పిఎంఇండియా

వెతుకు
 • డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్‌సింగ్‌

  డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్‌సింగ్‌

  మే 22, 2004 - మే 26, 2014

  భార‌త‌దేశ 14వ ప్ర‌ధానిగా ప‌నిచేసిన డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్‌సింగ్ ఆలోచ‌నాప‌రుడుగా, మేధావిగా స‌రైన గుర్తింపు పొందారు. ప‌నితీరులో సామ‌ర్థ్యం, దృక్ప‌థం ప‌రంగా స‌ర్వాద‌ర‌ణ పొందారు. స‌మ‌స్య‌ల ప‌ట్ల స్పంద‌న‌, న‌డ‌వ‌డిలో కూడా త‌న‌దైన ముద్ర వేసుకున్నారు. ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్‌సింగ్ 1932 సెప్టెంబ‌ర్ 26న అవిభ‌క్త భార‌త‌దేశంలో పంజాబ్ రాష్ట్రంలోని ఒక గ్రామంలో జ‌న్మించారు. 1948లో పంజాబ్ యూనివ‌ర్శిటీ నుంచి మెట్రిక్యులేష‌న్ పూర్తిచేశారు. త‌రువాత ఆయన చ‌దువు ...

  మరిన్ని ఆర్కైవ్ లింక్
 • శ్రీ అట‌ల్ బిహారీ వాజ్‌పేయి

  శ్రీ అట‌ల్ బిహారీ వాజ్‌పేయి

  మార్చి 19, 1998 – మే 22, 2004

  ప్ర‌జ‌ల్లోంచి వ‌చ్చిన మ‌నిషిగా రాజ‌కీయ దృఢ సంక‌ల్పం క‌లిగిన అట‌ల్ బిహారీ వాజ్‌పేయి 1999న అక్టోబ‌ర్ 13న భార‌త ప్ర‌ధానిగా రెండ‌వ ప‌ర్యాయం బాధ్య‌త‌లు చేప‌ట్టి కొత్త సంకీర్ణ ప్ర‌భుత్వం నేష‌న‌ల్ డెమోక్ర‌టిక్ అల‌య‌న్స్‌ కు నాయ‌క‌త్వం వ‌హించారు. అంత‌కుముందు 1966లో స్వ‌ల్ప‌కాలంపాటు ఆయ‌న దేశ ప్ర‌ధానిగా ఉన్నారు. సీనియ‌ర్ పార్ల‌మెంటేరియ‌న్‌గా నాలుగు ద‌శాబ్దాల‌పాటు ఆయ‌న జీవితం సాగింది. శ్రీ వాజ్‌పేయి లోక్‌స‌భ‌కు తొమ్మిదిసార్లు, రాజ్య‌స‌భ‌కు రెండుసార్లు ఎన్నికై రికార్డు నెల‌కొల్పారు. భార‌త ప్ర‌ధానిగా, ...

  మరిన్ని ఆర్కైవ్ లింక్
 • శ్రీ ఇంద‌ర్ కుమార్ గుజ్రాల్‌

  శ్రీ ఇంద‌ర్ కుమార్ గుజ్రాల్‌

  ఏప్రిల్ 21, 1997 – మార్చి 19, 1998

  భార‌త 12వ ప్ర‌ధానిగా శ్రీ ఇంద‌ర్ కుమార్ గుజ్రాల్ 1997 ఏప్రిల్ 21న ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. స్వ‌ర్గీయ అవ‌తార్ నారాయ‌ణ్ గుజ్రాల్‌, స్వ‌ర్గీయ శ్రీ‌మ‌తి పుష్పా గుజ్రాల్ కుమారుడైన ఇంద‌ర్ కుమార్ గుజ్రాల్ ఎంఏ, బి.కాం, పిహెచ్‌డి, డి.లిట్ (హెచ్ఓఎన్ఎస్‌, సిఐయుఎస్ఏ) చేశారు. అవిభ‌క్త పంజాబ్‌లోని జీలంలో 1919 డిసెంబ‌ర్ 4న జ‌న్మించారు. 1945 మే 26న శ్రీ‌మ‌తి షీలా గుజ్రాల్‌ను వివాహ‌మాడారు. గుజ్రాల్ స్వాతంత్ర యోధుల కుటుంబానికి చెందిన‌వారు. ఆయ‌న ...

