Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాతీయ విజ్ఞాన దినం సంద‌ర్భంగా శాస్త్రవేత్త‌లు, శాస్త్ర విజ్ఞాన ప్రేమికుల‌కు ప్ర‌ధాన మంత్రి శుభాకాంక్ష‌లు


జాతీయ విజ్ఞాన దినాన్ని పుర‌స్క‌రించుకొని శాస్త్రవేత్త‌లు, శాస్త్ర విజ్ఞాన ప్రేమికుల‌కు ప్ర‌ధాన మంత్రి శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌పంచ శాస్త్ర విజ్ఞాన రంగానికి స‌ర్ సి.వి. రామ‌న్ అందించిన సేవ‌ల‌ను కూడా ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి జ్ఞాప‌కం చేసుకొన్నారు.

“శాస్త్రవేత్త‌లు, శాస్త్ర విజ్ఞాన ప్రేమికుల‌కు ఇవే నా జాతీయ శాస్త్ర విజ్ఞాన దిన శుభ‌కామ‌న‌లు. మ‌న దేశంలో ప‌రిశోధ‌న‌ల స్ఫూర్తి, న‌వ క‌ల్ప‌న‌ (ఇన్నొవేష‌న్)ల స్ఫూర్తి పెంపొందుతూ ఉండాలిగాక.

శాస్త్ర విజ్ఞాన రంగానికి స‌ర్ సి.వి. రామ‌న్ అంద‌జేసిన ఘ‌న‌మైన‌, ఎప్ప‌టికీ నిల‌చి ఉండే సేవ‌ల‌ను మ‌నం ఎంతో గ‌ర్వంగా జ్ఞ‌ప్తికి తెచ్చుకొందాం. యువ

మ‌స్తిష్కాల‌కు ఆయ‌న మ‌హా ప్రేర‌ణామూర్తిగా వెలుగొందుతున్నారు” అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.