Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

PM’s interaction through PRAGATI

PM’s interaction through PRAGATI


ఇన్ఫ ర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) ఆధారిత బహుళ నమూనాల వేదిక అయిన ప్రో యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ (PRAGATI.. ప్రగతి) మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ముఖాముఖి సంభాషించారు. ఆయన జరిపిన పదో PRAGATI సమావేశం ఇది.

రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖకు సంబంధించి ప్రజలు వ్యక్తం చేసిన ఫిర్యాదులను, సమస్యలను ప్రధాన మంత్రి ఈ సందర్భంగా సమీక్షించారు. వీటిని పరిష్కరించడానికి త్వరిత గతిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.

వేరు వేరు రాష్ట్రాలలో రహదారులు, రైల్వేలు, బొగ్గు, విద్యుత్తు, పునర్ వినియోగ శక్తి రంగాలకు చెందిన కీలకమైన మౌలిక సదుపాయాల కల్పన పథకాల పురోగతిని ప్రధాన మంత్రి సమీక్షించారు. సమీక్ష జరిగిన ప్రాజెక్టులలో మిజోరాం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, చండీగఢ్ లకు చెందినవి కూడా ఉన్నాయి.

ఉత్తరాఖండ్ లో చార్ ధామ్ రహదారి అనుసంధానం మెరుగుదల పథకాన్ని ప్రధాన మంత్రి సమీక్షిస్తూ, ఈ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

రైల్వే స్టేషన్ల సమగ్ర అభివృద్ధి పథకాల పనులు ఎంతవరకు వచ్చాయో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అడిగి తెలుసుకున్నారు. ప్రతి రాష్ట్రంలో ఈ విధమైన పథకం కనీసం ఒకటైనా చేపట్టాలని ప్రధాన కార్యదర్శులకు సూచించారు.

రూపు రేఖలను కొత్తగా తీర్చి దిద్దిన రైల్వే స్టేషన్లు ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రాలు గానే గాక, ప్రముఖ నిర్మాణాలుగా కూడా పేరు తెచ్చుకుంటాయని ఆయన అన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్ ఐ ఎఫ్ టి)ల క్యాంపస్ ల స్థాయిని మెరుగుపరిచే పథకం, ప్రభుత్వ సంస్థలలో, సి పి ఎస్ యు లలో, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో గ్రిడ్ కు జత చేసిన సౌర విద్యుత్ పథకాల స్థాపన అంశాలను కూడా ప్రధాన మంత్రి సమీక్షించారు. ఆయా రాష్ట్రాలలో సౌర విద్యుత్ పథకాలను శీఘ్ర గతిన అమలు చేయడంపై శ్రద్ధ తీసుకోవాలని ప్రధాన కార్యదర్శులను ఆయన కోరారు.

కాలా అజార్ నిర్మూలన కార్యక్రమాన్ని ప్రధాని సమీక్షించారు. ఈ వ్యాధిని వీలైనంత త్వరగా నిర్మూలించే దిశగా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ”మిషన్ ఇంద్ర ధనుష్” ను కూడా ప్రధాని సమీక్షించారు. ఒక నిర్ధిష్ట కాల వ్యవధి లోపల చిన్న పిల్లలందరికీ టీకాలు వేసే కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు వ్యవస్థాగతమైన కార్యాచరణ ప్రణాళికను చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.