Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆరోగ్య రంగంలో భారతదేశం, మాల్దీవులకు మధ్య అవగాహనపూర్వక ఒప్పందం


ఆరోగ్య రంగంలో సహకారం కోసం 2014 జనవరిలో భారత్, మాల్ధీవులకు మధ్య కుదిరిన అవగాహనపూర్వక ఒప్పందానికి (ఎమ్ ఓ యూ కు) కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.

ఈ కింద పేర్కొన్న రంగాలు ఎమ్ ఓ యూ పరిధిలోకి వస్తాయి.. :

i. వైద్యులు, అధికారులు, ఆరోగ్య రంగంలోని ఇతర వృత్తి నిపుణుల మార్పిడి, వారికి శిక్షణ ఇవ్వడానికి సంబంధించి.

ii. మానవ వనరుల అభివృధ్దిలో, ఆరోగ్య రంగ సంబంధిత సంస్థల స్థాపనలో సహాయం అందజేసుకోవటం.

iii. వైద్య, ఆరోగ్య రంగ పరిశోధనల కొనసాగింపులో పరస్పర సహకారం.

iv. ఆరోగ్య సంరక్షణ రంగం, ప్రజారోగ్య సేవల నిర్వహణకు సహకారం.

v. జనరిక్, నిత్యావసర ఔషధాల సేకరణకు, డ్రగ్ సప్లై సోర్సింగ్ లో సహకారం.

vi. హెల్త్ ప్రమోషన్, వ్యాధుల నివారణలో సహకారం.

vii. సంప్రదాయ మరియు కాంప్లిమెంటరీ మెడిసిన్స్ విషయంలో సహకారం.

viii. టెలీమెడిసిన్ రంగంలో సహకారం.
ix. ఉభయ పక్షాలు నిర్ణయించిన మేరకు మరే ఇతర రంగంలోనైనా సహకారం.

రెండు దేశాలకు మధ్య, మరీ ముఖ్యంగా మాల్దీవులలో మానవ వనరుల అభివృధ్దిలోనూ, ఆరోగ్య రంగ సంబంధిత సంస్థల స్థాపనలోనూ సహాయం అందజేయటానికి ఈ ఎం ఓ యూ ఇతోధిక సహకారాన్ని అందిస్తుంది. ఆరోగ్య రంగంలో ఇనుమడించిన సహకారం ఇరు దేశాల మధ్య ప్రగాఢ మైత్రికి తోడ్పడనున్నది.