పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న నిర్వహించిన తన ‘మన్ కీ బాత్’ (‘మనసులో మాట’) కార్యక్రమం లో భాగం గా – ‘ఖేలో ఇండియా గేమ్స్’ లో పాలుపంచుకొన్న వారితో పాటు ‘ఖేలో ఇండియా గేమ్స్’ను విజయవంతం గా ముగించినందుకు గాను అసమ్ ప్రజల ను మరియు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు
వివిధ రాష్ట్రాల కు చెందిన సుమారు 6 వేల మంది ‘ఖేలో ఇండియా గేమ్స్’ లో పాలుపంచుకొన్నారని ప్రధాన మంత్రి తెలిపారు. 80 రికార్డు లు బద్దలు అయ్యాయని, మరి ఈ 80 రికార్డుల లోను 56 రికార్డు లను ఛేదించింది మన పుత్రికలే అని ఆయన అన్నారు. ‘ఖేలో ఇండియా గేమ్స్’ను 2018వ సంవత్సరం లో ప్రారంభించినప్పుడు 3500 మంది పాల్గొన్నారు; అయితే, మూడు సంవత్సరాల కాలం లో అందులో పాల్గొనే క్రీడాకారులు మరియు క్రీడాకారిణుల సంఖ్య 6,000కు పైగా పెరిగింది. అంటే ఇది దాదాపు రెండింత లు అయిందని ఆయన వివరించారు.
ప్రధాన మంత్రి ఈ నాటి ‘మన్ కీ బాత్’ (‘మనసులో మాట’) కార్యక్రమం లో చిన్నారుల మరియు వారి తల్లితండ్రుల ప్రేరణాత్మక గాథల ను గురించి వెల్లడించారు. వాటి లో ఒకటి తమిళ నాడు కు చెందిన యోగానందన్ కు చెందిన గాథ. ‘‘యోగానందన్ తమిళ నాడు లో బీడీ లు తయారు చేసే వారు. అయితే, ఆయన కుమార్తె పూర్ణశ్రీ వెయిట్ లిఫ్టింగ్ లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకొని ప్రతి ఒక్కరి హృదయాల ను గెలుచుకొంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
గువాహాటీ లో జరిగిన యూత్ గేమ్స్ లో సైక్లింగ్ లో 200 మీటర్ల స్ప్రింట్ ఈవెంట్ లో పాల్గొని స్వర్ణ పతకాన్ని గెలుచుకొన్న డేవిడ్ ను గురించి కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. కార్- నికోబార్ నుండి వచ్చిన డేవిడ్ తన తల్లితండ్రుల ను బాల్యం లోనే కోల్పోయాడు. డేవిడ్ ఒక ఫుట్ బాల్ క్రీడారుడు కావాలి అని డేవిడ్ మామయ్య కోరుకున్నారు. ఈ కారణం తోనే ప్రఖ్యాత ఫుట్ బాల్ క్రీడారుడు శ్రీ డేవిడ్ బెక్‌హామ్ పేరు ను అతడి కి పెట్టారు. కానీ, డేవిడ్ కు సైక్లింగ్ అంటే ఎంతో మక్కువ. డేవిడ్ ‘ఖేలో ఇండియా’ పథకం లో భాగం గా ఎంపిక అయ్యాడు. మరి ఈ రోజు న అతడు సైక్లింగ్ లో ఒక కొత్త రికార్డు ను సృష్టించాడు అని ప్రధాన మంత్రి వివరించారు.
ముంబయి కి చెందిన కరీనా శాంక్తా యొక్క స్ఫూర్తి భరిత గాథ ను కూడా ఆయన శ్రోతల కు తెలియ జేశారు. కరీనా ఈత పోటీ లో 100 మీటర్ బ్రెస్ట్- స్ట్రోక్ ఈవెంట్ ను పూర్తి చేసి, 17 సంవత్సరాల లోపు వయస్సు కేటగిరీ లో స్వర్ణ పతకాన్ని గెలుచుకోవడమే కాకుండా జాతీయ స్థాయి లో ఒక నూతనమైన రికార్డు ను కూడా నెలకొల్పారు. ఏమైనప్పటి కి, కరీనా పదో తరగతి విద్యార్థిని గా ఉన్న కాలం లో మోకాలి కి అయిన గాయం కారణం గా తన శిక్షణ కు దూరం కావలసి వచ్చింది. అయినా సరే, కరీనా మరియు ఆమె తల్లి ధైర్యాన్ని వీడలేదు. మరి ఈ రోజు న వారి యొక్క నైతిక ధైర్యం ఫలితం మన అందరి ఎదుట ఉంది అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
‘‘జాతీయ క్రీడ లు అనేవి ఆటగాళ్ళ కు వారి యొక్క ఉద్వేగాన్ని ప్రదర్శించేందుకు ఒక అవకాశాన్ని ప్రసాదించే మైదానం అనే సంగతి మనకు అందరికీ తెలిసిందే. దీనికి తోడు, ఇతర రాష్ట్రాల యొక్క సంస్కృతి తోనూ మనం పరిచయాన్ని పొందవచ్చును. అందువల్ల మేము ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ తరహా లో ‘ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్’ను ప్రతి సంవత్సరం నిర్వహించాలని నిర్ణయించాము’’ అని ప్రధాన మంత్రి వెల్లడించారు.
‘ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్’ యొక్క ఒకటో సంచిక ను వచ్చే నెల ఫిబ్రవరి లో 22వ తేదీ మొదలుకొని మార్చి నెల ఒకటో తేదీ మధ్య కాలం లో ఒడిశా లోని భువనేశ్వర్ లోను, కటక్ లోను నిర్వహించనున్నారు. ఈ క్రీడల లో పాలుపంచుకోవడం కోసం 3,000 మంది కి పైగా క్రీడాకారులు, క్రీడాకారిణులు అర్హత ను సంపాదించారు.
ఫిట్ ఇండియా
‘ఫిట్ ఇండియా స్కూల్’ ప్రచార ఉద్యమం సకారాత్మకమైన ఫలితాల ను ఆవిష్కరించినట్లు ప్రధాన మంత్రి ప్రశంసించారు. ఆన్ లైన్ లో నమోదు చేసుకోవడం ద్వారా 65,000కు పైగా పాఠశాల లు ‘ఫిట్ ఇండియా స్కూల్’ ధ్రువపత్రాల ను దక్కించుకొన్నాయని ఆయన తెలిపారు. దేశం లోని మిగిలిన పాఠశాల లు విద్య తో పాటు, క్రీడల ను మరియు శారీరక కార్యకలాపాల ను ఏకీకృతం చేయాలని, అంతేకాకుండా అవి కూడా ఒక ‘ఫిట్ స్కూల్’గా మారేటట్లు శ్రద్ధ తీసుకోవాలి అని ప్రధాన మంత్రి కోరారు.