృద్ధిలో ప‌ర్యాట‌క రంగం పోషించ‌గ‌ల పాత్ర‌ను గుర్తిస్తూ ఈ రంగంపై బ్రిక్స్ కార్యాచ‌ర‌ణ బృందం ఏర్పాటు చొర‌వ‌ను స్వాగ‌తిస్తున్నాం.  త‌ద్వారా బ్రిక్స్ ఆర్థికాభివృద్ధికి, స‌భ్య‌త్వ దేశాల మ‌ధ్య మ‌రింత స‌హ‌కారానికి, ప్ర‌జ‌ల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర సంబంధాల మెరుగుకు ప్రోత్సాహం లభిస్తుంది.  ఇందులో భాగంగా యాత్రా వాణిజ్యం, ఆర్థిక‌, బీమా, వైద్య‌ప‌ర‌మైన ప‌ర్యాట‌క భ‌ద్ర‌త‌-మ‌ద్ద‌తు, వైమానిక అనుసంధానం, ప‌ర్యాట‌క మౌలిక వ‌స‌తులు, సాంస్కృతిక‌-వైద్య ప‌ర్యాట‌కం, ప‌ర్యాట‌క విప‌ణికి గ‌ల అవ‌రోధాలు త‌దిత‌ర అంశాల‌కు సంబంధించి ప‌రిజ్ఞానం, ఉత్త‌మాచ‌ర‌ణ‌లు, అనుభ‌వాల ఆదాన‌ ప్ర‌దానం దిశ‌గా బ్రిక్స్ ప‌ర్యాట‌కం కృషి కొన‌సాగుతుంది.  అంత‌ర్జాతీయంగా ఆర్థిక అధోగ‌మ‌నం క‌నిపిస్తున్నా ఈ కృషి ఫ‌లితంగా బ్రిక్స్ అంత‌ర్గ‌త ప‌ర్యాట‌కం వృద్ధి చెంద‌డంపై సంతృప్తి ని ప్రకటిస్తున్నాం.

 

V.                                            ప్రజలకు-ప్రజలకు మధ్య సహకారం

 

         86.                 బ్రిక్స్ దేశాలు, వాటి కార్యక్రమాలలో ప్రజా కేంద్రక ప్రాధాన్యాన్ని నొక్కిచెబుతూనే- క్రీడా, యువ‌జ‌న‌, చ‌ల‌న‌చిత్ర‌, సాంస్కృతిక‌, విద్యా, ప‌ర్యాట‌క రంగాల్లో నిల‌క‌డైన పురోగ‌తి, ఆదాన‌ ప్ర‌దానాల‌ను ప్ర‌శంసిస్తున్నాం.

 

            87.                  మ‌న ప్ర‌జ‌ల‌కు సంబంధించి అన్ని రంగాలలో ప్ర‌జా కేంద్ర‌క అభివృద్ధి విధానాల‌కు మా క‌ట్టుబాటును పున‌రుద్ఘాటిస్తున్నాం.

 

              88.              ద‌క్షిణార్థగోళం లోని బ్రసీలియా లో తొలి సారి ప్ర‌పంచంలో అతి పెద్ద జ‌ల‌ సంబంధ కార్య‌క్ర‌మమైన 8వ అంత‌ర్జాతీయ జ‌ల వేదిక స‌ద‌స్సును నిర్వ‌హించ‌డాన్ని ప్ర‌శంసిస్తున్నాం.  ప్ర‌పంచ స్థాయిలో నీటికి అత్యంత ప్రాధాన్యం ఏర్ప‌డ‌టానికి ఇది దోహ‌ద‌ప‌డింది.

 

              89.                అంత‌రిక్ష సంబంధిత అంశాల్లో బ్రిక్స్ దేశాల మ‌ధ్య స‌హ‌కారం ప్రాముఖ్యాన్ని మేం నొక్కిచెబుతున్నాం.  ఈ రంగంలో ప్ర‌స్తుత వినూత్న కార్యక్రమాల‌ను బ‌లోపేతం చేయ‌డానికి మా మ‌ద్ద‌తు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేస్తున్నాం.

 

            90.                బ్రిక్స్ దేశాల ప‌రిధిలో వ్యాధి నిరోధ‌క టీకాల ప‌రిశోధ‌న‌- అభివృద్ధి లో స‌హ‌కారం, స‌మ‌న్వ‌యాల‌ను దృఢం చేయ‌డానికి మేం క‌ట్టుబ‌డి ఉన్నాం.  ఈ దిశ‌గా బ్రిక్స్ వ్యాధి నిరోధ‌క టీకాల ప‌రిశోధ‌న‌- అభివృద్ధి కేంద్రం ఏర్పాటు ప్ర‌తిపాద‌న‌ను స్వాగ‌తిస్తున్నాం.

