Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అడాల‌జ్ లో 2019వ సంవ‌త్స‌రం మార్చి నెల 4వ తేదీ నాడు జ‌రిగిన శిక్ష‌ణ్ భ‌వ‌న్, ఇంకా విద్యార్థి భ‌వ‌న్ ల శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి ఇచ్చిన ఉప‌న్యాసం

అడాల‌జ్ లో 2019వ సంవ‌త్స‌రం మార్చి నెల 4వ తేదీ నాడు జ‌రిగిన శిక్ష‌ణ్ భ‌వ‌న్, ఇంకా  విద్యార్థి భ‌వ‌న్  ల శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి ఇచ్చిన ఉప‌న్యాసం

అడాల‌జ్ లో 2019వ సంవ‌త్స‌రం మార్చి నెల 4వ తేదీ నాడు జ‌రిగిన శిక్ష‌ణ్ భ‌వ‌న్, ఇంకా  విద్యార్థి భ‌వ‌న్  ల శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి ఇచ్చిన ఉప‌న్యాసం

అడాల‌జ్ లో 2019వ సంవ‌త్స‌రం మార్చి నెల 4వ తేదీ నాడు జ‌రిగిన శిక్ష‌ణ్ భ‌వ‌న్, ఇంకా  విద్యార్థి భ‌వ‌న్  ల శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి ఇచ్చిన ఉప‌న్యాసం


భార‌త్ మాతా కీ జ‌య్‌,

భార‌త్ మాతా కీ జ‌య్‌,

భార‌త్ మాతా కీ జ‌య్‌,

ఇక్క‌డ ఈ రోజు న పెద్ద సంఖ్య‌ లో హాజ‌ర‌యిన మాన్య ప్ర‌జ‌లారా,

ఈ మంగ‌ళ‌ప్ర‌ద‌మైనటువంటి సంద‌ర్భం లో మ‌రి మీ యొక్క ఆశీర్వాదాల‌ ను పొందగలిగేలా మీ అంద‌రి మ‌ధ్య కు విచ్చేయాలంటూ ఆహ్వానాన్ని అందుకొన్నందుకుగాను నేను అదృష్టవంతుడిని.

మ‌న సంస్కృతి, ధ‌ర్మం మ‌రియు సంప్ర‌దాయాల లోతుల ను అన్వేషించ‌డం అంటే అది ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జ‌ల కు ఒక క‌ష్ట‌మైన‌టువంటి ప‌నే అవుతుంది. ఎందుకంటే మ‌న‌కు ఒక ధ‌ర్మ గ్రంథ‌మో లేదా ఒక దైవ‌మో, లేదా ఒక అర్చా వ్య‌వస్థో లేదు. మ‌నం వైవిధ్య‌భరితులం; మరి ఈ కార‌ణం గా, మ‌న‌ము ఏమిట‌న్న‌ది పోల్చుకోవ‌డం వారి కి జటిలమైందవుతుంది. ఇదే మ‌న యొక్క ప్ర‌త్యేక‌త‌. మ‌న‌లో వేరు వేరు దేవీ దేవ‌త‌ల‌ ను అర్చించేట‌టువంటి భ‌క్తులు ఉన్నారు. ఒక భ‌క్తుడు మ‌ల్ల‌యోధుడైతే గనక అత‌డు హ‌నుమంతుడి ని ఆరాధిస్తాడు; ఒక భ‌క్తుడు విద్య‌ను కావాల‌ని కోరుకుంటే గ‌నుక అత‌డు స‌ర‌స్వ‌తి దేవి ని పూజిస్తాడు; అదే మ‌రొక భ‌క్తుడు సంప‌ద ను కోరుకున్న పక్షంలో అత‌డి కి పూజించేందుకు లక్ష్మీదేవి ఉండ‌నే వుంది. ఇది మ‌న యొక్క స్వ‌భావం. ఈ స‌మాజం లో, ఆహార ధాన్యాల‌ ను అందిస్తున్నటువంటి స‌ముదాయం క‌ర్ష‌క స‌ముదాయం గా ఉంది. కాఠియావాడ్ లో అయితే లేవువా ప‌టేల్ స‌మాజం అని అంటారు. వారు అన్న‌పూర్ణా దేవి ని ఆరాధిస్తారు.

