పిఎంఇండియా
అంతరిక్షం లో అన్వేషణ మరియు అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం అంశాల పై భారతదేశానికి, దక్షిణ ఆఫ్రికా కు మధ్య కుదిరిన ఒక అవగాహనపూర్వక ఒప్పందం (ఎంఒయు) తాలూకు వివరాలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దృష్టి కి తీసుకు రావడమైంది. ఈ ఎంఒయు పై 2018వ సంవత్సరం జులై 26వ తేదీన జోహాన్స్‌బర్గ్ లో సంతకాలయ్యాయి.
ప్రధాన అంశాలు:
ఈ ఎంఒయు లో భాగంగా ఈ కింద పేర్కొన్నటువంటి రంగాల లో సహకరించుకొంటారు:
1. భూమి యొక్క రిమోట్ సెన్సింగ్;
2. ఉపగ్రహ ఆధారితమైన వార్తా ప్రసారం మరియు ఉపగ్రహ ఆధారిత సముద్రయాన నిర్వహణ;
3. అంతరిక్ష విజ్ఞాన శాస్త్రం, ఇంకా గ్రహాలకు సంబంధించిన అన్వేషణ;
4. అంతరిక్ష నౌక, ప్రయోగ నౌకలు, స్పేస్ సిస్టమ్స్ మరియు గ్రౌండ్ సిస్టమ్స్ యొక్క వినియోగం;
5. జియోస్పేశల్ టూల్స్ మరియు టెక్నిక్ లు సహా, అంతరిక్ష సాంకేతిక విజ్ఞానాన్ని ఆచరణాత్మకంగా వినియోగించుకోవడం; అంతేకాకుండా,
6. ఇరు పక్షాలు నిర్ధారించుకొనే మేరకు ఏవైనా ఇతర రంగాల లో సైతం సహకరించుకోవడం.
ఈ ఎంఒయు లో భాగంగా దిగువన ప్రస్తావించిన రూపాలలో సహకారాన్ని అందించుకొంటారు:
1. పరస్పర ప్రయోజనాలు మరియు లాభాలు ఇమిడి ఉండే సంయుక్త అంతరిక్ష పథకాల యొక్క ప్రణాళిక రచన, ఇంకా అమలు;
2. అంతరిక్ష కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం కోసం భూ తల కేంద్రాల స్థాపన, నిర్వహణ;
3. ఉపగ్రహ సంబంధ సమాచారాన్ని, ప్రయోగాల ఫలితాలను మరియు విజ్ఞాన శాస్త్ర పరమైన సమాచారాన్ని, ఇంకా సాంకేతిక విజ్ఞాన పరమైన సమాచారాన్ని పంచుకోవడం;
4. పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాలను కలసి చేపట్టడం;
5. సహకారపూర్వక కార్యక్రమాల లో పాలుపంచుకోవాలని నామ నిర్దేశం చేసిన సాంకేతిక సిబ్బందిని మరియు విజ్ఞాన శాస్త్ర సంబంధిత సిబ్బందిని ఒక దేశం మరొక దేశానికి పంపించడం/రప్పించుకోవడం
6. సామాజిక ప్రయోజనాల కోసం అంతరిక్ష విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞానం, ఇంకా స్పేస్ అప్లికేశన్ ప్రోగ్రాము లలో సామర్ధ్య నిర్మాణం.
7. చర్చా సభలను, సమావేశాలను మరియు విజ్ఞాన శాస్త్ర సంబంధిత సభలను నిర్వహించడం. దీనికి తోడు,
8. ఉభయ పక్షాల మధ్య పరస్పర సమ్మతి మేరకు సహకారానికి సంబంధించిన అదనపు రూపాలను లిఖిత పూర్వకంగా నిర్ధారించుకోవడం జరుగుతుంది.
ప్రయోజనాలు:
ఈ ఎంఒయు పై సంతకాలతో భూమి యొక్క రిమోట్ సెన్సింగ్, ఉపగ్రహ ఆధారితమైన వార్తా ప్రసారం మరియు ఉపగ్రహ ఆధారితమైన సముద్రయాన నిర్వహణ లు సహా అంతరిక్ష విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం, ఇంకా అప్లికేశన్ లు తదితర సహకారానికి అనువైన రంగాలలో ముందంజ వేయడానికి మార్గం సుగమం కాగలదు.
**