 

            91.                 సుస్థిర ప్ర‌గ‌తి శ‌కంలో క్ష‌య వ్యాధి నిర్మూల‌న పై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తొలి అంత‌ర్జాతీయ మంత్రిత్వ స్థాయి స‌ద‌స్సు ఏర్పాటు చేయ‌డాన్ని స్వాగ‌తిస్తున్నాం.  మాస్కో లో 2017లో జ‌రిగిన స‌ద‌స్సులో దీనికి బ‌హుళ‌రంగ ప్ర‌తిస్పంద‌న ల‌భించింది. త‌ద‌నుగుణంగా క్ష‌యను నిర్మూలిద్దాం అంటూ స‌ద‌స్సు ప్ర‌క‌టించింది.  ఈ ప‌రిణామాలు క్ష‌య వ్యాధి నిర్మూల‌న‌పై ఐక్య‌రాజ్య స‌మితి స‌ర్వ ప్ర‌తినిధి స‌భ 2018 సెప్టెంబ‌రు లో నిర్వ‌హించ‌బోయే తొలి ఉన్న‌త‌ స్థాయి స‌మావేశం యొక్క ప్రాధాన్యాన్ని, సాంక్రామిక వ్యాధుల నిరోధం-నియంత్ర‌ణ‌ ల‌పై ఐరాస నిర్వ‌హించ‌బోయే 3వ ఉన్న‌త‌స్థాయి స‌మావేశ ప్రాముఖ్యాన్ని నొక్కిచెప్పింది.

 

               92.               నాలుగో పారిశ్రామిక విప్ల‌వ చోద‌కాల‌లో ఒక‌టిగా సాంస్కృతిక రంగానికి గ‌ల పాత్ర‌ను, ప్రాధాన్యాన్ని మేం గుర్తించాం.  ఆ మేర‌కు అది మ‌న ముందుంచ‌బోయే ఆర్థిక అవ‌కాశాల‌ను గుర్తించాం.

 

              93.                 బ్రిక్స్ మూడో చ‌ల‌న‌చిత్రోత్స‌వాల నిర్వ‌హ‌ణ‌ను ప్ర‌శంసించ‌డంతో పాటు ఈ రంగంలో స‌హ‌కారాన్ని మ‌రింత లోతు కు తీసుకుపోవలసిన అవ‌స‌రాన్ని గుర్తించాం.  ఈ రంగంలో స‌హ‌కారాన్ని ప్రోత్స‌హించడం స‌హా బ్రిక్స్ దేశాల వైవిధ్య సంస్కృతుల‌ను ప్ర‌ద‌ర్శించే దిశ‌గా చ‌ల‌న‌చిత్ర స‌హ-నిర్మాణంపై బ్రిక్స్ ముసాయిదా ఒప్పందం రూప‌క‌ల్ప‌న‌కు ద‌క్షిణాఫ్రికా చేసిన ప్ర‌తిపాద‌న‌ను ప్ర‌శంసిస్తున్నాం.

 

                94.             సాంస్కృతిక రంగంలో స‌హ‌కారంపై బ్రిక్స్ దేశాలలోని ప్ర‌భుత్వాల న‌డుమ గ‌ల ఒప్పందం (2017-2021) అమ‌లు లో మార్గ‌ద‌ర్శ‌క పాత్ర పోషించే కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళికకు ప్రాధాన్యం ఉంద‌ని నొక్కి చెబుతున్నాం.  సృజ‌నాత్మ‌క‌, సుస్థిర సాంస్కృతిక స‌హ‌కారానికి ఇది ఎంతో అవ‌స‌రం.  అలాగే బ్రిక్స్ సాంస్కృతిక నిపుణులు చేప‌ట్టిన వివిధ కార్య‌క్ర‌మాలు, వినూత్న చ‌ర్య‌ల ప్‌వగ‌తిని గుర్తించాం.

 

              95.                బ్రిక్స్ 2వ ప‌రిపాల‌న స‌ద‌స్సు-2018ని జోహానిస్‌బ‌ర్గ్‌ లో నిర్వ‌హించడాన్ని ప్ర‌శంసిస్తున్నాం.  అదే స‌మ‌యంలో బ్రిక్స్ దేశాల‌కు చెందిన మేధో నిల‌యాలు, విద్యావేత్త‌ల విస్తృత‌-వైవిధ్య భాగ‌స్వామ్యంతో 2019లో తాము మూడో స‌ద‌స్సును నిర్వ‌హిస్తామంటున్న బ్రెజిల్ ఆస‌క్తిని గుర్తిస్తున్నాం.

