పిఎంఇండియా
| ఎ. ప్రజా సమస్యలు/ఫిర్యాదులు | ||
| 1 | గౌరవనీయులైన ప్రధాన మంత్రి కి నా ఇక్కట్టుపై అర్జీ పెట్టుకోవాలని భావిస్తున్నాను. దీనికి ఉన్నటువంటి పద్ధతిని గురించి దయచేసి తెలియజేయగలరు. నేను నా ఇక్కట్టుపై ప్రధాన మంత్రి కార్యాలయానికి (పిఎమ్ఒ కు) నేను ఏ విధంగా అర్జీ పెట్టుకోవాలి ? నేను నా ఇక్కట్టును పిఎమ్ఒ లో ఎక్కడకు పంపించాలి ? నా ఇక్కట్టును గౌరవనీయులైన ప్రధాన మంత్రి లేదా పిఎమ్ఒ కు ఆన్లైన్ మాధ్యమం ద్వారా పంపవచ్చా ? |
గౌరవనీయులైన ప్రధాన మంత్రికి/ పిఎమ్ఒ కు ఎలాంటి ఇక్కట్టులనైనా నివేదించవచ్చు. ఇందుకోసం”ప్రధాన మంత్రికి రాయండి” అనే ఇంటరాక్టివ్ పేజీ లింకును ఉపయోగించుకోవాలి. ఇది పిఎమ్ఒ వెబ్సైట్ : https://www.pmindia.gov.in/ ->లో దాని దిగువన గౌరవనీయులైన ప్రధాన మంత్రిని సంప్రతించండి అనే వాక్యంతో అందుబాటులో ఉంటుంది. అలాగే పిఎమ్ఒ వెబ్సైట్ (https://www.pmindia.gov.in) ప్రధాన పేజీలో ప్రధాన మంత్రికి రాయండి అనే లింకు ద్వారా కూడా అందుబాటులో ఉంది.
పైన పేర్కొన్న లింకుపై, క్లిక్ చేశాక అది పౌరులను CPGRAMS పేజీ లోకి తీసుకువెళ్తుంది. అక్కడ మీ ఇక్కట్టును నమోదు చేసుకోవాలి. ఇది నమోదైన తరువాత ఒక విశిష్ట నమోదు సంఖ్య ప్రత్యక్షం అవుతుంది. పౌరుడు తన సమస్యకు సంబంధించిన పత్రాలు ఏవైనా ఉంటే వాటిని పంపే సౌలభ్యం కూడా ఉంది. పౌరులు తమ ఇక్కట్టుకు సంబంధించిన పత్రాలను ఇతర మార్గాలలో సైతం గౌరవనీయులైన ప్రధాన మంత్రికి/పిఎమ్ఒ కు నివేదించవచ్చు. (i) తపాలా ద్వారా- ప్రధాన మంత్రి కార్యాలయం, సౌత్ బ్లాక్, న్యూ ఢిల్లీ, పిన్ కోడ్ – 110011, (ii) నేరుగా అందించే స్థానం – పిఎమ్ఒ తపాలా కేంద్రం, సౌత్ బ్లాక్, న్యూ ఢిల్లీ; మరియు (iii) ఫ్యాక్స్ ద్వారా – ఫ్యాక్స్ సంఖ్య. 011-23016857. |
| 2 | గౌరవనీయులైన ప్రధాన మంత్రి తో నా ఆలోచనలను ఏ విధంగా పంచుకోవచ్చు ?
గౌరవనీయులైన ప్రధానమంత్రి కి నేను కొన్ని సూచనలు ఇవ్వదలచాను. అందుకు అమలులో ఉన్న పద్ధతి ఏమిటో తెలియజేయగలరు ? |
పౌరులు వారి ఆలోచనలను, అభిప్రాయాలను, మనోభావాలను గౌరవనీయులైన ప్రధాన మంత్రి తో/పిఎమ్ఒ తో పంచుకోవచ్చు.”మీ ఆలోచనలను, అభిప్రాయాలను, మనోభావాలను పంచుకోండి” ఇందుకోసం అనే లింకుతో పాటు పిఎమ్ఒ వెబ్సైట్: https://www.pmindia.gov.in/ ->లో గౌరవనీయులైన ప్రధానితో సంప్రదించండి(డ్రాప్ డౌన్ మెనూ నుండి) -> మీ ఆలోచనలను, అభిప్రాయాలను, మనోభావాలను పంచుకోండి. ఈ లింకు పిఎం వెబ్సైటు[https://www.pmindia.gov.in/]లో కూడా అందుబాటులో ఉంది.
