Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భూ విజ్ఞాన శాస్త్రాల్లో శాస్త్ర-సాంకేతిక సహకారంపై భారత్-అమెరికాల మధ్య అవగాహన ఒప్పందానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం


భూ విజ్ఞాన శాస్త్రాల్లో శాస్త్ర-సాంకేతిక సహకారంపై భారత్-అమెరికాల మధ్య 2018 నవంబరు 1న సంతకాలు పూర్తయిన అవగాహన ఒప్పందం గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలికి అధికార యంత్రాంగం వివరించింది.

భూ విజ్ఞాన శాస్త్రాల రంగంలో భారత్-అమెరికాలకు చెందిన సంస్థల మధ్య నైపుణ్య భాగస్వామ్యానికి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన ఆదానప్రదానంలో సహకారానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. పర్యావరణ వ్యవస్థలు, వాతావరణ వైవిధ్యం, భూ వినియోగంవల్ల మార్పులు, ఇంధనం, ఖనిజాలు, పర్యావరణ పరిపుష్టి, ప్రకృతి విపత్తులు, ముప్పు-సహనశీలతలపై అంచనాలు, జలవనరులు, సమాచార సాంకేతికత, గణాంక అనుసంధానం వంటి నిర్దిష్ట రంగాల్లో సహకారం ఈ ఒప్పందంలోని ప్రధానోద్దేశాలు. రెండు దేశాల్లోనూ పైన పేర్కొన్న రంగాల్లో ప్రస్తుతం అమలవుతున్న కార్యక్రమాలకు సంబంధించి సాంకేతిక సమాచార మార్పిడి, సందర్శనలు, శిక్షణ, సహకారాత్మక పరిశోధన వంటి వివిధ అంశాల్లో సహకారం ఈ ఒప్పందంలో భాగంగా ఉంటాయి.

***