 

                96.                   మేధో నిలయ మండలి, విద్యావేదిక, బ్రిక్స్ సివిల్ వేదిక, యువ దౌత్యవేత్తల వేదిక, యువజన సదస్సు, యువ శాస్త్రవేత్తల వేదిక లు సహా మన దేశాల ప్రజల మధ్య ఆదాన ప్రదానాల ద్వారా సహకారం, అన్యోన్య సహచర్యం బలోపేతం దిశగా పురోగతిపై ప్రశంసాపూర్వక సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం.

 

                    97.                   బ్రిక్స్ విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధుల మధ్య చర్చాగోష్ఠి నిర్వహణలో దక్షిణాఫ్రికా చొరవను ప్రశంసిస్తున్నాం.

 

                  98.                        బ్రిక్స్ 3వ వార్షిక క్రీడలను దక్షిణాఫ్రికా విజయవంతంగా నిర్వహించడాన్ని శ్లాఘిస్తున్నాం.  అలాగే బ్రిక్స్ క్రీడామండలి ఏర్పాటు లో పురోగతిని ప్రశంసిస్తున్నాం.

 

                    99.                   మహిళా పార్లమెంటేరియన్ లు సహా చట్టసభ సంబంధ ఆదాన ప్రదానం ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తూ- దీనికి సంబంధించి బ్రిక్స్ దేశాల నడుమ భావి ఆదాన ప్రదానాల బలోపేతం కోసం ఎదురుచూస్తున్నాం.

 

                      100.                  సంఘటిత అభివృద్ధిని ప్రోత్సహించడం లో మహిళలు పోషించిన పాత్రను నొక్కిచెబుతూ- బ్రిక్స్ మహిళా వేదిక, బ్రిక్స్ మహిళా వాణిజ్య కూటమి ఏర్పాటు దిశగా సాగుతున్న కృషిని కొనియాడుతున్నాం.

 

                   101.                       దక్షిణాఫ్రికా 2018లో బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతను సమర్థంగా నిర్వహించడాన్ని బ్రెజిల్, రష్యా, భారత్, చైనా లు ప్రశంసిస్తున్నాయి.  అలాగే బ్రిక్స్ 10వ శిఖరాగ్ర సదస్సుకు జోహానిస్‌బ‌ర్గ్‌ లో ఆతిథ్యం ఇవ్వడం పై దక్షిణాఫ్రికా ప్రభుత్వాన్ని, ప్రజలను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాయి.

 

            102.                      బ్రిక్స్-2019 అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ స్వీకరించేందుకు, 11వ శిఖరాగ్ర సదస్సు నిర్వహించడానికి రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా లు పూర్తి మద్దతిను ఇన్నాయి.

 

అనుబంధం 1: జోహానిస్‌బ‌ర్గ్ కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌

బ్రిక్స్ 10వ శిఖ‌రాగ్ర స‌ద‌స్సు – జులై 25 నుండి 27 (జోహానిస్‌బ‌ర్గ్‌)

జోహానిస్‌బ‌ర్గ్ శిఖ‌రాగ్ర స‌ద‌స్సు దాకా ద‌క్షిణాఫ్రికా అధ్య‌క్ష‌త‌న బ్రిక్స్ నిర్వ‌హణ‌లో ఏర్పాటైన దిగువ జాబితా లోని స‌మావేశాలు సాధించిన ఫ‌లితాల‌ను మేం గుర్తించాం:

 

మంత్రిత్వ శాఖల స్థాయి స‌మావేశాలు:

 

•         బ్రిక్స్ ఆర్థిక‌ శాఖ స‌హాయ‌మంత్రుల స‌మావేశం – మార్చి 17 నుండి 20దాకా… (బ్యూనోస్ ఏరీస్)

•         బ్రిక్స్ ఆర్థిక‌శాఖ మంత్రులు, కేంద్ర బ్యాంకుల గ‌వ‌ర్న‌ర్ల స‌మావేశం – ఏప్రిల్ 18 నుండి 20దాకా… (వాషింగ్ట‌న్ డి.సి)

•         బ్రిక్స్ ఆర్థిక‌శాఖ స‌హాయ‌మంత్రుల స‌మావేశం – ఏప్రిల్ 18 నుండి 20దాకా… (వాషింగ్ట‌న్ డిసి)