పౌరులు వారి ఆలోచనలను, అభిప్రాయాలను, మనోభావాలను గౌరవనీయులైన ప్రధాన మంత్రితో/పిఎమ్ఒ తో ఇతర మార్గాలలో సైతం పంచుకోవచ్చు: (i) తపాలా ద్వారా – ప్రధాన మంత్రి కార్యాలయం, సౌత్ బ్లాక్, న్యూ ఢిల్లీ, పిన్ కోడ్ – 110011, (ii) నేరుగా అందించే స్థానం – పిఎమ్ఒ తపాలా కేంద్రం, సౌత్ బ్లాక్, న్యూఢిల్లీ; మరియు (iii) ఫ్యాక్స్ ద్వారా – ఫ్యాక్స్ సంఖ్య 011-23016857. |
| 3 | గౌరవనీయులైన ప్రధాన మంత్రి కి లేదా పిఎమ్ ఒ కు అర్జీ పెట్టుకున్న ఇక్కట్టు యొక్క పరిష్కారం ఏ స్థితిలో ఉందో పౌరులు ఏ విధంగా తెలుసుకోవచ్చు ? | ప్రధాని కార్యాలయానికి పెద్ద సంఖ్యలో అందే ప్రజా ఇక్కట్లలోని అంశాలు వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు లేదా రాష్ట్ర ప్రభుత్వాల పరిధికి సంబంధించినవై ఉంటాయి. ఆ సమస్యలు/ ఫిర్యాదులను ఇక్కడి ప్రజా విభాగం వేరుపరచి ఆయా మంత్రిత్వ శాఖకు/విభాగానికి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతుంది.
ప్రధాని కార్యాలయానికి పెద్ద సంఖ్యలో అందే ప్రజా ఇక్కట్లలోని అంశాలు వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు లేదా రాష్ట్ర ప్రభుత్వాల పరిధికి సంబంధించినవై ఉంటాయి. ఆ సమస్యలు/ ఫిర్యాదులను ఇక్కడి ప్రజా విభాగం వేరుపరచి ఆయా మంత్రిత్వ శాఖకు/విభాగానికి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతుంది. ఆ సమాచారంతో పాటు సదరు సమస్య సంబంధిత నమోదు సంఖ్యను కూడా మంత్రిత్వశాఖకు/విభాగానికి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తుంది. దీని నకలును ఫిర్యాదుదారుకూ పంపుతుంది. ఫిర్యాదు/సమస్యల నమోదు/పరిశీలన సమయంలో నమోదు సంఖ్యను కూడా దరఖాస్తుదారుకు ఇమెయిల్, ఎస్ఎమ్ఎస్ ల ద్వారా తెలుపుతుంది. ఈ సంఖ్య ఆధారంగా వారు వారి ఫిర్యాదు స్థితిగతులను http://pgportal.gov.in/ViewStatus.aspx లో నేరుగా పరిశీలించుకోవచ్చు. (ఈ లింకు పిజి పోర్టల్ హోం పేజీ లోనూ లభ్యమవుతుంది). ప్రధాన మంత్రికి పంపిన లేఖ పరిస్థితిని పౌరులు 011-23386447 నంబరుకు ఫోన్ చేసి కూడా తెలుసుకోవచ్చు. ఆయా సమస్యల పరిష్కారం వాటిని అందుకున్న మంత్రిత్వ శాఖ/విభాగం/రాష్ట్ర ప్రభుత్వాల లోని సముచిత అధికార సంస్థ పరిధిలో ఉంటుంది. అందువల్ల దరఖాస్తుదారులు సంబంధిత మంత్రిత్వ శాఖలు/విభాగాలు/రాష్ట్ర ప్రభుత్వాలను వాకబు చేయడం ద్వారా పురోగతిని గురించి వాకబు చేయవచ్చు. |
| 4 | నా ఇక్కట్టుపై గౌరవనీయులైన ప్రధాన మంత్రి కి/ పిఎమ్ ఒ కు ../../….(తేదీ/నెల /సంవత్సరం) నాడు పంపించిన అర్జీ మీద తీసుకున్న చర్య ఏమిటో దయచేసి తెలియజేయగలరు. ఆ అర్జీని పిఎమ్ఒ ఐడీ సంఖ్య: PMOPG/D/…. (సంవత్సరం)/123456789తో ../../….(తేదీ/నెల /సంవత్సరం)నాడు ……….. విభాగానికి పంపడమైంది.
