పిఎంఇండియా
ప్రపంచం నలుమూలల నుండి విచ్చేసిన వివిధ ఆటోమోటివ్ కంపెనీలు మరియు రవాణా కంపెనీలకు చెందిన నాయకుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీ లో సమావేశమయ్యారు.
టొయోటా, ఎస్ఎఐసి మోటర్ కార్పొరేశన్ షంఘయి, బాష్, ఎబిబి లిమిటెడ్, హ్యుండయి మోటర్ కంపెనీ, ఫోర్డ్ స్మార్ట్ మొబిలిటీ ఎల్ఎల్సి ఇంకా ఊబర్ ఏవియేశన్ ల వంటి వివిధ కంపెనీలతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధివర్గం ఈ సందర్భంగా ప్రధాన మంత్రి తో భేటీ అయింది.
న్యూ ఢిల్లీ లో జరుగుతున్న ద గ్లోబల్ మొబిలిటీ సమిట్- ‘మూవ్’ లో ఈ కంపెనీలు పాలుపంచుకొంటున్నాయి.
**