Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

లోక్ స‌భ స్పీక‌ర్ శ్రీ‌ ఓమ్ బిర్‌లా ఎన్నిక‌ ను స్వాగ‌తించిన ప్ర‌ధాన మంత్రి


శ్రీ‌ ఓమ్ బిర్‌లా 17వ లోక్ స‌భ స్పీక‌ర్ గా స‌భ అత్యున్నత సంప్ర‌దాయాల కు అనుగుణం గా ఏక‌గ్రీవం గా ఎన్నిక కావ‌డాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స్వాగ‌తించారు.

ప్ర‌ధాన మంత్రి ఈ రోజు న లోక్ స‌భ లో చేసిన త‌న ప్ర‌సంగం లో, శ్రీ ఓమ్ బిర్‌లా ను అభినందిస్తూ స‌భ స్పీక‌ర్ గా అటువంటి విశిష్ట వ్య‌క్తిత్వాన్ని కలిగివుండ‌డం స‌భ్యులంద‌రి కి ఒక గ‌ర్వ‌కార‌క‌ క్ష‌ణం అన్నారు.

శ్రీ ఓమ్ బిర్‌లా ఒక విద్యార్థి నాయ‌కుడి గా మొద‌లై ఏళ్ల త‌ర‌బ‌డి ప్ర‌జా జీవ‌నం లో ఉంటూ స‌మాజాని కి నిరంతరం సేవ చేస్తూవస్తున్నారని ఆయన అన్నారు. రాజ‌స్థాన్ లోని కోటా ప్రాంత స‌ర్వ‌తోముఖాభివృద్ధి లో, ప‌రివ‌ర్త‌న లో శ్రీ ఓమ్ బిర్‌లా పోషించిన పాత్ర ను ఆయ‌న ప్ర‌శంసించారు.

క్రొత్త గా ఎన్నికైన స్పీక‌ర్ తో త‌న కు ఉన్నటువంటి దీర్ఘ కాల అనుబంధాన్ని కూడా ప్ర‌ధాన మంత్రి గుర్తు చేసుకున్నారు. భూకంపం అనంతరం క‌చ్ఛ్ లో, వరదల అనంతరం కేదార్ నాథ్ లో జరిగిన పున‌ర్ నిర్మాణ కృషి లో శ్రీ ఓమ్ బిర్‌లా అందించిన తోడ్పాటు ను మ‌రియు స‌మ‌ర్ప‌ణ భావం తో కూడిన సేవ ల‌ను ఆయ‌న ప్రముఖంగా ప్రస్తావించారు. పదిహేడో లోక్ స‌భ త‌న ఒక కరుణామయ నేత ను స్పీక‌ర్ గా పొందింద‌ని కూడా ఆయ‌న చెప్పారు.

స‌భా వ్యవహార క్రమాన్ని విజ‌య‌వంతం గా నడపడం లో స‌భ్యుల నుండి ఆయన పూర్తి స‌హ‌కారాన్ని అందుకొంటార‌ంటూ స్పీక‌ర్ కు ప్ర‌ధాన మంత్రి హామీ ని ఇచ్చారు.

**