‘య‌థా భ‌క్తుడు త‌థా భ‌గ‌వంతుడు’ అనేది మ‌న యొక్క ప్ర‌త్యేక ప్ర‌వృత్తి గా నిల‌చింది. ఈ విశేషత్వం లో ఒక భాగం గా నేడు అన్న‌పూర్ణా దేవి యొక్క ఒక తీర్థ యాత్ర స్థలాన్ని అంకితం చేయ‌డమైంది. అయితే, మ‌న దేశం యొక్క ఒక ప్ర‌త్యేక అంశం విష‌యం లో మ‌నం సంతోషించ వ‌చ్చును. మీరు కేవ‌లం గుజ‌రాత్ ను లెక్క లోకి తీసుకొంటే, ఏ దిశలో అయినా 20, 25 లేదా 30 కిలో మీట‌ర్ల మేర ప‌య‌నించండి.. మీకు కూర్చొనేందుకు మరియు భుజించేందుకు ఏర్పాట్లు ఉన్నటువంటి ఒక చోటంటూ దొరుకుతుంది. మీరు ఏ దిశ లోనైనా సరే, 20 లేదా 30 కిలో మీట‌ర్లు వెళ్లినట్లయితే ఏదైనా ఒక ఆల‌యం గాని, లేదా మ‌ఠం గాని, లేదా ఏ సాధువో లేక ఒక ముని కూర్చొనివుండటాన్ని మీరు క‌నుగొనగలుగుతారు. భార‌త‌దేశం లోని ప్ర‌తి ఒక్క మూల‌ న ఇంటికి వచ్చినటువంటి ఒక అతిథి ని ఖాళీ క‌డుపు తో పంపించని సంప్ర‌దాయం అలరారుతోంది. అందుక‌ని వారి బ‌స కు మ‌రియు భోజ‌నాని కి తగ్గ ఏర్పాట్లు తప్పక జ‌రుగుతాయి. ఇది యుగాల తరబడి ఓ ఆచారం వలె వస్తోంది. ‘న‌ర్మ‌ద ప‌రిక్ర‌మ’ను పూర్తి చేసినటువంటి వారు ఈ విష‌యాన్ని ఎరుగుదురు. న‌ర్మ‌ద న‌ది తీరాన ఉన్న ప‌ల్లె లు కూడా ఇటువంటివే. అక్కడి ప్ర‌జ‌లు కూడా ఇదే మాదిరి గా ఉంటారు. ఈ ప్ర‌దేశాని కి వ‌స్తున్న వారు కొత్త‌ వారు. న‌ర్మ‌ద న‌ది తీరాల లో నివసిస్తున్నది ప్ర‌జ‌లు. ‘న‌ర్మ‌ద ప‌రిక్ర‌మ’లో పాలుపంచుకొన్న‌ వారు ఆక‌లి తో ఉండ‌డం అమ‌నేది జ‌రుగ‌దు. ఈ ప‌ల్లె లోని వారే అతిథుల‌ కు లేదా సంద‌ర్శ‌కుల‌ కు వ‌డ్డ‌న చేస్తారు. ఇదీ మ‌న దేశం యొక్క విల‌క్ష‌ణ‌త‌. ఇదీ సంప్ర‌దాయం. మ‌న స‌మాజం ఒక దాన‌శీలమైనటువంటి స‌మాజం. మ‌రి ఈ కార‌ణం గా, సేవ చేసే స్ఫూర్తి అనేది సాంస్కృతిక స్పృహ కు ఒక మూల కార‌ణం గా ఇమిడి పోయింది. ప్ర‌జ‌ల కు సేవ చేయ‌డ‌ం అంటే అది దైవానికి సేవ చేయ‌డం వంటిదే అని ఇక్క‌డ చెబుతారు.

