Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

చ‌రిత్రాత్మ‌క బోడో ఒడంబ‌డిక ను ప్రశంసించిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న సంత‌కాలైన చ‌రిత్రాత్మ‌క బోడో ఒప్పందాన్ని ప్ర‌శంసించారు. ఈ ఒప్పందం బోడో ప్ర‌జ‌ల కు ప‌రివ‌ర్త‌నాత్మ‌క‌మైనటువంటి ఫ‌లితాల ను అందిస్తుంద‌ని ఆయ‌న అన్నారు.

‘‘శాంతి, స‌ద్భావ‌న మ‌రియు స‌మైక్య‌త ల‌తో కూడిన ఒక న‌వోద‌యానికి ఇదే ఆహ్వానం. ఈ రోజు భార‌త‌దేశాని కి చాలా ప్ర‌త్యేక‌మైన‌టువంటి రోజు. బోడో వ్యక్తుల సముదాయాల తో ఈ రోజు న సంతకాలు జరిగినటువంటి ఒక ఒప్పందం బోడో ప్‌ంజ‌ల కు గొప్ప ఫ‌లితాల ను ప్రసాదిస్తుంది.

బోడో ఒప్పందం అనేక కార‌ణాల వల్ల విశేష‌మైన‌టువంటిది. అది సంబంధిత వ‌ర్గాల‌న్నిటిని ఒక ఛ‌త్ర ఛాయ కింద‌కు తీసుకువ‌స్తుంది. ఇంత‌కుమునుపు సాయుధ ప్ర‌తిఘ‌ట‌న వర్గాల తో సంబంధం క‌లిగిన వారు ప్ర‌స్తుతం ప్ర‌ధాన స్ర‌వంతి లోకి అడుగుపెట్టి, మ‌న దేశ పురోగ‌తి కి వారి వంతు తోడ్పాటు ను అందించ‌బోతున్నారు.

బోడో స‌మూహాల తో కుదిరిన ఒడంబ‌డిక బోడో ప్ర‌జ‌ల విశిష్ట సంస్కృతి ని మ‌రింత గా ప‌రిర‌క్షించి, దానికి లోక‌ప్రియ‌త్వాన్ని సంత‌రించ‌ గ‌లుగుతుంది. వారు ఒక విస్తృత శ్రేణి లో అభివృద్ధి ప్ర‌ధాన కార్య‌క్ర‌మాల ల‌భ్య‌త కు నోచుకోగలుగుతారు. బోడో ప్ర‌జ‌లు వారి ఆకాంక్ష‌ల ను నెర‌వేర్చుకొనేటట్టు వారికి చేత‌నైన అన్ని విధాలుగాను స‌హాయాన్ని అందించ‌డం కోసం మేము కంక‌ణం క‌ట్టుకొన్నాము’’ అంటూ ప్ర‌ధాన మంత్రి త‌న మ‌నోభావాల ను ట్విట‌ర్ లో వ్రాసిన ఒక సందేశం లో వ్య‌క్తం చేశారు.