Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

తీరప్రాంత క్రమబద్ధీకరణ (సి ఆర్ జడ్) నోటిఫికేషన్ – 2018 ఆమోదించిన కేంద్ర మంత్రివర్గం


 

భూ వైశాల్యం భవన నిర్మాణం నిష్పత్తి (ఎఫ్ ఎస్ ఐ) నియమాల సడలింపు – ప్రస్తుతం అమలులో ఉన్న పద్ధతిలో భవన నిర్మాణాలకు అనుమతి ;
జనసాంద్రత ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాలలో కనీస వసతుల పెంపు ద్వారా పర్యాటక వృద్ధికి దోహదం ; తీరం నుంచి 20 మీటర్ల వరకు భవన నిర్మాణాలకు అనుమతి నిరాకరణ; కాలుష్యం అదుపు చేయడంపై ప్రత్యేక దృష్టి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం తీరప్రాంత క్రమబద్ధీకరణ (సి ఆర్ జడ్) నోటిఫికేషన్ – 2018కు ఆమోదం తెలిపింది. గతంలో 2011లో జారీ చేసిన ఈ నోటిఫికేషన్ లోని కొన్ని నిబంధనలను కాలానుగుణంగా సవరించడం జరిగింది. తీరప్రాంత క్రమబద్ధీకరణ (సి ఆర్ జడ్) నోటిఫికేషన్ – 2011 సమగ్ర సమీక్ష కోరుతూ పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మంత్రిత్వ శాఖకు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు , ఇతరపక్షాల నుంచి అందిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తీరప్రాంత, సముద్ర జీవావరుణ పరిరక్షణ, తీర ప్రాంతాల అభివృద్ధి , ఎకో టూరిజం , జీవనోపాధి అవకాశాల పెంపు, తీరప్రాంత వాసుల నిలకడైన అభివృద్ధికి సంబంధించి అనేక అభ్యర్ధనలు అందిన నేపధ్యంలో పై మార్పు జరిగింది.
ప్రయోజనాలు
ప్రతిపాదిత మార్పుల వల తీరప్రాంత మండలాలలో కార్యకలాపాలు పెరిగి ఆర్ధిక ప్రగతికి దోహదం చేస్తుంది. అంతేకాక తీరప్రాంతాల పరిరక్షణకు తోడ్పడుతుంది. దానివల్ల జీవనోపాధి అవకాశాలు పెరగడమే కాక, ఆ ప్రాంతాలలో మంచి జీవనానికి, దేశ ఆర్ధిక ప్రగతికి తోడ్పడుతుంది. కొత్త నోటిఫికేషన్ తీరప్రాంతవాసుల దుర్భలతను తగ్గించి వారిలో నూతనోత్తేజాన్ని నింపగలదని భావిస్తున్నారు.
ముఖ్యాంశాలు :
ప్రతిపాదిత నోటిఫికేషన్ ద్వారా భూ వైశాల్యం భవన నిర్మాణం నిష్పత్తి (ఎఫ్ ఎస్ ఐ) నియమాల సడలించడం జరుగుతుంది. దానివల్ల నోటిఫికేషన్ జారీ తీదీన అమలులో ఉన్న నిబంధనల ప్రకారం భవన నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఉద్భవిస్తున్న అవసరాలకు అనుగుణంగా పునర్నిర్మాణాలకు అవకాశం ఏర్పడుతుంది.
జనసాంద్రత ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాలలో తీర ప్రాంతం నుంచి నిర్మాణాలు చేపట్ట కూడని దూరం నిబంధనను 200 మీటర్ల నుంచి 50 మీటర్లకు తగ్గిస్తారు.
పర్యాటక అభివృద్ధికి తోడ్పడే తాత్కాలిక నిర్మాణాలు – మరుగు దొడ్లు, స్నానాల గదులు, బట్టలు మార్చుకునే గదులు– మంచి నీటి సౌకర్యాల వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం బీచ్ లలో నిర్మాణాలను అనుమతిస్తారు. అయితే వాటిని కనీసం 10 మీటర్ల దూరంలో నిర్మించాలి.
అయితే అన్ని ద్వీపాలలో నిర్మాణాలకు కనీసం 20 మీటర్ల దూరం ఉండాలనే నిబంధన కొనసాగుతుంది.
పర్యావరణరీత్యా సున్నితమైన ప్రాంతాల పరిరక్షణకు ప్రాముఖ్యం ఇస్తూనే కాలుష్యం అదుపు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది.
రక్షణ, వ్యూహాత్మక ప్రాజెక్టులకు అవసరమైన మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది.
నేపధ్యం
తీరప్రాంతాలలో నిలకడైన అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వానికి అందిన అనేక సూచనలు, సిఫార్సుల నేపధ్యంలో పై నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీనివల్ల తీరప్రాంత సామాజికవర్గాల ఆకాంక్షలు నెరవేరడంతో పాటు పేదలు, దుర్భల వర్గాల సంక్షేమానికి తోడ్పడుతుంది. పర్యాటక రంగం వృద్ధి ద్వారా ఉపాధి, గృహనిర్మాణ అవకాశాలు పెరుగుతాయి.