Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బిడబ్ల్యుఎఫ్ చాంపియన్ శిప్ లో స్వర్ణ పతకాన్ని గెలుచుకొన్న పి.వి. సింధు కు అభినందనలు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బిడబ్ల్యుఎఫ్ చాంపియన్ శిప్ లో విజేత గా నిలచి బంగారు పతకాన్ని గెలుచుకొన్నందుకు పి.వి. సింధు ను అభినందించారు.

‘‘ప్రతిభాశాలి పి.వి. సింధు ఆశ్చర్యజనకమైన రీతి లో మరొక్క సారి భారతదేశం గర్వించేటట్టు చేశారు. బిడబ్ల్యుఎఫ్ చాంపియన్ శిప్ లో స్వర్ణ పతకాన్ని గెలుచుకొన్న ఆమె కు ఇవే శుభాకాంక్షలు. ఆమె ఎంతటి ఉద్వేగం తోను, సమర్పణ భావం తోను బాడ్ మింటన్ ను ఆడుతారో అనేది ప్రేరణాత్మకమైనటువంటిది. పి.వి. సింధు సాధించిన సాఫల్యం క్రీడాకారుల కు తరాల తరబడి స్ఫూర్తి ని అందించగలుగుతుంది’’ అంటూ ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.