అన్న‌పూర్ణ మాత ధామాన్ని నిర్మించ‌డం, మ‌రి దాని తో పాటు, భావి త‌రాల వారి కి విద్య ను, విలువ‌ల‌ ను బోధించ‌డం కోసం ఒక వ‌స‌తి గృహ స‌దుపాయాన్ని క‌ల్పించ‌డం ఈ కీల‌క‌మైన స్ఫూర్తి ని ప్ర‌తిబింబిస్తున్నాయి. వెనుక‌బ‌డిన కుటుంబాల వారి పిల్ల‌ల కు- వారు మ‌రింత మెరుగైన పురోగ‌తి తాలూకు అవ‌కాశాల ను పొందేట‌ట్లుగా- చ‌క్క‌ని వ‌స‌తి గృహ స‌దుపాయాల‌ ను, ఇత‌ర సౌక‌ర్యాల ను క‌ల్పించాల‌ని నేను కోరుకుంటున్నాను. ఈ కార‌ణం గా మీరంతా విద్య బోధ‌న ను మ‌న సాంస్కృతిక వార‌స‌త్వం లో ఒక భాగం గా మార్చి వేశారు. ఇందుకోసం విరాళాల‌ ను ఇచ్చిన‌టువంటి న‌ర‌హ‌రి భాయ్, ఇంకా ఆయన బృందం సభ్యులందరి కి నేను అభినంద‌న‌ల ను తెలియ‌ జేస్తున్నాను.

మ‌న దేశం లో ప్ర‌తిదీ ప్ర‌భుత్వం నుండే రావాల‌ని ఆశించేట‌టువంటి ఒక రివాజు ఉంది. మ‌రి ఏ ప‌ని అయినా పూర్తి కాలేదు అంటే గనక ప్ర‌శ్న‌లు త‌ల ఎత్తుతాయి. ఆ సవాళ్ల కు స‌మాధానాన్ని చెప్ప‌ాల్సింది కూడా ప్ర‌భుత్వ‌మే. ఇటువంటి వ్య‌వ‌స్థ ఇదివ‌ర‌కెన్న‌డు లేనిది. అటువంటి సంప్ర‌దాయ‌ం అసలు లేనే లేదు. ధ‌ర్మ‌శాలల ను, ఇంకా గోశాల‌ల ను నిర్మించే వారు; త్రాగునీటి స‌దుపాయాల‌ను క‌ల్పించే వారు.. అడాల‌జ్ వావ్ ను లేదా మెట్ల‌ బావి ని కూడా నిర్మించ‌డ‌ం జరిగింది. ఈ ప‌థ‌కాల‌న్నీ ప్ర‌భుత్వం ద్వారా అవ‌లేదు. వీటి ని స‌మాజ‌మే క‌ల్పించింది. స‌మాజ‌మే ధ‌ర్మ‌శాల‌ల ను, త్రాగునీటి సౌక‌ర్యాల‌ ను, ఇంకా గ్రంథాల‌యాల‌ ను అందించింది.

క్ర‌మేపీ స‌మాజం యొక్క శ‌క్తి ని అణ‌గద్రొక్క‌డం జ‌రిగింది. మ‌రి అదేవిధం గా, ప్ర‌భుత్వం యొక్క సత్తా ను అన్నింటి కన్నా పైకి తీసుకు రావడమైంది. స‌మాజం మ‌రింత బ‌ల‌వ‌త్త‌రం గా ఎదుగుతూ పోవాల‌ని, ప్ర‌భుత్వం త‌న ప‌ని ని తాను చేయాల‌ని మేము అభిల‌షిస్తున్నాము. స‌మాజం ఎంతగా బ‌లోపేతం అయితే దేశ ప్ర‌జ‌లు అంత‌ బ‌ల‌వంతులు గా త‌యారు అవుతారు. ప్ర‌భుత్వాల కు శ‌క్తి ని పోగేయవ‌ల‌సిన అవ‌స‌రం ఉండ‌దు. ఆ సిస‌లైన సంప్ర‌దాయం తాలూకు ధోర‌ణుల‌ ను త‌గు విధం గా ప్రోత్స‌హించాల‌ని, వాటిని వ్యాప్తి చేయాల‌ని మేము చూస్తున్నాము. ఇందులో ఎటువంటి వ‌క్రీక‌ర‌ణ‌ కు తావు లేదు. ఇది ప్ర‌భుత్వ ధ‌ర్మం ఏమీ కాదు. ఇది స‌మాజం యొక్క వాస్త‌వ శ‌క్తి. దీని కి అర్థం మౌలిక శ‌క్తి ని ప‌టిష్ట‌ప‌ర‌చే ప్ర‌య‌త్నం. ఇందులో రాజ‌కీయ వివేకం అనేది ఏదీ లేదు. ఇది స‌మాజం యొక్క కీల‌క‌మైన‌టువంటి బ‌లం. స‌మాజం యొక్క కీల‌క‌మైన‌టువంటి బ‌లాన్ని గురించి నొక్కి వ‌క్కాణించే దిశ‌గా ఇది ఒక ప్ర‌య‌త్నం.

