Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దాద్రా & నాగర్ హవేలీ మరియు దమన్ & డయ్యు విలీనం దృష్ట్యా వస్తువులు మరియు సేవల పన్ను, విలువ ఆధారిత పన్ను మరియు ఎక్సయిజు సుంకాలకు సంబంధించిన చట్టాల సవరణలు/పొడిగింపు/రద్దుకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దిగువ పేర్కొన్న వస్తువులు మరియు సేవల పన్ను, విలువ ఆధారిత పన్ను మరియు రాష్ట్ర ఎక్సయిజుకు సంబంధించిన చట్టాలు మరియు నియంత్రణల సవరణలు/పొడిగింపు/రద్దు మరియు దామన్ ను ప్రధాన కార్యాలయంగా నిర్ణయిస్తూ ఆమోదం తెలిపింది.

i. కేంద్ర వస్తువులు మరియు సేవల పన్ను చట్టం, 2017 (12 ఆఫ్ 2017)ను కేంద్ర వస్తువులు మరియు సేవల పన్ను (సవరణల) నియంత్రణ, 2020గా సవరించడం జరుగుతుంది ;

ii. కేంద్రపాలిత ప్రాంతం వస్తువులు మరియు సేవల పన్ను చట్టం, 2017 (14 ఆఫ్ 2017)ను కేంద్రపాలిత ప్రాంతం వస్తువులు మరియు సేవల పన్ను చట్టం (సవరణల) నియంత్రణ, 2020గా సవరించడం జరుగుతుంది;

iii. దాద్రా & నాగర్ హవేలీ విలువ ఆధారిత పన్ను నియంత్రణ, 2005 (2 ఆఫ్ 2005)ను దాద్రా & నాగర్ హవేలీ మరియు దమన్ & డయ్యు విలువ ఆధారిత పన్ను (సవరణల) నియంత్రణ, 2020గా సవరించడం జరుగుతుంది;

iv. దామన్ & డయ్యు విలువ ఆధారిత పన్ను నియంత్రణ, 2005 (1 ఆఫ్ 2005)ను దామన్ & డయ్యు విలువ ఆధారిత పన్ను (రద్దు) నియంత్రణ, 2020గా రద్దుచేయడం జరుగుతుంది;

v. గోవా, దామన్ మరియు డయ్యు ఎక్సయిజు సుంకం చట్టం, 1964 (5 ఆఫ్ 1964)ను దాద్రా & నాగర్ హవేలీ మరియు దామన్ & డయ్యు ఎక్సయిజు సుంకం (సవరణ) నియంత్రణ, 2020గా సవరించడం జరుగుతుంది;

vi. దాద్రా & నాగర్ హవేలీ ఎక్సయిజు సుంకం నియంత్రణ,2012 (1 ఆఫ్ 2012)ను దాద్రా & నాగర్ హవేలీ ఎక్సయిజు సుంకం (రద్దు) నియంత్రణ,2020గా రద్దుచేయడం జరుగుతుంది;

vii. కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా & నాగర్ హవేలీ మరియు దామన్ & డయ్యు ప్రధాన కార్యాలయ హోదాను ఇకపైన దామన్ కు కల్పిస్తూ నిర్ణయించడం జరిగింది.

ఈ సవరణలు ఉమ్మడి పన్ను అధికారుల నియామకం ద్వారా “కనిష్ఠప్రభుత్వం, గరిష్ఠపాలన”కు దారితీస్తాయి; చేసిన పనినే మళ్ళీ చేయకుండా పౌరులకు ఉత్తమ సేవలు లభించడంతో పాటు పరిపాలనా సామర్ధ్యం పెరుగుతుంది, జిఎస్టీ, వ్యాట్ మరియు రాష్ట్ర ఎక్సయిజుకు సంబంధించిన చట్టాలలో ఏకరూపత వస్తుంది మరియు జిఎస్టీ పన్ను, వ్యాట్ మరియు రాష్ట్ర ఎక్సయిజు బకాయిలు రాబట్టడంతో సహా పన్నుల విధింపు మరియు వసూలులో న్యాయసంబంధ చిక్కులు లేకుండా చూసుకోవచ్చు. అంతేకాక ఈ సవరణల వల్ల పన్నుల చట్టాలలో ఏకరూపత రావడమే కాక చట్టాల వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

రెండు కేంద్రపాలిత ప్రాంతాల ప్రజలకు “కనిష్ఠప్రభుత్వం, గరిష్ఠపాలన” అనే దార్శనికతను నెరవేర్చుకోవడానికి, అంతేకాక ప్రభుత్వ సొమ్మును ఆదా చేసి పన్నుల అధికారుల రోజువారీ పనిలో ఏకరూపత, స్థిరత్వం, సంగతత్వం నిశ్చయపరుచుకోవడానికి కేంద్రపాలిత ప్రాంతం దాద్రా & నాగర్ హవేలీ మరియు దామన్ & డయ్యు పాలనా యంత్రాంగం ఒక పెద్ద అడుగు వేసింది. వస్తువులు మరియు సేవల పన్ను (జిఎస్ టి) , విలువ ఆధారిత పన్ను (వ్యాట్) మరియు ఎక్సయిజుకు సంబంధించిన చట్టాలు మరియు నియంత్రణలకు సవరణలు/పొడిగింపు/రద్దు మరియు నియమిత తేదీ 26.01.2020న రెండు కేంద్రపాలిత ప్రాంతాలు దాద్రా & నాగర్ హవేలీ మరియు దామన్ & డయ్యు విలీనం దృష్ట్యా కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా & నాగర్ హవేలీ మరియు దామన్ & డయ్యు ప్రధాన కార్యాలయ హోదాను దామన్ కు కల్పించడం ద్వారా ఇది సాధ్యమైంది.

***