Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

Gandhi@150కి గుర్తు గా సాంస్కృతిక వీడియోల ను ఆవిష్క‌రించిన ప్ర‌ధాన మంత్రి   


గాంధీ మ‌హాత్ముని 150వ జ‌యంతి కి గుర్తు గా నాలుగు సాంస్కృతిక వీడియోల ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని 7, లోక్ క‌ళ్యాణ్ మార్గ్ లో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మం లో ఆవిష్క‌రించారు.

ఈ కార్య‌క్ర‌మాని కి శ్రీయుతులు ఆమిర్ ఖాన్‌, శాహ్ రుఖ్ ఖాన్‌, రాజ్‌కుమార్ హీరానీ, ఆనంద్ ఎల్‌. రాయ్‌, ఎస్‌.పి. బాల‌సుబ్ర‌మ‌ణ్యం, జాకీ శ్రాఫ్, సోనూ నిగ‌మ్‌, శ్రీమతి సోన‌మ్ క‌పూర్‌, ఇంకా కంగ‌నా రానౌత్‌, ఏక్‌తా క‌పూర్‌, తార‌క్ మెహ‌తా గ్రూపు స‌భ్యులు మరియు ఈటీవీ గ్రూపు స‌భ్యులు సహా చలనచిత్ర మరియు వినోద పరిశ్రమ సభ్యులు పలువురు హాజ‌రు అయ్యారు.
   
ఈ సంద‌ర్భం గా ప్ర‌ధాన మంత్రి పరస్పర సంభాషణ ప్రధానమైనటువంటి సమావేశం లో తాను స్వ‌యం గా అభ్య‌ర్ధించిన మీద‌ట గాంధీ మ‌హాత్ముని కి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించ‌డం కోసం ప‌లువురు ప్ర‌ముఖులు వారి యొక్క కార్యక్రమాల తో తీరిక లేకపోయినప్పటికీ కొంత స‌మ‌యాన్ని కేటాయించి త‌ర‌లి వ‌చ్చినందుకు సృజ‌నాత్మక విభాగం తో అనుబంధం కల అగ్రగామి వ్యక్తుల కు మరియు ఆ విభాగాని కి తోడ్పాటు ను అందిస్తున్నటువంటి వారి కి ధ‌న్య‌వాదాలు ప‌లికారు.

చ‌ల‌నచిత్ర ప‌రిశ్ర‌మ‌, ఇంకా వినోద ప‌రిశ్ర‌మ వాటి యొక్క శ‌క్తి ని సాధార‌ణ పౌరుల ను వినోదాన్ని అందించేందుకు మ‌రియు వారి లో ప్రేర‌ణ ను క‌లుగజేసేందుకు మ‌ళ్ళించాల‌ని ప్ర‌ధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.   స‌మాజం లో స‌కారాత్మ‌క‌మైన ప‌రివ‌ర్త‌న ను తీసుకు రావడం లో వారిలో అపార‌మైన శ‌క్తి సామర్థ్యాలు ఉన్న సంగతి ని ఆయ‌న గుర్తు కు తెచ్చారు.

ప్ర‌పంచాన్ని జోడించేట‌టువంటి ఆలోచ‌నే గాంధీ

వర్తమానం లో గాంధీ మ‌హాత్ముని ప్ర‌భావానికి ఉన్న శ‌క్తి ని ప్ర‌ధాన మంత్రి నొక్కి పలుకుతూ, ప్ర‌పంచం అంతటిలోనూ ప్ర‌జ‌ల తో సంధానింపబడేటటువంటి ఒక ఆలోచ‌న గాని లేదా ఒక వ్య‌క్తి గాని ఉందీ అంటే అది గాంధీజీ యే అన్నారు.

తాను ప్ర‌తిపాదించిన ఆయింస్టాయిన్ స‌వాలు ను గురించి ప్ర‌ధాన మంత్రి గుర్తు కు తెస్తూ, గాంధేయ భావ‌న లను ముందు వ‌రుస లో నిలిపేందుకు సాంకేతిక విజ్ఞానం తాలూకు అద్భుతాన్ని ఉపయోగించవ‌ల‌సింది గా చ‌ల‌నచిత్ర రంగ ప్ర‌ముఖుల ను కోరారు.
 
భార‌తీయ వినోద ప‌రిశ్ర‌మ యొక్క శ‌క్తి మ‌రియు ప్ర‌భావం

మామ‌ల్ల‌ాపురం లో చైనా అధ్య‌క్షుని తో తాను జ‌రిపిన సంభాష‌ణ ను ప్ర‌ధాన మంత్రి ఈ కార్య‌క్ర‌మం లో స్మరించారు.  దంగ‌ల్ వంటి భార‌త‌దేశ చ‌ల‌న చిత్రాలు చైనా లో జ‌నాద‌ర‌ణ కు పాత్రం అయ్యాయన్న విష‌యాన్ని చైనా అధ్య‌క్షుడు త‌న‌ తో చెప్పార‌ని ప్ర‌ధాన మంత్రి వెల్ల‌డించారు.  అలాగే, ఆగ్నేయ ఆసియా లో రామాయ‌ణం యొక్క లోక ప్రియ‌త్వాన్ని గురించి కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు.