ఈ రోజు న అన్న‌పూర్ణ ధామం లో మాత అన్న‌పూర్ణ ప్ర‌తిష్టాప‌న కార్య‌క్ర‌మం సంద‌ర్భం గా మ‌నం స‌మాజాని కి ఒక క్రొత్త దిశ ను ప్రసాదించ‌డం గురించి ఆలోచించేందుకు ఆస్కారం ఉంది. ప్ర‌తి దేవాల‌యం లో ప్రసాదాన్ని పంచిపెట్ట‌డం జ‌రుగుతుంది. అయితే, మ‌నం అన్న‌పూర్ణ ధామం లో ప్ర‌సాదాన్ని పంపిణీ చేసే సంప్ర‌దాయాన్ని ప్ర‌స్తుత కాలాని కి అనుగుణం గా మార్పులు చేయ‌వచ్చును. ఈ స‌మాజం ధ‌ర‌ణి మాత తో సంధాన‌మైంది కాబ‌ట్టి, భ‌క్తులంద‌రి కీ త‌లా ఒక చిన్న మొక్క ను ప్ర‌సాదం గా ఇవ్వ‌వ‌ల‌సింద‌ంటూ యాజ‌మాన్యాన్ని నేను అభ్య‌ర్ధిస్తున్నాను. మ‌రి భ‌క్తులకు వారి ఇళ్ళ లో మొక్క ను పెంచాల‌ంటూ వారి కి సూచించాలి. త‌ద్వారా వారి పెర‌ట్లో లేదా వారి యొక్క పొలాల‌ లో ఒక మూల‌ న మాత అన్న‌పూర్ణ ప్ర‌సాదం జీవిత ప‌ర్యంతం కొలువుదీరుతుంది. వారు మాత అన్న‌పూర్ణ యొక్క ఈ ప్ర‌సాదాన్ని స‌దా ప‌రిర‌క్షిస్తారు.

ఈ విధం గా ప‌ర్యావ‌ర‌ణం సంర‌క్షింప‌ బ‌డుతుందా, లేదా ? ఈ విధం గా మొక్క అనేక పాత్ర‌ల‌ ను పోషించ‌ గ‌లుగుతుంది. ఒక ప్ర‌సాదం గాను, మాన‌వాళి కి అందే ఒక సేవ గాను, మ‌రి అలాగే జీవితాన్ని ఉద్ధ‌రించేది గా కూడాను ఇది ఉంటుంది. మ‌నం మ‌రొక ప‌ని ని కూడా చేయ‌వ‌చ్చు. లేవువా ప‌టేల్ స‌మాజం లో పుత్రిక పుట్టిన‌ప్పుడ‌ల్లా ఆ కుమార్తె ను మాత అన్న‌పూర్ణ ధామాని కి తీసుకు వచ్చి మాత అన్న‌పూర్ణ దీవెన‌ లను స్వీక‌రించాలి. వారికి 5 మొక్క‌ల‌ ను అందించాలి. ఆ మొక్క‌లు క‌ల‌ప ను ఉత్ప‌త్తి చేయాలి. వీలైతే ప్ర‌భుత్వం తో చ‌ర్చించి ఈ ట్ర‌స్టు 100 లేదా 200 ఎక‌రాల బంజ‌రు భూమి ని అడిగి తీసుకోవాలి. 5 క‌ల‌ప మొక్క‌ల‌ ను స‌ద‌రు కుటుంబం ఆ నేల లో పెంచుకోవాలి. క‌ల‌ప‌ ను అమ్మ‌ గా వ‌చ్చిన డ‌బ్బు ను కూతురు కు అంద‌జేయాలి. ఆ ధ‌నం తో అమ్మాయి సంతోషం గా పెళ్ళి చేసుకొంటుంది. ఆ అమ్మాయి త‌ల్లితండ్రులు అప్పు చేయ‌వ‌ల‌సివస్తుందా ? ప్ర‌భుత్వం భూమి ని ఇస్తోంది కాబ‌ట్టి కుటుంబాలు మొక్క‌ల ను పెంచుకో గ‌లుగుతాయి. మీరు త‌గిన ఏర్పాట్ల‌ను చేయండి. మొత్తం నేల అంతా ప‌చ్చ‌ద‌నం పరచుకొంటుంది.