•         బ్రిక్స్ ప‌ర్యావ‌ర‌ణ శాఖ‌ మంత్రుల స‌మావేశం – మే 18 (డ‌ర్బ‌న్‌)

•         బ్రిక్స్ విదేశాంగ/అంత‌ర్జాతీయ సంబంధాల‌ శాఖ మంత్రుల స‌మావేశం – జూన్ 4 (ప్రిటోరియా)

•         బ్రిక్స్ రెవిన్యూ ప్రాధికార సంస్థ‌ల‌ అధిప‌తుల స‌మావేశం – జూన్ 18 నుండి 21దాకా… (జోహానిస్‌బ‌ర్గ్‌)

•         బ్రిక్స్ వ్య‌వ‌సాయ‌, వ్య‌వ‌సాయాభివృద్ధి శాఖల మంత్రుల 8వ‌ స‌మావేశం – జూన్ 19 నుండి 22దాకా… (ఎంపుమ‌లాంగా)

•         జాతీయ భ‌ద్ర‌త స‌ల‌హాదారుల 8వ స‌మావేశం – జూన్ 28 నుండి 29దాకా… (డ‌ర్బ‌న్‌)

•         బ్రిక్స్ ఇంధ‌న‌శాఖ మంత్రుల స‌మావేశం – జూన్ 28 నుండి 29దాకా.. (గౌటెంగ్‌)

•         బ్రిక్స్ దేశాల విప‌త్తు నిర్వ‌హ‌ణ‌ శాఖ మంత్రుల స‌మావేశం – జూన్ 29 నుండి జులై 1దాకా.. (ఈస్ట్ లండ‌న్‌)

•         బ్రిక్స్ శాస్త్ర-సాంకేతిక‌, ఆవిష్క‌ర‌ణ శాఖ మంత్రుల 6వ స‌మావేశం – జులై 3 (డ‌ర్బ‌న్‌)

•         బ్రిక్స్ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రుల 3వ స‌మావేశం – జులై 4 (గౌటెంగ్‌)

•         బ్రిక్స్ వాణిజ్య‌శాఖ మంత్రుల 8వ స‌మావేశం – జులై 5 (మ్యాగ‌లీస్‌బ‌ర్గ్‌)

•         బ్రిక్స్ విద్యా శాఖ మంత్రుల స‌మావేశం – జులై 10 (కేప్ టౌన్‌)

•         బ్రిక్స్ ఆర్థిక‌ శాఖ మంత్రులు, కేంద్ర బ్యాంకుల గ‌వ‌ర్న‌ర్ల స‌మావేశం – జులై 19 నుండి 22దాకా.. (అర్జెంటీనా)

•         బ్రిక్స్ ఆరోగ్య‌ శాఖ మంత్రుల 8వ స‌మావేశం – జులై 20 (డ‌ర్బ‌న్‌)

 

సీనియ‌ర్ అధికారులు.. రంగాల‌వారీ స‌మావేశాలు:

•         బ్రిక్స్ షెర్పాలు/శిక్ష‌ణ‌లోగ‌ల షెర్పాల తొలి స‌మావేశం – ఫిబ్ర‌వ‌రి 4 నుండి 6దాకా.. (కేప్‌టౌన్‌)

•         బ్రిక్స్ అవినీతి నిరోధ‌క కార్యాచ‌ర‌ణ బృందం తొలి స‌మావేశం – ఫిబ్ర‌వ‌రి 26 (బ్యూన‌స్ ఐర్స్‌, అర్జంటీనా)

•         ఆర్థిక‌-వాణిజ్య అంశాల‌పై సంప్ర‌దింపుల బృందం (సిజిఇటిఐ) 17వ స‌మావేశం – ఫిబ్ర‌వ‌రి 28 నుండి మార్చి 2దాకా.. (జోహానిస్‌బ‌ర్గ్‌)

•         జాతీయ గ‌ణాంక కార్యాలయాల 9వ సాంకేతిక స‌మావేశం – మార్చి 13 నుండి 15దాకా.. (ప్రిటోరియా)

•         బ్రిక్స్ బాండ్ల నిధి (బిబిఎఫ్) కార్యాచ‌ర‌ణ బృందం స‌మావేశం – మార్చి 17 నుండి 20దాకా.. (బ్యూనోస్ ఏరీస్, అర్జెంటీనా)

•         సుంకాల నిపుణుల స‌మావేశం – ఏప్రిల్ 16 నుండి 17దాకా… (డ‌ర్బ‌న్‌)