  మరిన్ని ఆర్కైవ్ లింక్
 • శ్రీ హెచ్‌.డి. దేవె గౌడ‌

  శ్రీ హెచ్‌.డి. దేవె గౌడ‌

  జూన్ 1. 1996 – ఏప్రిల్‌ 21, 1997

  సామాజిక‌, ఆర్థికాభివృద్ధికోసం గ‌ట్టి పోరాటం స‌లిపిన, సుసంప‌న్న‌మైన భార‌తీయ సంస్కృతి, వార‌స‌త్వ సంప‌ద ప‌ట్ల ప్ర‌గాఢ అభిమానం క‌లిగిన హెచ్‌.డి. దేవె గౌడ 1933 మే 18న క‌ర్ణాట‌క‌లోని హ‌స‌న్ జిల్లా హోళె న‌ర్సిపుర తాలూకా, హ‌ర‌ద‌నహ‌ళ్ళిలో జ‌న్మించారు. సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా తీసుకున్న దేవెగౌడ 20 ఏళ్ళ వ‌య‌సులో చ‌దువు పూర్త‌యిన వెంట‌నే క్రియాశీల రాజ‌కీయాల్లో ప్ర‌వేశించారు. 1953లో కాంగ్రెస్ పార్టీలో చేరిన గౌడ 1962 వ‌ర‌కు అదే ...

  మరిన్ని ఆర్కైవ్ లింక్
 • శ్రీ అట‌ల్ బిహారీ వాజ్‌పేయి

  శ్రీ అట‌ల్ బిహారీ వాజ్‌పేయి

  మే 16, 1996 – జూన్ 1, 1996

  ప్ర‌జ‌ల్లోంచి వ‌చ్చిన మ‌నిషిగా రాజ‌కీయ దృఢ సంక‌ల్పం క‌లిగిన అట‌ల్ బిహారీ వాజ్‌పేయి 1999న అక్టోబ‌ర్ 13న భార‌త ప్ర‌ధానిగా రెండ‌వ ప‌ర్యాయం బాధ్య‌త‌లు చేప‌ట్టి కొత్త సంకీర్ణ ప్ర‌భుత్వం నేష‌న‌ల్ డెమోక్ర‌టిక్ అల‌య‌న్స్‌ కు నాయ‌క‌త్వం వ‌హించారు. అంత‌కుముందు 1966లో స్వ‌ల్ప‌కాలంపాటు ఆయ‌న దేశ ప్ర‌ధానిగా ఉన్నారు. సీనియ‌ర్ పార్ల‌మెంటేరియ‌న్‌గా నాలుగు ద‌శాబ్దాల‌పాటు ఆయ‌న జీవితం సాగింది. ...

  మరిన్ని ఆర్కైవ్ లింక్
 • శ్రీ పి.వి. న‌ర‌సింహారావు

  శ్రీ పి.వి. న‌ర‌సింహారావు

  జూన్ 21, 1991 – మే 16, 1996

  పి.రంగారావు కుమారుడైన శ్రీ పి.వి. న‌ర‌సింహారావు 1921 జూన్ 28న క‌రీంన‌గ‌ర్‌లో జ‌న్మించారు. హైద‌రాబాద్ ఉస్మానియా యూనివ‌ర్శిటీలోను, బోంబే యూనివ‌ర్శిటీలోను, నాగ్‌పూర్ యూనివ‌ర్శిటీలోను చ‌దువుకున్నారు. భార్య‌ను కోల్పోయిన పి.వి.న‌ర‌సింహ‌రావుకు ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. వ్య‌వ‌సాయ‌వేత్త‌గా, న్యాయ‌వాదిగా ఉన్న న‌ర‌సింహారావు రాజ‌కీయాల్లో చేరి కొన్ని ముఖ్‌‌మైన ప‌ద‌వులు నిర్వ‌హించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంలో 1962 - 64 న్యాయ‌, స‌మాచార శాఖ మంత్రి, 1964 - 67 ...

  మరిన్ని ఆర్కైవ్ లింక్
 • శ్రీ చంద్రశేఖ‌ర్‌

  శ్రీ చంద్రశేఖ‌ర్‌

  న‌వంబ‌ర్‌ 10, 1990 – జూన్ 21, 1991

  శ్రీ చంద్రశేఖ‌ర్ 1927 జులై 21న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బ‌లియా జిల్లా ఇబ్ర‌హీంప‌ట్టి గ్రామంలో రైతు కుటుంబంలో జ‌న్మించారు. 1977 నుంచి 1988 వ‌ర‌కు జ‌న‌తాపార్టీ అధ్య‌క్షునిగా ఉన్నారు. విద్యార్థి ద‌శ‌లోనే రాజ‌కీయాల ప‌ట్ల ఆక‌ర్షితులైన చంద్ర‌శేఖ‌ర్ విప్ల‌వాత్మ‌క భావాల‌తో ఫైర్ బ్రాండ్ ఆద‌ర్శ‌వాదిగా పేరు గాంచారు. 1950 - 51లో అల‌హాబాద్‌ యూనివ‌ర్శిటీ నుంచి పొలిట‌క‌ల్ సైన్సు లో మాస్ట‌ర్స్ డిగ్రీ తీసుకున్న త‌రువాత ఆయ‌న సోష‌లిస్ట్ ఉద్య‌మంలో ...