వేల కోట్ల రూపాయ‌ల విలువ చేసే క‌ల‌ప ను ఈ రోజు న మ‌నం విదేశాల నుండి దిగుమ‌తి చేసుకొంటున్నాం. క‌ల‌ప మొక్క‌ల‌ తో పాటు త‌న‌య‌ల‌ ను ఎదగనీయండి. క‌ల‌ప దిగుమ‌తి ని ఆపి వేయ‌డం సాధ్య‌ప‌డుతుంది. మ‌నం ధార్మిక సంప్ర‌దాయాల‌ ను ఒక ఆధునికమైన ప‌ద్ధ‌తి లో ఆర్థిక వ్య‌వ‌స్థ కు ముడిపెట్టిన వారం కాగ‌లుగుతాం. ఈ విధం గా ఈ ప్రాంతం కృషి చేయ‌గ‌ల‌ద‌ని నేను అనుకొంటున్నాను. ప్ర‌తి దాని కి కులం రంగు ను పుల‌మ‌డం ఒక పాపం అని నేను త‌లుస్తాను. ఎవ‌రైనా స‌ర్ దార్ వ‌ల్ల‌భ్ భాయ్ ప‌టేల్ ను కులం రంగు లో చిత్రించాల‌ని ప్ర‌య‌త్నం చేస్తే త‌ప్పు చేసినట్లు అవుతుంది. ఆయ‌న మ‌న దేశాని కి ఒక మహా నాయ‌కుడు. ప్ర‌పంచం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’కేసి త‌ల ఎత్తి చూస్తోంది. ప్ర‌పంచం లో కెల్లా అతి ఎత్త‌యిన విగ్ర‌హాన్ని గురించి ప్ర‌పంచం లోని వారంద‌రూ మాట్లాడుకొన్న‌ప్పుడ‌ల్లా వారు స‌ర్ దార్ ప‌టేల్ ను గురించి ప్ర‌స్తావించ‌వ‌ల‌సి వుంటుంది. మ‌రి నేను అనుకుంటున్నాను.. స‌మీప భ‌విష్య‌త్తు లో ఎవ‌రూ కూడా ఈ రికార్డు ను బ‌ద్ద‌లు కొట్ట‌లేరు అని.

