పిఎంఇండియా
ఇన్‌కమ్ టాక్స్ అంబుడ్స్‌మన్ సంస్థ మరియు ఇన్‌డైరెక్ట్ టాక్స్ అంబుడ్స్‌మన్ సంస్థ లను రద్దు ప్రతిపాదన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదించింది.
ప్రజలు ప్రత్యామ్నాయ ఫిర్యాదు పరిష్కార యంత్రాంగాల ను ఎంచుకొంటున్న మరియు అంబుడ్స్‌మన్ సంస్థ ఫిర్యాదు ల పరిష్కారానికి ఇప్పటికే అందుబాటు లో ఉన్న సాధారణ సమాంతర మార్గాల కన్నా ప్రభావవంతమైనంది గా రుజువు చేసుకోలేక పోయిన నేపథ్యం లో ఇన్‌కమ్ టాక్స్ అంబుడ్స్‌మన్ తో పాటు ఇన్‌డైరెక్ట్ టాక్స్ అంబుడ్స్‌మన్ సంస్థ లు రెంటినీ రద్దు చేయడమైంది.
పూర్వరంగం:
ఆదాయపు పన్ను కు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం తాలూకు ప్రజా ఫిర్యాదుల ను పరిశీలించడానికి ఇన్‌కమ్-టాక్స్ అంబుడ్స్‌మన్ సంస్థ ను 2003వ సంవత్సరం లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే, అంబుడ్స్‌మన్ సంస్థ తన లక్ష్యాల ను సాధించడం లో విఫలం అయింది. ఈ సంస్థ కు వస్తున్న కొత్త ఫిర్యాదుల సంఖ్య ఒక అంకెల స్థాయి కి పడిపోయినట్టు గమనించడమైంది. అంతేకాక, పన్ను చెల్లింపుదారులు సిపిజిఆర్ఎఎమ్ఎస్ (సెంట్రలైజ్ డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్ ఎండ్ మోనిటరింగ్ సిస్టమ్), ఆయకర్ సేవా కేంద్రాస్ ల వంటి మరికొన్ని ఫిర్యాదు పరిష్కార సంబంధిత ప్రత్యామ్నాయ పద్ధతుల వైపు మొగ్గు చూపడం మొదలు పెట్టారు. ఇదీ కాక ఇన్‌డైరెక్ట్ టాక్స్ అంబుడ్స్‌మన్ కు చెందిన ఖాళీ గా ఉన్న కార్యాలయాల ను మూసివేయాలని సైతం 2011వ సంవత్సరం లో నిర్ణయించడం జరిగింది.