•         సుంకాల‌పై స‌హ‌కార క‌మిటీ 2వ స‌మావేశం – ఏప్రిల్ 18 నుండి 19దాకా.. (డ‌ర్బ‌న్‌)

•         బిబిఎఫ్ కార్యాచ‌ర‌ణ బృందం, బ్రిక్స్ సిఆర్ఎ స్థాయీ సంఘం స‌మావేశం – ఏప్రిల్ 18 నుండి 20 దాకా.. (వాషింగ్ట‌న్ డిసి, అమెరికా)

•         ఉగ్ర‌వాద నిరోధంపై కార్యాచ‌ర‌ణ బృందం స‌మావేశం – ఏప్రిల్ 19 నుండి 20 దాకా.. (వైట్ రివ‌ర్‌, నెల్స్‌ప్రూట్‌)

•         బ్రిక్స్ షెర్పాలు/శిక్ష‌ణ‌లో గ‌ల షెర్పాల 2వ స‌మావేశం – ఏప్రిల్ 24 నుండి 26 దాకా.. (బెలాబెలా, లింపోపో)

•         కార్మిక‌-ఉపాధి క‌ల్ప‌న కార్యాచ‌ర‌ణ బృందం తొలి స‌మావేశం – మే 7 నుండి 10 దాకా.. (ఎంపుమాలాంగా)

•         బ్రిక్స్ మేధోహ‌క్కుల స‌హ‌కార యంత్రాంగం 2వ స‌మావేశం – మే 10 (ఈస్ట్ లండ‌న్‌)

•         బ్రిక్స్ ఈ-కామ‌ర్స్ కార్యాచ‌ర‌ణ బృందం 2వ స‌మావేశం – మే 10 (ఈస్ట్ లండ‌న్‌)

•         బ్రిక్స్ వాణిజ్య ప్రోత్సాహ‌క కార్యాచ‌ర‌ణ బృందం తొలి స‌మావేశం – మే 10 (ఈస్ట్ లండ‌న్‌)

•         సాంకేతిక నిబంధ‌న‌లు-ప్ర‌మాణాలు-నిర్ధార‌ణ అంచ‌నా, కొల‌మానాలు-గుర్తింపుపై సాంకేతిక నిపుణుల స‌మావేశం – మే 10 (ఈస్ట్ లండ‌న్‌)

•         వాణిజ్య గ‌ణాంక సేవ‌ల‌పై కార్యాచ‌ర‌ణ స‌ద‌స్సు – మే 10 (ఈస్ట్ లండ‌న్‌)

•         ఆర్థిక‌-వాణిజ్య అంశాల‌పై సంప్రదింపుల బృందం (సిజిఇటిఐ) 18వ స‌మావేశం – మే 11 నుండి 12దాకా.. (ఈస్ట్ లండ‌న్‌)

•         బ్రిక్స్ ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌హారాల కార్యాచ‌ర‌ణ బృందం స‌మావేశం – మే 14 నుండి 16 దాకా.. (ప్రిటోరియా)

•         ఐసిటి వినియోగంలో భ‌ద్ర‌త‌పై కార్యాచ‌ర‌ణ బృందం స‌మావేశం – మే 16 నుండి 17దాకా.. (కేప్‌ టౌన్‌)

•         ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వహారాల సీనియ‌ర్ అధికారుల స‌మావేశం – మే 17 (డ‌ర్బ‌న్‌)

•         బ్రిక్స్ ఇంధ‌న సామ‌ర్థ్య‌-పొదుపు కార్యాచ‌ర‌ణ బృందం స‌మావేశం – మే 17 నుండి 18దాకా.. (కేప్‌టౌన్‌)

•         బ్రిక్స్ మేధోనిల‌య మండ‌లి (బిటిటిసి) స‌మావేశం – మే 28 (పార్క్‌టౌన్‌)

•         బ్రిక్స్ విద్యావేదిక స‌మావేశం – మే 28 నుండి 31దాకా… (జోహానిస్‌బ‌ర్గ్‌)

•         నాణ్య‌త మౌలిక వ‌స‌తులపై (ప్ర‌మాణాలు, గుర్తింపు, కొల‌మానాల వ్య‌వ‌స్థ‌లు) స‌మావేశం – మే 16 (గౌటెంగ్‌)

•         ప్ర‌పంచ ఆరోగ్య మ‌హాస‌భ సారాంశం ఆధారంగా ఆరోగ్యంపై బ్రిక్స్ స‌మావేశం – మే (జెనీవా, స్విట్జ‌ర్లాండ్‌)