మ‌ఱియొక విష‌యాన్ని నేను చెప్ప‌ద‌ల‌చాను. అమూల్ డెయిరీ ఆవిర్భావం వెనుక ఉన్న‌ది ఎవ‌రు ? దాని ని ఎవ‌రు ఆరంభించారు ? ప్ర‌తి దానికి కులం రంగుల‌ ను అద్ద‌డం ఒక పాపం అని నేను ఇదివ‌ర‌కే చెప్పి వున్నాను. అయితే, లేవువా ప‌టేల్ స‌ముదాయం ఈ విష‌యాల‌న్నింటినీ అర్థం చేసుకొంది. అమూల్ డెయిరీ ని ప్రారంభించ‌డం జ‌రిగింది. మొద‌ట్లో ప్ర‌జ‌లు దీని కి ఆద్యులు గా ఉన్నారు. వారే లేవువా ప‌టేల్ స‌ముదాయం. అమూల్ డెయిరీ కార్య‌సిద్ధి వెనుక లేవువా ప‌టేల్ స‌ముదాయం ఉంటుంద‌ని ఎవ‌రూ కూడాను ఎన్న‌టి కీ ఆలోచించ‌ లేక‌పోయారు. వారికి అనేక అభినంద‌న‌లు. అయితే, నేను మ‌ఱియొక కార‌ణం తో ఈ గాథ ను ప్ర‌స్తావించాను. ఒక స‌ముదాయాని కి చెందిన కేవ‌లం 5 నుండి 15 మంది ఒక దీర్ఘ దృష్టి తో అమూల్ ను నెల‌కొల్పారు. అది ప‌శువుల పెంప‌కం దారుల‌ కు ల‌బ్ధి ని చేకూర్చుతోంది. అంతే కాదు, ప్ర‌తి స‌ముదాయాని కి చెందిన ప్ర‌జ‌లు, అలాగే పల్లెవాసులు మ‌రియు యావ‌త్తు గుజ‌రాత్ ప్ర‌యోజ‌నం పొందింది. ఇదే విధం గా, మాత అన్న‌పూర్ణ తో అనుబంధం క‌లిగిన వారంద‌రూ రైతుల కోసం నేరు గా ప‌ని చేసే బాధ్య‌త‌ ను స్వీక‌రించ‌వ‌చ్చును. విజ్ఞాన శాస్త్ర ఆధారిత‌మైన ఫూడ్ ప్రాసెసింగ్ కోసం ఒక వ్య‌వ‌స్థ ను అభివృద్ధి ప‌ర‌చాల‌ని, అన్న‌పూర్ణ ధామం ద్వారా ప్రేర‌ణ ను పొందాల‌ని నేను ఈ ట్ర‌స్టు యొక్క ప్ర‌తినిధుల‌ ను కోరుతున్నాను. త‌ద్వారా మ‌న రైతులు వారి యొక్క పంట ల‌కు విలువ‌ ను జోడించ‌ గ‌లుగుతారు. ఎలాగైతే సర్ దార్ సాహెబ్ నుండి స్ఫూర్తి ని పొంది అమూల్ ను అభివృద్ధి ప‌ర‌చ‌డం జ‌రిగిందో అదే మాదిరి గా.

శెర్‌థా తాలూకు ప్ర‌ఖ్యాతి గాంచిన మిర‌పకాయ‌లు మ‌రింత ముదురు ఎరుపు రంగు ను క‌లిగి వుంటేనో, అలాగే ఆ మిర‌ప కాయ‌ల‌ ను పొడి రూపం లోకి మార్చివేస్తేనో అవి అధికాదాయాన్ని ఆర్జించి ఇవ్వగ‌ల‌వు. ఆ పొడి ని ఆక‌ర్ష‌ణీయ‌మైన విధంగా ప్యాకింగ్ చేయ గ‌లిగితే అది దాని యొక్క విలువ ను ఇంకొంచెం పెంచ‌గ‌లుగుతుంది. దీని కి విస్తృత‌మైన అవ‌కాశం ఉంది. ఫూడ్ ప్రాసెసింగ్ ద్వారా విలువ‌ ను జోడించ‌డం అనే అంశం లో- రైతులు పండించింది ఏదైన‌ప్ప‌టికీ- ఒక ఫూడ్ ప్రాసెసింగ్ యూనిట్ యొక్క లాభాల‌ ను వారు పొంది తీరాలి. ఈ ప‌ని ఒక పెద్ద ఎత్తున సాగాలి. ప‌రిశోధ‌న కు తావు ఉండాలి. మాత అన్న‌పూర్ణ దీవెన‌ల తో మ‌నం ఇక్క‌డ అటువంటి ప‌రిస్థితి ని ఏర్ప‌ర‌చ గ‌లుగుతాము అని నేను న‌మ్ముతున్నాను.

అందుక‌ని నేను ఆశించేది ఏమిటంటే, పారిశ్రామిక జ‌గ‌త్తు లోని స్నేహితులు ఈ దిశ గా త‌ప్ప‌క ఆలోచిస్తారు అని; ఆధ్యాత్మిక‌త‌ ను మ‌రియు ధ‌ర్మాన్ని ఏ విధం గా స‌మాజం యొక్క అభివృద్ధి కి ఉప‌యోగించాలని నేను భావన చేస్తున్నాను. మ‌రి నా దృష్టి కి తీసుకు వ‌చ్చిన విషయం ఏమిటి అంటే అన్న‌పూర్ణ ధామాన్ని పంచ‌భూతాల ను కేంద్ర స్థానం లో ఉంచి నిర్మించారు అన్న సంగతి ని. రామ‌చ‌రిత్ మాన‌స్ లోని ఒక దోహా లో ఏమని చెప్పారంటే –