  మరిన్ని ఆర్కైవ్ లింక్
 • శ్రీ విశ్వ‌నాథ్ ప్ర‌తాప్‌సింగ్‌

  శ్రీ విశ్వ‌నాథ్ ప్ర‌తాప్‌సింగ్‌

  డిసెంబ‌ర్ 2, 1989 – న‌వంబ‌ర్‌ 10, 1990

  1931 జూన్ 25న అల‌హాబాద్‌లో జ‌న్మించిన వి.పి.సింగ్ రాజాబ‌హ‌దూర్ రాంగోపాల్‌సింగ్ కుమారుడు. అల‌హాబాద్‌, పూనా విశ్వ‌విద్యాల‌యాల్లో ఆయ‌న విద్య‌ను అభ్య‌సించారు. 1955 జూన్ 25న సీతాకుమారిని వివాహ‌మాడిన వి.పి.సింగ్ కు ఇద్ద‌రు కుమారులు. విద్యావంతుడైన వి.పి.సింగ్ అల్హ‌బాద్‌లోని కొరాన్‌లో గోపాల్ విద్యాల‌య పేరుతో ఇంట‌ర్మీడియ‌ట్ కాలేజీని స్థాపించారు. 1947 - 48లో వార‌ణాసిలోని ఉద‌య్‌ప్ర‌తాప్ క‌ళాశాల విద్యార్థి సంఘానికి ప్రెసిడెంట్‌గా ప‌నిచేశారు. అలాగే అల‌హాబాద్‌ యూనివ‌ర్సిటీ ...

  మరిన్ని ఆర్కైవ్ లింక్
 • శ్రీ రాజీవ్‌ గాంధీ

  శ్రీ రాజీవ్‌ గాంధీ

  అక్టోబ‌ర్‌ 31, 1984 - డిసెంబ‌ర్ 2, 1989

  40 ఏళ్ళ వ‌య‌సులో భార‌త యువ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన రాజీవ్‌గాంధీ బ‌హుశా ప్ర‌పంచంలోనే అతి పిన్న‌వ‌య‌స్కులైన ప్ర‌భుత్వాధినేత‌ల్లో ఒక‌రు కావ‌చ్చు. ఆయ‌న త‌ల్లి ఇందిరాగాంధీ 1966లో మొద‌టిసారి ప్ర‌ధాన‌మంత్రి అయిన‌ప్పుడు ఆమె రాజీవ్ గాంధీ కంటె 8 ఏళ్ళు (48) పెద్ద‌. ప్ర‌ఖ్యాతివ‌హించిన‌ ఆయ‌న తాత పండిట్ జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ స్వేచ్ఛా భార‌తానికి తొలి ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టేనాటికి వ‌య‌సు 58 సంవ‌త్స‌రాలు. దేశంలో త‌రం మార్పుకు సంకేతంగా ...

  మరిన్ని ఆర్కైవ్ లింక్
 • శ్రీమ‌తి ఇందిరాగాంధీ

  శ్రీమ‌తి ఇందిరాగాంధీ

  జ‌న‌వ‌రి 14, 1980 – అక్టోబ‌ర్‌ 31, 1984

  అత్యంత ప్ర‌ఖ్యాతిగాంచిన కుటుంబంలో 1917 న‌వంబ‌ర్ 19న జ‌న్మించిన శ్రీమ‌తి ఇందిరాగాంధీ స్వ‌తంత్య్ర భార‌త తొలి ప్ర‌ధాని పండిట్‌ జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ కుమార్తె. ఇకోలే నౌవెల్, బెక్స్ (స్విట్జ‌ర్లాండ్‌) ఇకోలే ఇంట‌ర్నేష‌న‌ల్ - జెనీవా, ప్యూపుల్స్ ఓన్ స్కూల్ - పూనె, బొంబే, బాడ్మింట‌న్ స్కూల్ - బ్రిస్ట‌ల్‌, విశ్వ‌భార‌తి, శాంతినికేత‌న్‌, సోమ‌ర్ విల్ కాలేజ్ - ఆక్స్‌ ఫ‌ర్డ్ వంటి ప్ర‌ముఖ విద్యాసంస్థ‌ల్లో ఆమె చ‌దువుకున్నారు. అనేక అంత‌ర్జాతీయ ...

