కోవిడ్- 19 మహమ్మారి ని ఎదుర్కోవడం కోసం ప్రకటించిన ఆర్థిక చర్యల లో ఒక భాగం అయిన ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పిఎమ్ జికెఎవై)’ ని మరో ఐదు నెలల కాలాని కి- అంటే 2020 వ సంవత్సరం జూలై నుండి 2020 వ సంవత్సరం నవంబర్ వరకు- పొడిగించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ యోజన లో కేంద్ర పూల్ నుండి ఆహారధాన్యాల ను అదనం గా కేటాయించడం జరుగుతుంది.
2020 వ సంవత్సరం మార్చి నెల లో భారత ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజ్’ (పిఎమ్ జికెపి)- 1 ని ప్రకటించింది. దేశం లో కోవిడ్ -19 మహమ్మారి కారణం గా ఆర్థిక కార్యకలాపాల కు అంతరాయం కలగడం తో పేదల కు ఎదురయ్యే ఇబ్బందుల నుండి వారి ని గట్టెక్కించేందుకు దీని ని ప్రకటించారు. ‘‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పిఎమ్-జికెఎవై)’’ అమలు ఈ ప్యాకేజ్ లో ఇమిడిపోయివుంది. ఆహార భద్రత చట్టం, 2013 (ఎన్‌ఎఫ్ఎస్‌ఎ) పరిధి లోకి వచ్చే దాదాపు 81 కోట్ల మంది లబ్ధిదారుల కు దీని ద్వారా ప్రతి వ్యక్తి కి నెల కు 5 కిలోగ్రాముల వంతు న అదనపు ఆహారధాన్యాల ను ( బియ్యం లేదా గోధుమలు) ఉచితం గా అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం లో తొలుత మూడు నెలల కాలాని కి అంటే 2020 ఏప్రిల్, మే, జూన్ నెలల కు గాను ఉచితం గా ఆహారధాన్యాల ను పంపిణీ చేశారు.
అయితే, పేద ప్రజల కు, అవసరమైన వారికి సహాయాన్ని కొనసాగించవలసిన అవసరాన్ని దృష్టి లో పెట్టుకొని పిఎమ్-జికెఎవై పథకాన్ని మరో ఐదు నెలల కాలానికి, అంటే 2020 జూలై నుండి 2020 వ సంవత్సరం నవంబర్ వరకు, పొడిగించడం జరిగింది.
ఇంతకుముందు, పిఎమ్ జికెఎవై లో భాగం గా, ఈ విభాగం 30/03/2020 న మొత్తం 120 లక్షల మెట్రిక్ టన్ను (ఎల్ ఎమ్ టి) ల ఆహారధాన్యాల ను వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కు మూడు నెలల కాలాని కి పంపిణీ చేసేందుకు (2020 ఏప్రిల్ నుండి జూన్ వరకు) కేటాయించింది. అందుకు అనుగుణం గా ఎఫ్ సిఐ ఇతర రాష్ట్ర ఏజెన్సీ లు 120 ఎల్ ఎమ్ టిల లో (97 శాతం) 116.5 ఎల్ ఎమ్ టి ఆహారధాన్యాల ను అన్ని రాష్ట్రాల కు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ ప్రత్యేక పథకం లో భాగం గా పంపిణీ కై అందజేశాయి.
ఇప్పటివరకు, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సుమారు 107 ఎల్ ఎమ్ టి ఆహారధాన్యాల ను ( అంటే 89 శాతం) 2020 ఏప్రిల్ నుండి జూన్ నెల వరకు గల కాలాని కి పంపిణీ చేశాయి. ఇప్పటి వరకు ఏప్రిల్ లో సుమారు 74.3 కోట్ల మంది లబ్ధిదారులు, మే నెల లో 74.75 కోట్ల మంది లబ్ధిదారులు, మే నెల లో 64.72 కోట్ల మంది లబ్ధిదారులు ఈ అదనపు ఉచిత ఆహారధాన్యాల ను తీసుకొని, ప్రయోజనం పొందారు. మామూలు గా తీసుకునే ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ ఆహారధాన్యాల కు ఇవి అదనం. ఈ ఆహార ధాన్యాల పంపిణీ ఇంకా కొనసాగుతోంది. పంపిణీ పూర్తి అయిన తరువాత గణాంకాల ను తాజా గా సవరించడం జరుగుతుంది. కొన్ని రాష్ట్రాలు రవాణా తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని పిఎమ్-జికెఎవై ఆహారధాన్యాల ను ఒకే సారి రెండు లేదా మూడు నెలల కు పంపిణీ చేశాయి.
