పిఎంఇండియా
ఢిల్లీ లో అనధికార కాలనీల లో నివసిస్తున్న వారి యాజమాన్య /బదిలీ/తనఖా హక్కుల ను గుర్తించేందుకు సంబంధించిన రెగ్యులేషన్ల కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదన ను అమలు చేసేందుకు రానున్నపార్లమెంటు సమావేశాల లో ఒక బిల్లును తీసుకు వచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఢిల్లీ లో అనధికారిక కాలనీల లో నివసిస్తున్న ప్రజల పై ఇది చూపే ప్రధాన ప్రభావం, ప్రయోజనం :
• ఈ నిర్ణయం ఢిల్లీలో 175 చదరపు కిలో మీటర్ల పరిధి లో విస్తరించిన 40 లక్షల నివాసితుల కు ఈ నిర్ణయం ప్రయోజనం చేకూరుస్తుంది. దీనితో ఈ కాలనీల లో అభివృద్ధి/పునర్ అభివృద్ధి కి అవకాశం కలుగుతుంది. దీనితో పరిశుభ్రమైన, భద్రమైన ఆరోగ్యకరమైన నివాస వాతావరణం ఏర్పడుతుంది.
• ఈ చారిత్రాత్మక చొరవ అనధికారిక కాలనీల లో నివసిస్తున్న వారు ఎదుర్కొంటున్న యాజమాన్య హక్కులు, బదిలీ హక్కులు, మౌలిక సదుపాయాల కల్పన, పౌర సదుపాయాల సమస్యల ను పరిష్కరించడాని కి వీలు కలుగుతుంది.
• ఆస్తి పత్రాల కు గుర్తింపు నివ్వడం వల్ల ఈ కాలనీల లోని ప్రజలు చట్టబద్ధమైన రీతి లో ఆస్తి లావాదేవీలు జరుపుకోవడానికి వీలు కలుగుతుంది. దీనితోపాటు ఈ చర్యలు ఆస్తి పై చట్టబద్దమైన హక్కులు కల్పిస్తాయి. ఇది ఆయా ఆస్తుల యజమానులు సురక్షిత నిర్మాణాల పై పెట్టుబడి పెట్టడానికి దోహదపడుతుంది. ఇది ఈ కాలనీల లోని ప్రజల జీవన ప్రమాణాలు గణనీయం గా మెరుగు పరుస్తుంది.
• ఈ నిర్ణయం ప్రభుత్వం గుర్తించిన 1,797 అనధికార కాలనీల కు వర్తిస్తుంది. వీటి లో తక్కువ ఆదాయ వర్గాల వారు నివసిస్తున్నారు. ఈ నిర్ణయం డిడిఎ గుర్తించిన సైనిక్ ఫార్మ్స్, మహేంద్ర ఎన్ క్లేవ్, అనంతరామ్ డైరీ తోపాటు 69 సంపన్న కాలనీలకు వర్తించదు.
• కార్పెట్ విస్తీర్ణం/ ప్లాటు సైజు ఆధారం గా నామమాత్రపు ఫీజు తీసుకుని హక్కులు దఖలు పరుస్తారు. ప్రభుత్వ భూమి లో ఉన్న కాలనీల విషయం లో ఈ చార్జి (వంద చదరపు మీటర్ల లోపు) 0.5 శాతం, వంద నుంచి 250 చదరపు మీటర్ల లోపు విస్తీర్ణానికి 1 శాతం, 250 చదరపు కిలో మీటర్ల కు మించి ఉన్న స్థలాని కి 2.5 శాతం గా ఉంటుంది. దీనిని అనధికార కాలనీ చుట్టుపక్కల ఉన్న నివాస ప్రాంతంలోని అత్యధిక కేటగిరీ సర్కిల్ రేటులో ఆయా శాతాల వారీగా ఈ మొత్తాన్ని వసూలు చేస్తారు.
• ప్రైవేటు భూమి లో ఉ న్న కాలనీల విషయం లో చార్జీలు ప్రభుత్వ భూమి పై వసూలు చేసిన చార్జీల కు సగం ఉంటాయి.
వివరాలు:
• రానున్న పార్లమెంటు సమావేశాల లో కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ లో ప్రభుత్వం గుర్తించిన అనధికార కాలనీల లో నివసించే వారికోసం జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జిపిఎ), విల్, అమ్మకపు ఒప్పందం, కొనుగోలు, ఆస్తి స్వాధీన పత్రాల వంటి వాటిని ఒక సారి మినహాయింపు కింద గుర్తిస్తూ ఒక బిల్లు ను ప్రవేశపెట్టనుంది.
• ఈ బిల్లు, చివరి లావాదేవీ పై రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంపు డ్యూటీ ని విధిస్తుంది. అలాగే సర్కిల్ రేటు చార్జీల కంటే తక్కువ రేటు కారణం గా ఆదాయపన్ను బాధ్యత వంటి అంశాల ను ఈ బిల్లు పరిశీలిస్తుంది.