•         బ్రిక్స్ షెర్పాలు/శిక్ష‌ణ‌లో గ‌ల షెర్పాల 3వ స‌మావేశం – జూన్ 2 నుండి 3దాకా… (ప్రిటోరియా)

•         ప‌న్ను వ్య‌వ‌హారాల‌పై నిపుణుల స‌మావేశం- జూన్ 18 నుండి 19దాకా.. (కేప్‌టౌన్‌)

•         ప‌శ్చిమాసియా, ఉత్త‌ర ఆఫ్రికా (ఎంఇఎన్ఎ)ల‌పై సీనియ‌ర్ అధికారులు/నిపుణుల 4వ స‌మావేశం- జూన్ 19 (ప్రిటోరియా)

•         వ్యవ‌సాయ స‌హ‌కారంపై కార్యాచ‌ర‌ణ బృందం 8వ స‌మావేశం – జూన్ 20 (నెల్స్‌ప్రూట్‌)

•         వ్య‌వ‌సాయ క్షేత్రాల సంద‌ర్శ‌న- జూన్ 22

•         పౌర‌స‌మాజ సంస్థ‌ (సిఎస్ ఒ)ల స‌మావేశం- జూన్ 25 నుండి 26 దాకా.. (జోహానిస్‌బ‌ర్గ్‌)

•         బ్రిక్స్ సివిల్ స‌మావేశం – జూన్ 25 నుండి 27దాకా.. (పార్క్‌టౌన్‌, జోహానిస్‌బ‌ర్గ్‌)

•         సుంకాల స‌హ‌కార క‌మిటీ 3వ స‌మావేశం – జూన్ 26 (బ్ర‌సెల్స్‌, బెల్జియం)

•         బ్రిక్స్ అవినీతి నిరోధ‌క కార్యాచ‌ర‌ణ బృందం 2వ స‌మావేశం – జూన్ 26 (పారిస్‌, ఫ్రాన్స్‌)

•         యువ దౌత్య‌వేత్త‌ల వేదిక 4వ స‌మావేశం – జూన్ 25 నుండి 29దాకా.. (ప్రిటోరియా)

•         బ్రిక్స్ యువ శాస్త్రవేత్త‌ల వేదిక 3వ స‌మావేశం – జూన్ 25 నుండి 29దాకా.. (డ‌ర్బ‌న్ ఐసిసి)

•         బ్రిక్స్ స్నేహ‌పూర్వ‌క న‌గ‌రాలు-స్థానిక ప్ర‌భుత్వాల స‌హ‌కార వేదిక స‌మావేశం – జూన్ 28 నుండి 29దాకా.. (ఈస్ట్ లండ‌న్‌)

•         బ్రిక్స్ నిధి విత‌ర‌ణ భాగ‌స్వాముల ఎస్టీఐ కార్యాచ‌ర‌ణ బృందం 4వ సమావేశం – జూన్ 30 (డ‌ర్బ‌న్‌)

•         బ్రిక్స్ శాస్త్ర-సాంకేతిక‌, ఆవిష్క‌ర‌ణ‌ల విభాగం 8వ స‌మావేశం – జులై 2 (డ‌ర్బ‌న్‌)

•         పరిశ్ర‌మ నిపుణుల 3వ స‌మావేశం – జులై 3 (మ్యాగ‌లీస్‌బ‌ర్గ్‌)

•         ప‌రిపాల‌న‌పై బ్రిక్స్ 2వ స‌ద‌స్సు – జులై 3 నుండి 4దాకా.. (జోహానిస్‌బ‌ర్గ్‌)

•         ఆర్థిక‌-వాణిజ్య అంశాల‌పై సంప్ర‌దింపుల బృందం (సిజిఇటిఐ) 19వ స‌మావేశం – జులై 2 నుండి 4దాకా.. (గౌటెంగ్‌)

•         బ్రిక్స్ విశ్వ‌విద్యాల‌య నెట్‌వ‌ర్క్ స‌ద‌స్సు – జులై 5 నుండి 7దాకా.. (స్టెలెన్‌బాష్‌)

•         విద్యారంగంపై బ్రిక్స్‌ సీనియ‌ర్ అధికారుల స‌మావేశం – జులై 9 (కేప్‌టౌన్‌)

•         ర‌వాణా మౌలిక వ‌స‌తుల‌పై అంత‌ర్జాతీయ స‌ద‌స్సు (ఐసిటిఐ) – జులై 9 నుండి 1దాకా… (ప్రిటోరియా)