ఎన్‌ఎఫ్ ఎస్ఎ క్రమ పంపిణీ లో భాగం గా 2020 వ సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ నెలల కు సుమారు 252 ఎల్ ఎమ్ టి ల ఎన్ఎఫ్ ఎస్‌ఎ ధాన్యాల ను , పిఎమ్-జికెఎవై ఆహారధాన్యాల ను ఎఫ్‌సిఐ దేశవ్యాప్తం గా తనకు గల పటిష్టమైన నెట్‌వర్క్ ద్వారా సమర్ధం గా తరలించింది. మారుమూల ప్రాంతాలు, అందుబాటు లో లేని ప్రాంతాల కు విమాన సర్వీసుల ను, జలరవాణా మార్గాల ను ఉపయోగించుకొని ఆహారధాన్యాల ను నిరంతరాయం గా తరలించి, లబ్దిదారుల కు అందజేసేటట్టు అధికారులు చర్యలు తీసుకొన్నారు.
లాక్ డౌన్ పూర్తిగా అమలు లో ఉన్న కాలం లో సైతం సరఫరా గొలుసు ను సమర్ధం గా నిర్వహించేటట్టు చూడడం చెప్పుకోదగిన విషయం.
ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ, అలాగే పిఎం-జికెఎవై పథకం లో భాగం గా ఆహారధాన్యాల ను లబ్దిదారుల కు ఎటువంటి అంతరాయం లేకుండా అందేటట్టు చూసేందుకు ఎఫ్ సిఐ మరియు డిపార్ట్ మెంట్ చర్య లు తీసుకున్నాయి. దీనికి తోడు ఇన్ఫర్మేశన్ టెక్నాలజీ ఆధారిత ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) సంస్కరణ లు, అంటే మొత్తం 5.4 లక్షల చౌక ధర ల దుకాణాల (ఎఫ్‌పిఎస్ ల) లో 90.3 శాతం అంటే సుమారు 4.88 లక్షల చౌక ధర ల దుకాణాల ఇపిఒఎస్ (EPoS) మశీన్ నెట్ వర్క్ డిజిటలైజ్ అయింది. దీనితో పాటు లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ (టిపిడిఎస్) కు సంబంధించి ఎండ్ టు ఎండ్ కంప్యూటరైజేశన్ చోటు చేసుకొంది. అనేక రాష్ట్రాల లో బయోమెట్రిక్ ద్వారా గుర్తింపు నిర్ధరణ ను తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ, ప్రస్తుత పరీక్ష కాలం లో సరఫరా గొలుసు నిర్వహణ దాని సమర్ధత ను చాటుకొంది.
2019 వ సంవత్సరం ఏప్రిల్- మే- జూన్ నెలల్లో ఈ డిపార్ట్ మెంటు ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ కింద మొత్తం 130.2 ఎల్ ఎమ్ టి ఆహారధాన్యాల ను కేటాయించగా, ఇందులో మొత్తం సుమారు 123 ఎల్ ఎమ్ టి (95 శాతం ఆహారధాన్యాల ను) రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తీసుకున్నాయి. 2020 వ సంవత్సరం అదే కాలం లో అంటే ఏప్రిల్-మే-జూన్ నెలల్లో ఈ డిపార్ట్ మెంట్ మొత్తం 252 ఎల్ ఎమ్ టి ఆహార ధాన్యాల ను అదే లబ్ధిదారుల కోసం కేటాయించగా ( 132 ఎల్ ఎమ్ టి ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ కింద, మరో 120 ఎల్ ఎమ్ టి పిఎంజికెఎవై కింద కేటాయించినవి), ఇందులో 247 ఎల్ ఎమ్ టి ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తీసుకున్నాయి. వీటి నుండి 226 ఎల్ ఎమ్ టి ఆహార ధాన్యాల ను లబ్ధిదారుల కు గత మూడు నెలల్లో పంపిణీ చేశారు. దీని ని బట్టి ప్రజల కు తగిన ఉపశమనం కలిగించడానికి సాధారణ స్థాయి కంటే రెట్టింపు మొత్తం లో ఆహారధాన్యాల ను పంపిణీ చేయడం జరిగిందని తేలుతోంది.
పిఎమ్ జికెఎవై ను మరో 5 నెలల కాలాని కి అంటే 2020 నవంబర్ వరకు పొడిగిండం వల్ల అదే స్థాయి లో పెద్ద ఎత్తున ఆహార ధాన్యాల సరఫరా ను, పంపిణీ ని కొనసాగించడం సాధ్యపడుతుంది. దీనికి గాను ఆహార ధాన్యాల ఖరీదు కు, పంపిణీ కి అదనం గా 76,062 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా.
**
कोरोना संकट काल में गरीबों की चिंताओं को दूर करने और उन्हें सशक्त बनाने के लिए आज कैबिनेट ने एक महत्वपूर्ण फैसले को मंजूरी दी। प्रधानंमत्री गरीब कल्याण अन्न योजना को नवंबर तक के लिए बढ़ा दिया गया है। इससे देश के 81 करोड़ लोग लाभान्वित होंगे। https://t.co/Fao7LqhXbw
— Narendra Modi (@narendramodi) July 8, 2020