Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాని


కొత్త సంవ‌త్స‌రం ప్రారంభం సంద‌ర్భంగా దేశ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ త‌న త‌ర‌ఫు నుంచి శుభాకాంక్ష‌లు వ్య‌క్తం చేశారు. త‌న సందేశంలో ప్ర‌ధాని “ఈ కొత్త ఏడాది 2016 ప్రారంభం అవుతున్న వేళ దేశ ప్ర‌జ‌లు అంద‌రికీ నా వైపు నుంచి శుభ‌కామ‌న‌లు; అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను. ఈ సంవ‌త్స‌రం మ‌న అంద‌రి జీవ‌నంలోనూ సంతోషాన్ని, శాంతిని, స‌మృద్ధిని, మంచి ఆరోగ్యాన్ని ప్ర‌సాదిస్తుంద‌ని నేను ఆశిస్తున్నాన”ని పేర్కొన్నారు.