•         బ్రిక్స్ 4వ యువ‌జ‌న స‌ద‌స్సు – జులై 16 నుండి 21దాకా.. (బ్లూమ్‌ఫాంటెయిన్‌, ఫ్రీ స్టేట్‌)

•         బ్రిక్స్ 3వ క్రీడా స‌ద‌స్సు – జులై 17 నుండి 22దాకా… (జోహాన్నెస్‌బ‌ర్గ్‌)

•         బ్రిక్స్ ఆరోగ్య శాఖ సీనియ‌ర్ అధికారుల స‌మావేశం – జులై 18 నుండి 19దాకా.. (డ‌ర్బ‌న్‌)

•         బీబీఎఫ్ కార్యాచ‌ర‌ణ బృందం, బ్రిక్స్ సీఆర్ఏ స్థాయీ సంఘం స‌మావేశం- జులై 19 నుండి 22దాకా.. (అర్జెంటీనా)

•         బ్రిక్స్ వాణిజ్య‌ మండ‌లి వార్షిక స‌మావేశం- జులై 22 నుండి 23దాకా.. (డ‌ర్బ‌న్‌)

•         బ్రిక్స్ 3వ చ‌ల‌న చిత్రోత్స‌వం-2018… జులై 22 నుండి 28వ‌ర‌కు (డ‌ర్బ‌న్‌)

•         బ్రిక్స్ షెర్పాలు/శిక్ష‌ణ‌లో గ‌ల షెర్పాల 4వ స‌మావేశం – జులై 20 నుండి 24దాకా.. (జోహానిస్‌బ‌ర్గ్‌)

•         బ్రిక్స్ వాణిజ్య‌మండ‌లి ఇంధ‌న వేదిక స‌మావేశం – జులై 24 (జోహానిస్‌బ‌ర్గ్‌)

•         బ్రిక్స్ వ్యాపార వేదిక స‌మావేశం – జులై 25 (శాండ్‌ట‌న్‌)

•         బ్రిక్స్ ఐసీఎం చైర్మ‌న్ల వార్షిక స‌మావేశం – జులై 25 నుండి 26దాకా.. (కేప్‌టౌన్‌)

•         బ్రిక్స్ ఆర్థిక వేదిక స‌మావేశం – జులై 25 నుండి 26దాకా.. (కేప్‌టౌన్‌)

 

 2018 బ్రిక్స్ దక్షిణాఫ్రికా అధ్యక్ష పదవీ కాలానికిగాను మిగిలి ఉన్న కార్యకలాపాలు

 

బ్రిక్స్ నేతల మధ్య లాంఛనప్రాయ సమావేశాలు (బ్యూనోస్ ఏరీస్, అర్జెంటీనా)

 

మంత్రిత్వ శాఖల స్థాయి సమావేశాలు:

•         బ్రిక్స్ క్రీడా మంత్రుల మండలి సమావేశం

•         బ్రిక్స్ కార్మిక-ఉపాధిక కల్పన శాఖ మంత్రుల సమావేశం (ఎల్ఇఎంఎం) (డర్బన్)

•         బ్రిక్స్ సమాచార శాఖ మంత్రుల 4వ సమావేశం (డర్బన్)

•         బ్రిక్స్ విదేశాంగ/అంతర్జాతీయ సంబంధాల శాఖ మంత్రుల సమావేశం (న్యూయార్క్, అమెరికా)

•         బ్రిక్స్ ఆర్థికయ శాఖ మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల సమావేశం

•         బ్రిక్స్ పర్యాటక శాఖ సీనియర్ అధికారుల సమావేశం (గౌటెంగ్)

 

 సీనియర్ అధికారుల రంగాలవారీ సమావేశాలు:

 

•         కార్మిక- ఉపాధి కల్పన కార్యాచరణ బృందం (ఇడబ్ల్యుజి ) రెండో సమావేశం (డర్బన్)

•         బ్రిక్స్ క్షయ పరిశోధన నెట్ వర్క్ సమావేశం (డర్బన్)

•         బ్రిక్స్ 3వ మీడియా వేదిక సమావేశం

•         ఐసిటి లో సహకారంపై బ్రిక్స్ 3వ కార్యాచరణ బృందం సమావేశం

•         బ్రిక్స్ మహిళా శాస్త్ర-సాంకేతిక, ఆవిష్కరణల వేదిక సమావేశం (ప్రిటోరియా)

•         వ్యవసాయ-పారిశ్రామిక రోడ్ శో

•         ఆఫ్రికాలో అభివృద్ధి ఆర్థిక సాయంపై బ్రిక్స్ సదస్సు (నెల్సన్ మండేలా విశ్వవిద్యాలయం, పోర్ట్ ఎలిజబెత్)

•         బ్రిక్స్ న్యాయ వేదిక (కేప్ టౌన్)

•         బ్రిక్స్ సాంస్కృతిక శాఖ సీనియర్ అధికారుల సమావేశం

•         బ్రిక్స్ సాంస్కృతికోత్సవాలు (వివిధ నగరాల్లో..)