  మరిన్ని ఆర్కైవ్ లింక్
 • శ్రీ చ‌ర‌ణ్‌సింగ్‌

  శ్రీ చ‌ర‌ణ్‌సింగ్‌

  జులై 28, 1979 – జ‌న‌వ‌రి 14, 1980

  శ్రీ చ‌ర‌ణ్‌సింగ్ 1902లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మీర‌ట్ జిల్లా నూర్‌పూర్‌లో ఒక మ‌ధ్య‌త‌ర‌గ‌తి రైతు కుటుంబంలో జ‌న్మించారు. 1923లో సైన్సులో డిగ్రీ తీసుకున్నారు. 1925లో ఆగ్రా యూనివ‌ర్శిటీలో పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ చేశారు. న్యాయవాది శిక్ష‌ణ కూడా పొంది ఘ‌జియాబాద్‌లో ప్రాక్టీస్ పెట్టారు. 1929లో మీర‌ట్ నుంచి మ‌కాం మార్చి త‌రువాత కాంగ్రెస్‌లో చేరారు. చ‌ర‌ణ్‌సింగ్ మొద‌ట 1937లో చాప్రోలి నుంచి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. అనంత‌రం 1946, ...

  మరిన్ని ఆర్కైవ్ లింక్
 • శ్రీ మొరార్జీ దేశాయ్‌

  శ్రీ మొరార్జీ దేశాయ్‌

  మార్చి 24, 1977 – జులై 28, 1979

  ప్ర‌స్తుతం గుజ‌రాత్‌లోని బ‌ల్స‌ర్ జిల్లాలో ఉన్న భ‌డేలీ గ్రామంలో 1896 ఫిబ్ర‌వ‌రి 29న శ్రీ‌ మొరార్జీ దేశాయ్ జ‌న్మించారు. ఆయ‌న తండ్రి గ‌ట్టి క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన పాఠ‌శాల ఉపాధ్యాయుడు. చిన్న‌త‌నం నుంచే మొరార్జీ దేశాయ్ త‌న తండ్రి నుంచి క‌ష్ట‌ప‌డి ప‌నిచేయ‌డం, ఎటువంటి సంద‌ర్భంలోనైనా స‌త్యాన్నే ప‌ల‌కడం వంటి మంచి ల‌క్ష‌ణాలు అల‌వ‌ర్చుకున్నారు. సెయింట్ బూస‌ర్ హైస్కూల్‌లో చ‌దువుకుని మెట్రిక్ ఉత్తీర్ణుల‌య్యారు. 1918లో అప్ప‌టి బోంబే ...

  మరిన్ని ఆర్కైవ్ లింక్
 • శ్రీమ‌తి ఇందిరాగాంధీ

  శ్రీమ‌తి ఇందిరాగాంధీ

  జ‌న‌వ‌రి 24, 1966 – మార్చి 24, 1977

  అత్యంత ప్ర‌ఖ్యాతిగాంచిన కుటుంబంలో 1917 న‌వంబ‌ర్ 19న జ‌న్మించిన శ్రీమ‌తి ఇందిరాగాంధీ స్వ‌తంత్య్ర భార‌త తొలి ప్ర‌ధాని పండిట్‌ జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ కుమార్తె. ఇకోలే నౌవెల్, బెక్స్ (స్విట్జ‌ర్లాండ్‌) ఇకోలే ఇంట‌ర్నేష‌న‌ల్ - జెనీవా, ప్యూపుల్స్ ఓన్ స్కూల్ - పూనె, బొంబే, బాడ్మింట‌న్ స్కూల్ - బ్రిస్ట‌ల్‌, విశ్వ‌భార‌తి, శాంతినికేత‌న్‌, సోమ‌ర్ విల్ కాలేజ్ - ఆక్స్‌ ఫ‌ర్డ్ వంటి ప్ర‌ముఖ విద్యాసంస్థ‌ల్లో ఆమె చ‌దువుకున్నారు. అనేక అంత‌ర్జాతీయ ...