నేను పిఎమ్ఒ కు ఒక అర్జీని పెట్టుకున్నాను; నా అర్జీని పిఎమ్ ఒ PMOPG/D/…. (సంవత్సరం)/123456789తో ../../….(తేదీ/ నెల/సంవత్సరం) నాడు ………… రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. దాని స్థితిని గురించి దయ చేసి తెలియజేయగలరు. నా ఇక్కట్టును గురించి వివరిస్తూ గౌరవనీయులైన ప్రధాన మంత్రికి ../../….(తేదీ/నెల /సంవత్సరం) నాడు నమోదు సంఖ్య PMOPG/E/….(సంవత్సరం/ 123456789తో ఆన్లైన్ మాధ్యమం ద్వారా ఒక అర్జీని పెట్టుకున్నాను. దానిని పిఎమ్ఒ ……… ఎలక్ట్రానిక్ మాధ్యమంలో మంత్రిత్వ శాఖకు పంపించింది. నా అర్జీలో ప్రస్తావించిన నా ఇక్కట్టు కు పరిష్కారం లభించిందా అనేది నేను తెలుసుకోగోరుతున్నాను . |
ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత పిఎమ్ఒ నుండి
సదరు అభ్యర్థనను అందుకున్నసముచిత అధికార సంస్థ పరిధిలో ఉంది. |
| 5 | నా ఇక్కట్టుకు సంబంధించి ../../….(తేదీ/నెల/సంవత్సరం) నాడు నేను పెట్టుకున్న అర్జీని పిఎమ్ ఒ PMOPG/D/…. (సంవత్సరం)/ 123456789తో ../../….(తేదీ/నెల /సంవత్సరం) నాడు ………… రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. ఆ ఫైలు లోని వ్యాఖ్యల నకలు ప్రతులను దయచేసి అందించగలరు .
నా ఇక్కట్టుపై పిఎమ్ఒ ఐడి సంఖ్య PMOPG/D/….(సంవత్సరం)/123456789తో ../../….(తేదీ/నెల /సంవత్సరం) నాడు ………… మంత్రిత్వ శాఖకు పంపిన ఫైలును నేను పరిశీలించాలనుకుంటున్నాను. నా ఇక్కట్టుపై నేను ../../….(తేదీ/నెల/ సంవత్సరం) నాడు పెట్టుకున్న అర్జీని పిఎమ్ఒ లేఖ సంఖ్య. PMOPG/D/….(సంవత్సరం)/ 123456789తో ../../….(తేదీ/నెల/ సంవత్సరం) నాడు ……….. రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. దీనిపై రోజువారీ పురోగతి యొక్క వివరాలను దయచేసి నాకు అందించగలరు.
|
ప్రజల నుండి అందే నివేదనలను, లేఖలను పిఎమ్ఒ లో పూర్తిగా కంప్యూటరీకరించిన ప్రజా విభాగం పరిశీలిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం ఒక సాఫ్ట్ వేర్ ద్వారా జరుగుతుంది. కాబట్టి ఫైలులో వ్యాఖ్యలు, రోజువారీ పురోగతి నివేదిక వంటి నిబంధనలేవీ ఉండవు. |
| 6 | గౌరవనీయులైన ప్రధాన మంత్రికి నేను ఆన్లైన్ మాధ్యమం ద్వారా అర్జీని పెట్టుకున్నాను. దీనిపై పిఎమ్ఒ …….. మంత్రిత్వశాఖకు/…….. రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన సమాచారం/లేఖ నకలును దయచేసి అందించగలరు. | ఆన్లైన్ నివేదన లను సంబంధిత అధికార సంస్థలకు ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా పంపుతారు కనుక, సమాచార లేఖ రూపొందే పరిస్థితి ఉండదు. |
| 7 | నా ఇక్కట్టుపై అర్జీ పెట్టుకోవడం కోసం గౌరవనీయులైన ప్రధాన మంత్రి ఇ-మెయిల్ ఐడి ని దయచేసి తెలియజేయగలరు. | ప్రధాన మంత్రికి అధికార ఇమెయిల్ ఐడి అంటూ ఏదీ లేదు. అయితే, చర్యలపై స్పందన/సూచనలు/ఫిర్యాదులను www.pmindia.gov.in లో “గౌరవనీయులైన ప్రధాన మంత్రి ని సంప్రదించండి” అనే వాక్యంతో దిగువన కనిపించే లింకుల ద్వారా ప్రధాన మంత్రికి/పిఎమ్ఒ కు పంపించవచ్చు. |
| బి. పరిపాలన మరియు మానవ వనరులు | ||
| 8 | పిఎమ్ఒ లోని అధికారుల పేర్లు, వారి హోదాలు, ఫోన్ నంబర్లను దయచేసి తెలుపగలరు .
