పిఎంఇండియా
భారతదేశం, బల్గేరియా ల మధ్య పర్యటన రంగ సంబంధిత సహకారాన్ని బలోపేతం చేసుకొనేందుకు అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎంఒయు) పై సంతకాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
వివరాలు:
ఈ అవగాహన పూర్వక ఒప్పంద పత్రం ప్రధాన ఉద్దేశాలలో:
ఎ) పర్యటన రంగం లో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరింప జేసుకోవడం,
బి) పర్యటన కు సంబంధించిన సమాచారాన్ని పరస్పరం వెల్లడి చేసుకోవడం,
సి) హోటళ్ళు, ఇంకా టూర్ ఆపరేటర్ లు సహా పర్యటన రంగం లోని అన్ని వర్గాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం,
డి) మానవ వనరుల అభివృద్ధి లో సహకారానికి ఉద్దేశించినటువంటి ఆదాన ప్రదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం,
ఇ) ఇరు దేశాల లో పర్యటనలను ప్రోత్సహించేందుకు గాను టూర్ ఆపరేటర్ లు/ప్రసార మాధ్యమాలు/ఒపీనియన్ మేకర్ ల ల రాకపోకలకు వీలు కల్పించడం,
ఎఫ్) అభివృద్ధి, మార్కెటింగ్, గమ్యాల వికాసం మరియు గమ్యాల నిర్వహణ రంగాల లో అనుభవాలను ఇచ్చి పుచ్చుకోవడం,
జి) రెండు దేశాలను ఆకర్షణీయమైన పర్యటక గమ్యాలు గా ప్రోత్సహించడం కోసం ఫిల్మ్ టూరిజమ్ మార్గాన్ని అనుసరించడం.
హెచ్) భద్రమైన, గౌరవ పూర్వకమైన, స్థిరమైన పర్యటన లను ప్రోత్సహించడం వంటివి భాగంగా ఉంటాయి.
పూర్వరంగం:
భారతదేశం, బల్గేరియా లు ఇది వరకు 1994వ సంవత్సరం మే నెల 26వ తేదీన పర్యటన రంగం లో ఓ సహకార ఒప్పంద పత్రం పైన సంతకాలు చేశాయి. 2017వ సంవత్సరం లో బల్గేరియా నుండి సుమారు 5288 మంది యాత్రికులు భారతదేశ సందర్శనకు తరలివచ్చారు. భారతదేశానికి ఒక చక్కటి పర్యటక విపణి అయిన బల్గేరియా తో అవగాహన పూర్వక ఒప్పందం పై సంతకాలు చేయడం ఆ దేశం నుండి భారతదేశానికి వచ్చే పర్యటకుల సంఖ్య ను పెంచుకొనే అవకాశం అందిరానుంది.
**