•         బ్రిక్స్ కార్యాచరణ (స్పర్థా) బృందాల సమావేశాలు

•         బ్రిక్స్ స్పర్థా ప్రాధికార సంస్థల అధిపతుల సమావేశం (ప్రిటోరియా)

•         బ్రిక్స్ పరిపాలన-సంస్కరణలపై బ్రిక్స్ ఎస్ఓఈ వేదిక 3వ సమావేశం (డర్బన్)

•         బ్రిక్స్ పరిశ్రమతో పరిశ్రమ’ (పారిశ్రామిక చర్చలు) 4వ సమావేశం (డర్బన్)

•         బ్రిక్స్ ఐసిటి సహకారంపై కార్యాచరణ బృందం (సీనియర్ అధికారుల) 3వ సమావేశం (డర్బన్)

•         బ్రిక్స్ షెర్పాలు/శిక్షణలో గల షెర్పాల 5వ సమావేశం (న్యూయార్క్, అమెరికా)

•         బ్రిక్స్ 2వ నైపుణ్యాల ప్రదర్శన పోటీ (జోహానిస్ బర్గ్)

•         బ్రిక్స్ సీఆర్ఏ పాలకమండలి సమావేశం, బ్రిక్స్ బిఎఫ్ కార్యాచరణ బృందం సమావేశం (బాలి, ఇండోనేశియా)

•         జీవ సాంకేతికత, జీవౌషధాలపై బ్రిక్స్ ఎస్ టిఐ కార్యాచరణ బృందం రెండో సమావేశం (కేప్ టౌన్)

•         బ్రిక్స్ సాంస్కృతిక శాఖ మంత్రుల 3వ సమావేశం (డర్బన్)

•         బ్రిక్స్ విధాన రూపకల్పన సంప్రదింపుల 4వ దఫా చర్చలు

•        భౌగోళిక ప్రాంతీయ విజ్ఙానశాస్త్రాలు, వాటి అనువర్తనాలపై బ్రిక్స్ కార్యాచరణ బృందం 3వ సమావేశం (ప్రిటోరియా)

•        జాతీయ విపత్తుల నిరోధం- పర్యవేక్షణలపై బ్రిక్స్ కార్యాచరణ బృందం 3వ సమావేశం (ప్రిటోరియా)

•         బ్రిక్స్ జాతీయ గణాంక కార్యాలయ సమావేశం

•         బ్రిక్స్ అంతరిక్ష పరిశోధన సంస్థల వేదిక (ప్రిటోరియా)

•         బ్రిక్స్ ఖగోళ సదస్సు (సదర్ లాండ్; సాల్ట్ (సదరన్ ఆఫ్రికన్ భారీ టెలిస్కోప్)

•         బ్రిక్స్ షెర్పాలు/శిక్షణలో గల శెర్పాల 6వ సమావేశం (బ్యూనోస్ ఏరీస్, అర్జెంటీనా)

•         బ్రిక్స్ ఎస్ టిఐ మధ్యవర్తిత్వ కార్యక్రమం

•         బ్రిక్స్ శాస్త్రవిజ్ఞాన అకాడమీల మధ్య చర్చ (జోహానిస్ బర్గ్)

•         బ్రిక్స్ 3వ జల వేదిక (ప్రిటోరియా)

•         బ్రిక్స్ ఎస్ టిఐ సలహా మండళ్లు రౌండ్ టేబుల్ (ప్రిటోరియా)

•         బ్రిక్స్ ఎస్ టిఐ సాంకేతికత బదిలీ ఎస్ఎంఎంఇ వేదిక (ప్రిటోరియా)

•         బ్రిక్స్ షెర్పాలు/శిక్షణలో గల శెర్పాల 7వ సమావేశం

•         జనాభా సంబంధాంశాలపై బ్రిక్స్ అధికారులు, నిపుణుల సమావేశం (పిలానెస్ బర్గ్, రస్టెన్ బర్గ్)

 

 

**