పిఎంఇండియా
పర్వతారోహణ లో అనుభవం గల సుమారు 40 మంది ఔత్సాహికుల బృందం గంగా నది శుద్ధి అంశం పై చైతన్యాన్ని పెంపొందించేందుకు గాను ఒక సాహస యాత్ర చేయాలని సంకల్పించి, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో నేడు భేటీ అయ్యారు. ఎవరెస్ట్ పర్వత శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన 8 మంది పర్వతారోహకులు ఈ బృందం లో ఉన్నారు. ఎవరెస్ట్ శిఖరాగ్రానికి చేరుకొన్న ప్రథమ భారతీయ మహిళ బచేంద్రి పాల్ గారు ఈ బృందానికి నాయకత్వం వహించారు.
కేంద్ర ప్రభుత్వం యొక్క “నమామి గంగే” ప్రచార ఉద్యమం నుండి ప్రేరణ ను పొంది, ఈ సాహస యాత్ర కు “మిశన్ గంగే” అనే పేరు ను పెట్టడమైంది. నెల రోజుల పాటు కొనసాగే ఒక బల్లకట్టు సాహస యాత్ర లో భాగంగా ఈ బృందం గంగా నది లో హరిద్వార్ నుండి పట్నా కు ప్రయాణించనుంది. మార్గ మధ్యం లో వీరు బిజ్నౌర్, నరోడా, ఫరూఖాబాద్, కాన్ పుర్, అలహాబాద్, వారాణసీ, ఇంకా బక్సర్ లలో మజిలీలు చేస్తారు. ఈ తొమ్మిది నగరాల లో ప్రతి ఒక్క నగరం లోను బృందం సభ్యులు గంగా నది ని పరిశుభ్రం గా ఉంచడం తో పాటు స్వచ్ఛత కార్యక్రమాల ను కూడా చేపడతారు.
ఈ బృందం సభ్యుల తో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు గాను వారిని ప్రశంసించారు. ఒక నిర్మలమైన మరియు జీవం తొణికిసలాడే గంగానది యొక్క ప్రాముఖ్యాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. బృందం సభ్యులు ఆయా నగరాల గుండా తమ యాత్ర లో పురోగమించేటప్పుడు వారు చేపట్టే అవగాహన కార్యక్రమాల లో భాగంగా మరీ ముఖ్యంగా బడి పిల్లల చెంతకు చేరుకొని వారి లో తగిన స్ఫూర్తిని నింపవలసిందంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.
****
Had a wonderful interaction with a group of mountaineering enthusiasts who are embarking on an expedition to spread awareness on Ganga cleaning. The group was led by the noted mountaineer and our pride, Ms. Bachendri Pal. https://t.co/Pu4idArdtz pic.twitter.com/jeeGX9ZS1F
— Narendra Modi (@narendramodi) October 4, 2018