• ఆస్తి రిజిస్ట్రేషన్ కు కన్వేయన్స్ డీడ్ జారీ చేయడానికి డిడిఎ సులభతర ప్రక్రియను రూపొందించనుంది.
• అనధికార కాలనీలు/ క్లస్టర్ల హద్దుల పటాల ను డిడిఎ రూపొందించనుంది.
• అన్ని అనధికార కాలనీలకు సంబంధించి డిడిఎ లోకల్ ఏరియా ప్లాన్ (ఎల్.ఎ.పి) ని రూపొందించనుంది.
• పెనాల్టీ, బాహ్య అభివృద్ధి చార్జీలు ఉండవు.
• ఒకటి కంటే ఎక్కువ ప్లాట్లు కలిగిన, ఫ్లాట్లు కలిగిన వారి విషయంలో వారికి గల అన్ని ప్లాట్లు, ఫ్లాట్లు కలిపి వాటికి వర్తించే చార్జీలను వసూలు చేస్తారు.
• నివాసితులు తాము చెల్లించాల్సిన చార్జీల ను ఏడాది లోపు మూడు సమాన వాయిదాల లో చెల్లించే వెసులుబాటు కల్పిస్తారు. ఎవరైనా పూర్తి మొత్తాన్ని ఒకే వాయిదా లో పూర్తి మొత్తాన్ని చెల్లించే పక్షం లో అలాంటి వారికి యాజమాన్య హక్కులు వెంటనే లభిస్తాయి. రెండు వాయిదాలు చెల్లించిన వారికి ప్రాథమిక హక్కులు కల్పిస్తారు. పూర్తి, తుది చెల్లింపు చేసిన తర్వాత దానిని శాశ్వత హక్కు గా మారుస్తారు.
• ఆలస్యం గా చెల్లింపు చేసేవారి నుంచి సంవత్సరానికి 8 శాతం వంతున సాధారణ వడ్డీ విధిస్తారు.
• నివాస అవసరాల నిమిత్తం కన్వేయన్స్ దాని అవసరంతో సంబంధం లేకుండా అమలు చేస్తారు.
నేపథ్యం :
• 2008 నాటి నుంచి అమలులో ఉన్న ప్రస్తుత నిబంధనల ప్రకారం, రెగ్యులరైజేషన్ ప్రక్రియ మొత్తాన్ని గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ కాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ ( జిఎన్సిటిడి)వారు విస్తృత ప్రచారం ఇచ్చి దానిని సమన్వయం, పర్యవేక్షణ చేయవలసి ఉంది.
• అనధికార కాలనీల సరిహద్దు నిర్ధారణ అనది ఈ రెగ్యులేషన్ ప్రక్రియకు ప్రారంభ ప్రక్రియ. అయితే జిఎన్సిటిడి , రెగ్యులేషన్లు జారీ చేసిన 11 సంవత్సరాల తర్వాత కూడా ఈ కాలనీల సరిహద్దులను నిర్ణయించలేదు . ఇది ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి 2021 వరకు సమయం కోరింది.
• ఈ అనధికార కాలనీలు లే ఔట్ ప్లాన్ అనుమతి లేకుండా ఏర్పడినవి కావడంతో ఈ అనధికార కాలనీలలో నివసిస్తున్న ప్రజలు ఈ నిర్మాణాలపై పెట్టుబడి పెట్టలేక పోతూ వచ్చారు. అలాగే ప్రభుత్వం ఇక్కడ ఎలాంటి సామాజిక మౌలిక సదుపాయాలను కల్పించలేక పోతున్నది. తగిన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు ఈ కాలనీలలో నివాసం ఉండలేని పరిస్థితుల మధ్య ఉంటూ వస్తున్నారు. మాస్టర్ ప్లాన్ ఢిల్లీ 2021 నాటికి 50 శాతం అదనపు ఫ్లోర్ ఏరియా (ఎఫ్.ఎ.ఆర్) ప్రోత్సాహకంగా కాలనీల పునర్ అభివృద్ధికి వీలు కలిపిస్తున్నది. అయితే ఈ అనధికార కాలనీలలోని వారికి యాజమాన్య హక్కులు లేకపోవడంతో పునర్ అభివృద్ధి జరగలేదు.
• అనధికార కాలనీలలో నివాసం ఉంటున్న వారి యాజమాన్య, తనఖా, ఆస్తి బదిలీ హక్కుల గుర్తింపునకు సంబంధించి కేంద్ర కేబినెట్ అనుమతితో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ ఆస్తి హక్కుల గుర్తింపు, తనఖా , బదిలీ హక్కుల గుర్తింపు, ప్రణాళికా బద్ధంగా ఈ ప్రాంతాల పునర్ అభివృద్ధికి తగిన సూచనలు చేసేందుకు నియమింపబడింది.
• ఈ కమిటీ సిఫార్సుల ప్రకారం సంబంధిత వర్గాల వారితో పై న పేర్కొన్న ప్రతిపాదనలకు సంబంధించి సవరించిన రెగ్యులేషన్ నోటిఫై చేయడానికి, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడానికి విస్తృత సంప్రదింపులు నిర్వహించి ఖరారు చేయడం జరిగింది.
***