పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన మంత్రివర్గ సమావేశం న్యూ ఢిల్లీ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం (ఎన్ డిఐఎసి) స్థాపన కై ఒక ఆర్డినెన్సు ను జారీ చేసేందుకు ఆమోదం తెలిపింది.
మధ్యవర్తిత్వం కోసం ఒక స్వతంత్ర స్వాయత్త వ్యవస్థ ను నిర్మించాలన్నది ఈ కేంద్రం ఏర్పాటు లోని ఉద్దేశ్యం .
ప్రయోజనాలు
సంస్థాగత మధ్యవర్తిత్వ కేంద్రం ఏర్పాటు వల్ల దాని ప్రయోజనాలు ప్రభుత్వాని కి, దాని సంస్థ కు, వివాదం లో ఉన్న పక్షాల కు కలుగుతాయి.
ఇది ప్రజల కు, ప్రజా సంస్థల కు తక్కువ వ్యయం లో నాణ్యమైన సేవలు అందించడం తో పాటు భారతదేశం సంస్థాగత వివాద పరిష్కారం యొక్క ఇరుసు గా ఆవిర్భవించడానికి దోహదకారి అవుతుంది.
ఉద్దేశం
ఎన్ డిఐఎసి ఏర్పాటు లక్ష్యాలు ఇవి..
(ఎ) దేశీయ మరియు అంతర్జాతీయ మధ్యవర్తిత్తం నెరపేందుకు ఒక ప్రధాన సంస్థ గా ఈ సంస్థ ను అభివృద్ధి చేసేందుకు లక్షిత సంస్కరణల ను తీసుకురావడం
(బి) రాజీ కోసం మధ్యవర్తిత్వం మరియు వివాద పరిష్కార కార్యకలాపాల ను నిర్వహించేందుకు అవసరమైన సౌకర్యాలతో పాటు పరిపాలనపరంగా సహాయాన్ని అందించడం
(సి) జాతీయ , అంతర్జాతీయ స్థాయి తలో అధీకృత వివాద పరిష్కర్త లు, రాజీ కుదిర్చే వ్యక్తులు, సంధానకర్త ల పట్టిక ను నిర్వహించడం లేక సర్వేయర్ ల, విచారణ జరిపే వారి యొక్క జాబితా ను రూపొందించడం
(డి) అత్యంత వృత్తి సంబంధ పద్ధతి లో దేశీయ, అంతర్జాతీయ వివాద పరిష్కారాల ను, రాజీల ను జరిపేందుకు మార్గాన్ని సుగమం చేయడం
(ఇ) తక్కువ ఖర్చు లో దేశీయ, అంతర్జాతీయ స్థాయి లలో వివాద పరిష్కారాల ను, రాజీల ను జరిపేందుకు సమయం మించిపోకుండా సేవలు అందించడం
(ఎఫ్) వివాదాల పరిష్కారాని కి ప్రత్యామ్నాయ క్షేత్రం లో అధ్యయనాలు, సంబంధిత అంశాల ను ప్రోత్సహించడం మరియు వివాదాల పరిష్కార వ్యవస్థ లో సంస్కరణల ను ప్రోత్సహించడం; మరియు
(జి) వివాదాల ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని ప్రోత్సహించడానికి ఇతర జాతీయ లేక అంతర్జాతీయ సొసైటీలు, సంస్థ లు, వ్యవస్థల కు సహకరించడం
ఎన్ డిఐఎసి ఏర్పాటు కు కేంద్ర ప్రభుత్వం లో ఐసిఎడిఆర్ పరిధి లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల ను బదిలీ చేసి దాని అధీనం లోకి తేవడానికి ఆర్డినెన్సు వీలు కల్పిస్తుంది. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల ను ఎన్ డిఐఎసి అధీనం చేస్తుంది.
ప్రధాన విశేషాలు
• న్యూ ఢిల్లీ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం (ఎన్ డి ఐఎసి) అధిపతి గా సర్వోన్నత న్యాయస్థానం లేదా ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి లేదా వివాదాల పరిష్కార న్యాయ పరిపాలన లేదా యాజమాన్యాని కి సంబంధించిన ప్రత్యేక పరిజ్ఞానం మరియు అనుభవం ఉన్న ప్రముఖుడి ని నియమిస్తారు. భారత ప్రధాన న్యాయమూర్తి తో కేంద్ర ప్రభుత్వం సంప్రదించి, ఈ నియామకం జరుపుతుంది.
• దేశీయ మరియు అంతర్జాతీయ సంస్థాగత వివాదాల పరిష్కారానికి సంబంధించిన పరిజ్ఞానం మరియు అనుభవం ఉన్న ప్రముఖ వ్యక్తులు ఇద్దరిని పూర్తి కాలం లేక పార్ట్ టైం సభ్యులు గా నియమిస్తారు.
• గుర్తింపు పొందిన వాణిజ్య , పారిశ్రామిక మండలుల ప్రతినిధి ఒకరిని పార్ట్ టైం సభ్యుడిగా వంతులవారీగా నియమిస్తారు.
• న్యాయ వ్యవహారాల శాఖ కార్యదర్శి , ప్రభుత్వ ఖర్చుల శాఖ నామినేట్ చేసిన ఆర్థిక సలహాదారు మరియు ఎన్ డిఐఎసి ప్రధాన కార్యనిర్వాహక అధికారి అధికార రీత్యా సభ్యులు గా ఉంటారు.
పూర్వరంగం
న్యూ ఢిల్లీ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం బిల్లు ను ఇటీవల ముగిసిన రాజ్య సభ సమావేశాల లో పరిశీలనకు చేపట్టడం మరియు ఆమోదించడం జరుగలేదు. ఫిబ్రవరి 13వ తేదీన పార్లమెంట్ నిరవధిక వాయిదా పడింది. రాజ్యాంగ నిబంధన ల ప్రకారం లోక్ సభ ఆమోదం పొంది రాజ్య సభ ఆమోదం కోసం నిరీక్షిస్తున్న బిల్లు ఏదైనా ఒకవేళ లోక్ సభ రద్దయినప్పుడు దానంతట అదే మురిగిపోతుంది. ప్రస్తుత లోక్ సభ పదవీకాలం త్వరలో ముగియనున్నందున ఈ బిల్లు కూడా మురిగిపోయే అవకాశాలు ఎక్కువ.
అందువల్ల సంస్థాగత వివాదాల పరిష్కారాని కి భారతదేశాన్ని కేంద్ర బిందువు చేయవలసిన అత్యావశ్యకత ను దృష్టి లో పెట్టుకొని ‘వ్యాపార నిర్వహణ ను సుగమం’ చేయడాన్ని ప్రోత్సహించడానికి న్యూ ఢిల్లీ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం ఆర్డినెన్సు, 2019ని జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.