భార‌త‌దేశం లో ప‌ర్య‌ట‌న ప‌రిశ్ర‌మ ను ప్రోత్స‌హించ‌డం కోసం చ‌ల‌న చిత్ర రంగ ప్ర‌ముఖులు వారి సాఫ్ట్ పవర్ తాలూకు శ‌క్తి ని వినియోగించాల‌ని కూడా ఆయ‌న ప్రోత్సహించారు.

భ‌విష్య‌త్తు యొక్క రూపు రేఖ లు

స్వాతంత్య్రం స‌ముపార్జించుకున్న అనంత‌రం 75వ వార్షికోత్స‌వాన్ని 2022వ సంవ‌త్స‌రం లో భార‌త‌దేశం జ‌రుపుకోనున్నద‌ని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.  ఈ సంద‌ర్భం లో స‌భికులు 1857వ సంవ‌త్స‌రం నుండి 1947వ సంవ‌త్స‌రం మ‌ధ్య జ‌రిగిన భార‌త‌దేశ స్వాతంత్య్ర పోరాటం, అలాగే 1947వ సంవ‌త్స‌రం నుండి 2022వ సంవ‌త్స‌రం మ‌ధ్య భార‌త‌దేశ వృద్ధి గాథ ల యొక్క ప్రేరణాత్మక కథల ను ప్ర‌ద‌ర్శించవలసింది గా స‌భికుల‌ ను అభ్య‌ర్థించారు.  భార‌త‌దేశం లో ఓ వార్షిక అంత‌ర్జాతీయ వినోద శిఖ‌ర స‌మ్మేళ‌నానికి ఆతిథ్యాన్ని ఇచ్చే ప్ర‌ణాళిక ఉందని కూడా ఆయ‌న తెలిపారు.

ప్ర‌ధాన మంత్రి ని ప్ర‌శంసించిన సినీ తార‌ లు

ప్ర‌ధాన మంత్రి తో జ‌రిగిన ముఖాముఖి స‌మావేశం లో న‌టుడు శ్రీ ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ, ప్ర‌పంచానికి గాంధీ మ‌హాత్ముడు ఇచ్చిన సందేశాన్ని ప్ర‌చారం లోకి తీసుకుని రావ‌డం కోసం తోడ్పాటు ను అందించాలని ప్ర‌ధాన మంత్రి సూచించినందుకు ఆయ‌న కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఈ రోజు న విడుద‌ల అయిన వీడియో ‘చేంజ్ విదిన్’ ఇతివృత్తం ఆధారం గా బ‌య‌ట‌కు రాబోతున్న పలు వీడియోల లో ఒక‌టి అని ప్ర‌ముఖ చ‌ల‌న‌చిత్ర ద‌ర్శ‌కుడు శ్రీ రాజ్‌కుమార్ హీరానీ తెలిపారు.  ప్ర‌ధాన మంత్రి నిరంతరం ప్రేరణ ను, దిశానిర్దేశాన్ని మ‌రియు మ‌ద్ధ‌తు ను అందిస్తూ వస్తున్నార‌ని చెప్తూ ధన్యవాదాలు పలికారు.

చ‌ల‌న చిత్ర రంగ ప్ర‌ముఖులు అంద‌రూ క‌ల‌సి వచ్చేటట్టుగా ఒక వేదిక ను ఏర్పాటు చేసేందుకు మరియు వారంతా ఒక ఆశ‌య సాధ‌న దిశ గా కృషి చేసేందుకు గాను ప్ర‌ధాన మంత్రి కి శ్రీ శాహ్ రుఖ్ ఖాన్ ధన్యవాదాలు పలికారు. ఇటువంటి చొరవ గాంధీ మ‌హాత్ముని ప్ర‌భోదాల‌ ను మ‌రొక్క‌ మారు ఆధునిక సందర్భం లో ప‌రిచ‌యం చేయగలుగుతుందని శ్రీ శాహ్ రుఖ్ ఖాన్ అన్నారు.  

జాతి నిర్మాణం లో స‌హ‌క‌రించే శ‌క్తి ని వినోద ప‌రిశ్ర‌మ కు ఉందని చాటినందుకు ప్ర‌ధాన మంత్రి కి ప్ర‌ముఖ చ‌ల‌న‌చిత్ర నిర్మాత శ్రీ ఆనంద్ ఎల్. రాయ్ ధ‌న్య‌వాదాలు ప‌లికారు.

వినోద ప‌రిశ్ర‌మ స‌ర్వ‌తోముఖ అభివృద్ధి కి త‌న ప్ర‌భుత్వం నుండి అన్ని ర‌కాల సహాయం అందిస్తానంటూ ప్ర‌ధాన మంత్రి చ‌ల‌న‌చిత్ర రంగ ప్ర‌ముఖుల కు హామీ ని ఇచ్చారు.

గాంధీ మ‌హాత్ముని 150వ జ‌యంతి ఇతివృత్తం తో ఉన్న వీడియో ల రూపకల్పన మరియు సృజ‌న శ్రీ రాజ్ కుమార్ హీరానీ, ఈటీవీ గ్రూపు, తార‌క్ మెహ‌తా గ్రూపు మ‌రియు భార‌త ప్ర‌భుత్వ సంస్కృతి మంత్రిత్వ శాఖ ల ద్వారా జరిగాయి.