छिति जल पावन गगन समीरा।

पंच रचित अति अधम शरीरा।।

అంటే దీనికి మ‌న ఈ యొక్క శరీరం పంచ తత్త్వాల తో ఏర్ప‌డింది అని భావం. ఈ స్ఫూర్తి తోనే అయిదు తత్త్వాల సారాన్ని సమ్మిశ్రితం చేసేందుకు ఇక్కడ ప్ర‌యాస సాగుతోంది. స‌మాజం యొక్క భ‌విత‌వ్యాన్ని దృష్టి లో పెట్టుకొని మ‌నం దీని ని మౌలిక తత్త్వాల తో కాంతిమంతం చేయ‌గ‌ల‌ం అని నేను న‌మ్ముతున్నాను.

న‌ర‌హ‌రి భాయి కి ఎంతో విశ్వాసం ఉంది. అది ఏమిటంటే 2020వ సంవ‌త్స‌రం క‌ల్లా దీని ని ప్రారంభించ‌గ‌లుగుతాము అని. అంతేకాదు, రెండో దాని కి పునాది రాయి ని వేయ‌డం కూడా జ‌రుగుతుంది అని. మరి మీకు న‌మ్మ‌కం ఉంటే ఈ విష‌యం లో ఒక‌టిన్న‌ర రెట్లు అధికమైన విశ్వాసం నాలో ఉంది. ఎవ‌రైనా ఇంటి కి ర‌మ్మ‌ని అడిగితే నిరాక‌రిస్తారా ? నేను ఏమైనా అతిథి నా ? ఇది ఇంటి కి వ‌స్తున్న‌ప్ప‌టి ఆనందం. మాత అన్న‌పూర్ణ చ‌ర‌ణాల వ‌ద్ద త‌న‌ ను తాను స‌మ‌ర్పించుకొని, దేశ ప్ర‌జ‌ల‌ యొక్క ఆహార ధాన్యాల సంబంధిత అవ‌స‌రాల‌ ను నెర‌వేర్చ‌డం క‌న్నా గొప్ప‌ది అయినటువంటి భాగ్యం అంటూ ఏదైనా ఉంటుందా ? ఈ రోజు న నేను బ‌ల‌వంతులైన రైతుల న‌డుమ నిల‌బ‌డి వున్నాను. వారు ధాన్యాన్ని బంగారం గా మార్చ‌గ‌ల శ‌క్తి ని క‌లిగి వున్నటువంటి వారు. ‘జ‌య్ జ‌వాన్, ఇంకా జ‌య్ కిసాన్’ లు రెంటికీ అపార‌మైన విలువ ఉంది. రైతుల యొక్క శ‌క్తి మ‌రియు సైనికుల యొక్క శ‌క్తి దేశాని కి ఆహార భ‌ద్ర‌త తో పాటు స‌రిహ‌ద్దుల లో భ‌ద్ర‌త ను సహితం ప్ర‌సాదిస్తున్నాయి. వారి యొక్క శ‌క్తి తో దేశం ఎల్ల‌ప్పుడూ అభివృద్ధి తాలూకు అవ‌కాశాలను విజ‌య‌వంతం గా అందిపుచ్చుకొంటూ ఉంటుంది. మీ అంద‌రి మ‌ధ్య కు వ‌చ్చేందుకు అవ‌కాశాన్ని నాకు ఇచ్చిన‌ మీ అంద‌రి కీ మ‌రొక్క మారు నేను ధ‌న్య‌వాదాల ను తెలియ‌ జేసుకొంటున్నాను. మాత అన్న‌పూర్ణ పాదాల వ‌ద్ద న‌న్ను నేను అర్పించుకొంటూ, మీ యొక్క ఉజ్వ‌ల భ‌విత కై ప్రార్థ‌ిస్తున్నాను. ఇంత‌టి తో నా ఈ ప్ర‌సంగాన్ని ముగిస్తున్నాను.

మీ అంద‌రికీ ధ‌న్య‌వాదాలు.

**