పిఎంఇండియా
పోస్ట్ స్ & టెలిగ్రాఫ్ బిల్డింగ్ వర్క్స్ సర్వీస్ (పి & టి బిడబ్ల్యుఎస్), గ్రూప్ ఎ కాడర్ యొక్క సమీక్ష కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలిపింది.
ఇందుకు సంబంధించి డ్యూటీ పోస్టుల ను 105గా నిర్థారించారు. దూర సంచార విభాగం (డిఒటి) మరియు తపాలా విభాగాని కి (డిఒటి) సంబంధించి అటు క్షేత్ర స్థాయి విభాగాల లో, ఇటు కేంద్ర కార్యాలయం లో పని అవసరాల కు అనుగుణం గా కాడర్ వ్యవస్థ ను బలోపేతం చేయడానికి ఈ ఆమోదం ఉపకరిస్తుంది. పి & టి- బిడబ్ల్యుఎస్ శ్రేణి అధికారుల పదోన్నతి లో ఎటువంటి పురోగతి లేని స్థితి ని ఇది తగ్గించగలుగుతుంది. అలాగే ఈ కాడర్ లో తాజా గా ఎటువంటి నియామకాలూ చేయరాదని కూడా నిర్ణయించారు. దశలవారీ పద్ధతి లో ఈ కాడర్ అనేది ఇక లేకుండా చేస్తారు; అయితే ప్రస్తుతం ఇందులో పని చేస్తున్న వారి పైన ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా దీని ని చేపడుతారు.
పూర్వరంగం:
పోస్ట్ స్ & టెలిగ్రాఫ్ బిల్డింగ్ వర్క్స్ సర్వీస్ ( పి & టి బిడబ్ల్యుఎస్) గ్రూపు ఎ ని 1990వ సంవత్సరం లో ఒక వ్యవస్థీకృత గ్రూప్ -ఎ సర్వీసు గా ఏర్పాటు చేశారు. ఇందులో మూడు విభాగాలు.. సివిల్, ఇలెక్ట్రికల్, ఆర్కిటెక్చర్ విభాగాలు.. ఉన్నాయి. ఇవి దూర సంచార విభాగం (డిఒటి), పోస్టల్ విభాగాల (డిఒటి) అవసరాల ను తీరుస్తాయి. వీరి ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ నిర్వహించే కంబైన్డ్ ఇంజినీరింగ్ సర్వీసు పరీక్ష ద్వారా ఎంపిక చేశారు. పి & టి బిడబ్ల్యుఎస్ అధికారులు డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేశన్స్, డిపార్ట్ మెంట్ ఆఫ్ పోస్ట్ స్ లో యాజమాన్యం, పాలన స్థానాల లో పని చేస్తున్నారు. అలాగే మరికొందరు ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖ లు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ లు, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల లో డెప్యుటేశన్ పై పని చేస్తున్నారు. 1990వ సంవత్సరం లో ఈ సర్వీసు ను ఏర్పాటు చేసినప్పటి నుండి ఇప్పటివరకు ఈ సర్వీసు కు సంబంధించిన కాడర్ సమీక్ష ను నిర్వహించలేదు. ఇది జరుగవలసి ఉండింది.
బిఎస్ ఎన్ ఎల్ ఏర్పాటు తో ఈ సర్వీసు కాడర్ బలం, విధుల పై ప్రభావం పడింది. పలువురు అధికారుల ను బిఎస్ఎన్ ఎల్ లోకి తీసుకున్నారు. టెలికం కార్యకలాపాలు, సర్వీసులు, డిఒటి విధుల ను బిఎస్ఎన్ ఎల్ కు బదిలీ చేయడం తో టెలికం విభాగం, పోస్టల్ విభాగం ఆస్తుల ను నిర్వహించాల్సిన బాధ్యత, కొత్త ప్రాజెక్టు ల నిర్వహణ, సెంట్రల్ ఇలెక్ట్రిసిటి
అథారిటీ రెగ్యులేశన్, 2010 ప్రకారం ఇలెక్ట్రో మెకానికల్ వ్యవస్థ ల తనిఖీ, మార్గదర్శకాల రూపకల్పన, టెలికం వ్యవస్థల కు సంబంధించి ప్రమాణాలు, నిర్దేశాలు, హరిత కార్యక్రమాల చొరవ, ఇ.ఎం.ఎఫ్ రేడియేశన్ పర్యవేక్షణ వంటి వాటి కి సంబంధించి టెలికం రంగం లోని ప్రభుత్వ , ప్రైవేటు సంస్ద ల బాధ్యత పి & టి బిడబ్ల్యుఎస్ పై పడింది. అలాగే డిపార్ట్ మెంట్ ఆఫ్‌టెలికమ్యూనికేశన్స్, డిపార్ట్ మెంట్ ఆప్ పోస్ట్ స్ కు మౌలిక సదుపాయాల నిర్మాణం బాధ్యత కూడా దీని దే.
ఈ పరిస్థితులు, ఈ సర్వీసుల లోని వివిధ గ్రేడ్ లలో ఎటువంటి మార్పు లేకపోవడం వంటి వాటి వల్ల పి & టి బిడబ్ల్యుఎస్ వ్యవస్థ ను సమీక్షించవలసిన అవసరం ఏర్పడింది. ఇందుకు అనుగుణం గా పి & టి బిడబ్ల్యుఎస్ అధికారుల కాడర్ వ్యవస్థ ను ఆమోదించారు. డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేశన్స్, డిపార్ట్ మెంట్ ఆఫ్ పోస్ట్ స్ లకు సంబంధించి తగిన బాధ్యత ల నిర్వహణ కు, అవసరమైన విధుల నిర్వహణ కు ఇది అవసరం గా భావించారు. దీని కాడర్ బలాన్ని ప్రస్తుతం పనిచేస్తున్న కాడర్ సంఖ్య కు పరిమితం చేశారు. కాడర్ సమీక్ష వల్ల ప్రభుత్వాని కి ఎటువంటి అదనపు ఆర్థిక భారం పడదు.