Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాతీయ క్రీడా దినోత్స‌వం నాడు క్రీడల ఔత్సాహికుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన‌ ప్ర‌ధాన మంత్రి


జాతీయ క్రీడా దినోత్స‌వం సందర్భంగా క్రీడల ఔత్సాహికుల‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

‘‘క్రీడ‌ల ప‌ట్ల ఉత్సాహాన్ని కలిగివుండే అంద‌రికీ జాతీయ క్రీడా దినోత్స‌వం నాడు ఇవే శుభాకాంక్ష‌లు. విఖ్యాత హాకీ క్రీడాకారుడు కీర్తి శేషుడు మేజ‌ర్ ధ్యాన్ చంద్ గారి జ‌యంతి ని పుర‌స్క‌రించుకొని ఆయ‌న‌కు ఇదే నా స్మృత్యంజ‌లి. క్రీడ‌ల‌కు, ఫిట్‌నెస్ సంబంధిత కార్య‌క‌లాపాల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌ండని ప్ర‌జ‌ల‌కు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దీని ద్వారా ఒక ఆరోగ్య‌క‌ర‌మైన భార‌త‌దేశం దిశ‌గా ప‌య‌నించ‌వ‌చ్చు.

వివిధ క్రీడా పోటీల‌ లో భార‌త‌దేశానికి ప్రాతినిధ్యం వ‌హించిన అందరికీ నేను నమస్కరిస్తున్నాను. వారి క‌ఠోర శ్ర‌మ మ‌రియు దృఢ సంక‌ల్పం అనేక మైలురాళ్ళ‌ కు దారితీసింది. భార‌తీయ క్రీడాకారులు కామ‌న్‌వెల్త్ గేమ్స్, ఇంకా ఏశియ‌న్ గేమ్స్-2018 లు స‌హా వేరు వేరు ఆట‌ల పోటీల‌లో రాణిస్తుండడంతో ఈ సంవ‌త్స‌రం మన క్రీడాకారుల స‌ముదాయానికి ఎంతో ఘ‌నం గా ఉంటోంది’’ అని త‌న సందేశంలో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

**