  మరిన్ని ఆర్కైవ్ లింక్
 • శ్రీ‌ గుల్జారీలాల్నందా

  శ్రీ‌ గుల్జారీలాల్నందా

  జ‌న‌వ‌రి 11, 1966 – జ‌న‌వ‌రి 24, 1966

  గుల్జారీలాల్నందా 4 జులై 1898లో పంజాబ్లోని (ప్రస్తుతం పాకిస్థాన్లో ఉన్న) సియాల్కోట్లో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం లాహోర్, ఆగ్రా, అలహాబాద్లలో కొనసాగింది. 1920-1921 లో గుల్జారీలాల్నందా అలహాబాద్ విశ్వవిద్యాలయంలో కార్మిక సమస్యలపై పరిశోధన జరిపారు. 1921లో బొంబాయిలోని జాతీయ కళాశాలలో ఆర్థికశాస్త్ర అధ్యాపకుడిగా బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది సహాయ నిరాకరణ ఉద్యమంలో పాలుపంచుకున్నారు. 1922లో అలహాబాద్ వస్త్ర పరిశ్రమ కార్మికుల సంఘం కార్యదర్శిగా ఎన్నికై 1946 వరకూ ...

  మరిన్ని ఆర్కైవ్ లింక్
 • శ్రీ‌ లాల్బహదూర్ శాస్త్రి

  శ్రీ‌ లాల్బహదూర్ శాస్త్రి

  జూన్ 9, 1964 – జ‌న‌వ‌రి 11, 1966

  లాల్బహదూర్ శాస్త్రి ఉత్తరప్రదేశ్లో వారణాసికి ఏడు మైళ్ల దూరంలోని చిన్న పట్టణం మొఘల్ సరాయ్లో 2 అక్టోబర్ 1904న జన్మించారు. ఆయన తండ్రి పాఠశాల ఉపాధ్యాయుడిగా పని చేసేవారు. లాల్బహదూర్ ఏడాదిన్నర వయసులో ఉన్నప్పుడే ఆయన మరణించారు. తల్లి తన ముగ్గురు పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లి అక్కడే ఉండి పోయారు. చిన్నపట్టణంలో లాల్బహదూర్ చదువు అంత గొప్పగా ఏమీ సాగలేదు. అయితే, పేదరికం వెంటబడి తరుముతున్నప్పటికీ ఆయన ...

  మరిన్ని ఆర్కైవ్ లింక్
 • శ్రీ‌ గుల్జారీలాల్నందా

  శ్రీ‌ గుల్జారీలాల్నందా

  మే 27, 1964 – జూన్ 9, 1964

  గుల్జారీలాల్నందా 4 జులై 1898లో పంజాబ్లోని (ప్రస్తుతం పాకిస్థాన్లో ఉన్న) సియాల్కోట్లో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం లాహోర్, ఆగ్రా, అలహాబాద్లలో కొనసాగింది. 1920-1921 లో గుల్జారీలాల్నందా అలహాబాద్ విశ్వవిద్యాలయంలో కార్మిక సమస్యలపై పరిశోధన జరిపారు. 1921లో బొంబాయిలోని జాతీయ కళాశాలలో ఆర్థికశాస్త్ర అధ్యాపకుడిగా బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది సహాయ నిరాకరణ ఉద్యమంలో పాలుపంచుకున్నారు. 1922లో అలహాబాద్ వస్త్ర పరిశ్రమ కార్మికుల సంఘం కార్యదర్శిగా ఎన్నికై 1946 వరకూ ...

  మరిన్ని ఆర్కైవ్ లింక్
 • శ్రీ‌ జవహర్లాల్ నెహ్రూ

  శ్రీ‌ జవహర్లాల్ నెహ్రూ

  ఆగ‌స్టు 15, 1947 – మే 27, 1964

  పండిట్ జవహర్లాల్ నెహ్రూ 14 నవంబర్ 1889న ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో జన్మించారు. ఆయన తొలి విద్యాభ్యాసం ఇంటి దగ్గర ప్రైవేటు ఉపాధ్యాయుల వద్దే నడిచింది. ఉన్నత విద్యాభ్యాసం కోసం 15 ఏళ్ల వయసులో నెహ్రూ ఇంగ్లండ్కు వెళ్లారు. కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయంలో ప్రకృతిశాస్త్రాలను చదివారు. అనంతరం ఇన్నర్టెంపుల్ అనే పేరున్న ప్రఖ్యాత న్యాయ విద్యాసంస్థలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. విద్యార్థిగా ఉన్న ఈ దశలోనే నెహ్రూ.. విదేశీ పాలనలో మగ్గుతున్న వివిధ ...

  మరిన్ని ఆర్కైవ్ లింక్