Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యూరోపియ‌న్ క‌మిశ‌న్ ప్రెసిడెంటు ఉర్సులా వాన్ డర్ లేయన్ తో టెలిఫోన్ లో సంభాషించిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ యూరోపియ‌న్ క‌మిశ‌న్ ప్రెసిడెంటు ఉర్సులా వాన్ డర్ లేయన్ తో టెలిఫోన్ ద్వారా ఈ రోజు న సంభాషించారు.

యూరోపియ‌న్ క‌మిశ‌న్ ప్రెసిడెంట్ గా ప‌ద‌వీ బాధ్య‌త‌ల ను స్వీక‌రించినందుకు ఉర్సులా వాన్ డర్ లేయన్ కు ప్ర‌ధాన మంత్రి అభినందిస్తూ, ఆమె ప‌ద‌వీ కాలం లో చాలా త్వరితం గా తాము సంప్ర‌దింపులు జరుపుకో గ‌లిగినందుకు హర్షాన్ని వ్య‌క్తం చేశారు. క‌మిశ‌న్ కు ఆమె ఒక‌టో మ‌హిళా ప్రెసిడెంట్ అయినందువల్ల ఆమె నాయ‌క‌త్వం ఒక ప్ర‌త్యేక ప్రాముఖ్యాన్ని సంతరించుకొంద‌ని కూడా ప్ర‌ధాన మంత్రి అన్నారు.

భార‌త‌దేశం- యూరోపియన్ యూనియన్ (ఇయు) భాగ‌స్వామ్యం ప్ర‌జాస్వామ్యం, చ‌ట్టాల ప‌ట్ల గౌర‌వం, బ‌హుముఖీన‌త్వం, నియ‌మాల పై ఆధార‌ప‌డిన‌టువంటి వ్యాపారం మ‌రియు నియ‌మాల పై ఆధార‌ప‌డినటువంటి అంత‌ర్జాతీయ క్ర‌మం ల వంటి ఉమ్మ‌డి విలువ‌ ల ప్రాతిప‌దిక‌ న సాగుతున్నదంటూ ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు. ఉర్సులా వాన్ డర్ లేయన్ త‌న ప్రాధాన్య రంగాల లో జ‌ల వాయు ప‌రివ‌ర్త‌న‌, సంధానం, అక్ష‌య శ‌క్తి, స‌ముద్ర సంబంధ భ‌ద్ర‌త‌, ఉగ్ర‌వాదాన్ని మ‌రియు స‌మూల సంస్క‌ర‌ణ వాదాన్ని ప‌రిష్క‌రించ‌డం వంటి అంశాల ను నిర్ధరించుకొన్నందుకు కూడా ఆయ‌న ఆవిడ ను ప్ర‌శంసించారు. భార‌త‌దేశం-ఇయు భాగ‌స్వామ్యాన్ని ప‌టిష్ట ప‌ర‌చ‌డం కోసం క‌ల‌సి కృషి చేయడం పట్ల ప్రధాన మంత్రి త‌న కుతూహలాన్ని వ్య‌క్తం చేశారు.

తదుప‌రి ఇండియా-ఇయు స‌మిట్ లో పాలు పంచుకొనేందుకు ప్ర‌ధాన మంత్రి ని ఉర్సులా వాన్ డర్ లేయన్ బ్ర‌సెల్స్ కు రావలసింది గా ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ కృత‌జ్ఞ‌త పూర్వ‌కం గా స్వీక‌రించారు.

**