Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇండో- జర్మన్ సైన్స్ & టెక్నాలజీ సెంటర్ (ఐ జీ ఎస్ టి సి) కాల పరిమితిని 2017 నుంచి 2022 వరకు పొడిగించడంపై భారతదేశం, జర్మనీ ల సంయుక్త ప్రకటన


ఇండో- జర్మన్ సైన్స్ & టెక్నాలజీ సెంటర్ (ఐ జీ ఎస్ టి సి) కాల పరిమితిని పొడిగించే అంశంపై శాస్త్ర & సాంకేతిక మంత్రిత్వ శాఖ కు, ఫెడరల్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రిసర్చ్ ఆఫ్ జర్మనీ కి మధ్య సంతకాలు జరిగిన ఒక సంయుక్త ప్రకటన ను గురించి కేంద్ర మంత్రిమండలికి నివేదించారు. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఐ జీ ఎస్ టి సి కాలపరిమితిని 2017 అనంతరం 2022 వరకు కూడా పొడిగించడానికి సంబంధించిందే ఈ ప్రకటన. ఉభయ పక్షాలు కేటాయించే నిధులను ఏటా గరిష్ఠంగా 2 మిలియన్ యూరోల నుంచి 4 మిలియన్ యూరోలకు పెంచేందుకు ఈ డిక్లరేషన్ వీలు కల్పిస్తుంది. సమన్వయంతో చేపట్టే పరిశోధన కార్య క్రమాలకు బాసటగా నిలవడానికి ఈ నిధులను సమకూర్చుతారు.

రెండు దేశాలలోనూ సాగించే విద్యా సంబంధిత, పరిశ్రమ సంబంధిత సంయుక్త పరిశోధక ప్రాజెక్టులు నూతన శాస్త్ర విజ్ఞాన పునాదిని ఏర్పరచడానికి, పరిశోధనల ఫలితాలను సాంకేతిక విజ్ఞాన అభివృద్ధికి, అప్లికేషన్ లకు వినియోగించడానికి ఉద్దేశిస్తారు. ప్రయోగశాలలు, విద్యా, పరిశ్రమ రంగాలలో పరిశోధనలను, సాంకేతిక విజ్ఞాన సహకారాన్ని పెంపొందించేందుకు, పటిష్టపరిచేందుకు, మెరుగులు దిద్దేందుకు ఐ జీ ఎస్ టి సి కి ఈ నూతన డిక్లరేషన్ మార్గం సుగమం చేస్తుంది. భారతదేశం, జర్మనీ లలో రిసర్చి లేబొరేటరీలను, పరిశ్రమతో ముడి పెడుతూ (2+2 పథకం కింద) ఎంపిక చేసిన పరిశోధన & అభివృద్ధి (ఆర్ & డి) ప్రాజెక్టులకు ఐ జీ ఎస్ టి సి మద్దతు అందిస్తుంది; నిధులు అందిస్తుంది. అంతే కాకుండా, సమన్వయంతో కూడిన పారిశ్రామిక ఆర్ & డి ప్రాజెక్టులను కొనసాగించడానికి వనరుల సమీకరణలో సహాయపడుతుంది.

పూర్వ రంగం :

2007 అక్టోబరులో రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒక ఒప్పందం మేరకు ఐ జీ ఎస్ టి సి ని నెలకొల్పారు. దీని కార్యకలాపాలు 2011లో ఆరంభం అయ్యాయి. ప్రస్తుతం ఐ జీ ఎస్ టి సి (i) అడ్వాన్స్ డ్ మాన్యుఫాక్చరింగ్, (ii) బయోమెడికల్ డివైసెస్ & హెల్త్ కేర్, (iii) నానోటెక్నాలజీ, (iv) ఆటోమొబైల్ ఇంజినీరింగ్, (v) వాటర్ సెన్సర్లు, (vi) క్లీన్ ఎనర్జీ టెక్నాలజీ, (vii) ఇన్ఫర్మేషన్- కంప్యూటింగ్ టెక్నాలజీ వంటి రంగాలలో సంయుక్త పారిశ్రామిక ఆర్ & డి ప్రాజెక్టులకు సంయుక్త పారిశ్రామిక ఆర్ & డి ప్రాజెక్టులకు అండగా నిలుస్తోంది.

***