పిఎంఇండియా
కంప్ట్రోలర్ & ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం లో ఒక డిప్యూటీ కంప్ట్రోలర్ & ఆడిటర్ జనరల్ (కోఆర్డినేశన్, కమ్యూనికేశన్ అండ్ ఇన్ఫర్మేశన్ సిస్టమ్) పదవి ని పే లెవెల్- 17 తో (ఒక ఎస్టిఎస్ స్థాయి పదవి ని రద్దు చేయడం ద్వారా) ఏర్పాటు చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
రాష్ట్ర ఆడిట్ లు, టెలికమ్యూనికేశన్ యొక్క ఆడిట్ ల సమన్వయాన్ని డిప్యూటీ కంప్ట్రోలర్ & ఆడిటర్ జనరల్ పర్యవేక్షించడం తో పాటు, ఇండియన్ ఆడిట్ & అకౌంట్స్ డిపార్ట్మెంట్ (ఐఎ&ఎడి)లోని వివిధ సమాచార వ్యవస్థ (ఐఎస్)ల కార్యక్రమాల ను కూడా సమన్వయపరచవలసి ఉంటుంది.
ఈ పదవి ని ఏర్పాటు చేయడానికి సుమారు 21 లక్షల రూపాయలు వ్యయమవుతుంది.