పిఎమ్ ఒ లో …… హోదాలో పనిచేసే అధికారి శ్రీ………గారి ఫోన్ నంబర్ దయచేసి తెలుపగలరని కోరుతున్నాను . |
పిఎమ్ఒ లోని అధికారుల పేర్లు, వారి హోదాలు, ఫోన్ నంబర్లు పిఎమ్ఒ వెబ్ సైట్ లో భాగమైన https://www.pmindia.gov.in/ -> అధికారుల జాబితా(పిఎంఓ) (డ్రాప్ డౌన్ మెనూ)లో అందుబాటులో ఉంటాయి. |
| 9 | భారత ప్రధాన మంత్రి ఆంతరంగిక కార్యదర్శి, ప్రత్యేక విధులు నిర్వహించే అధికారుల (OSD) పేర్లు, మొబైల్ నంబర్లు తెలుపగలరని ప్రార్థన .
పిఎమ్ఒ లో ….. హోదా గల అధికారి శ్రీ……. గారి మొబైల్ నంబరు తెలుపగలరని ప్రార్థన . |
పిఎమ్ఒ లోని అధికారుల పేర్లు https://www.pmindia.gov.in/ -> అధికారుల జాబితా(పిఎంఓ) (డ్రాప్ డౌన్ మెనూ)లో అందుబాటులో ఉంటాయి. అధికారుల మొబైల్ నంబర్ల వెల్లడి వల్ల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే అవాంఛనీయ స్థితి తలెత్తవచ్చు. అందుకని, సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 8(1) (జె)లో భాగంగా పేర్ల వెల్లడి నుండి వారికి మినహాయింపు ఉంది. |
| 10 | పిఎమ్ఒ లోని అధికారులు, సిబ్బంది జీతం వివరాలు తెలుపగలరని ప్రార్థన .
పిఎమ్ ఒ లో పనిచేస్తున్న శ్రీ……. గారికి చెల్లిస్తున్న మొత్తం పారితోషికం ఎంత ? |
పిఎమ్ఒ లో అధికారులు, సిబ్బంది కి చెల్లించిన పారితోషికం ల వివరాలు పిఎమ్ఒ వెబ్సైట్ లో సమాచార హక్కు (ఆర్టిఐ) చట్టం 2005 యొక్క సెక్షన్ 4 (1) (బి) కింద స్వచ్ఛంద ప్రకటన. కింద: https://www.pmindia.gov.in/ ->సమాచార హక్కు (ఆర్టిఐ) (డ్రాప్ డౌన్ మెనూ) -> సమాచార హక్కు (ఆర్టిఐ) చట్టం 2005 యొక్క సెక్షన్ 4 (1) (బి) కింద స్వచ్ఛంద ప్రకటన లో ఉంటాయి |
| 11 | పిఎమ్ఒ గడచిన ఆర్థిక సంవత్సరంలో చేసిన మొత్తం ఖర్చు ఎంత ?
‘జీతాలు’ పద్దు కింద పిఎమ్ఒ నెలవారీ ఖర్చు వివరాలను దయచేసి తెలుపగలరు. |
పిఎమ్ఒ గడచిన ఆర్థిక సంవత్సరంలో చేసిన మొత్తం ఖర్చు వివరాలు సమాచార హక్కు (ఆర్టిఐ) చట్టం 2005 యొక్క సెక్షన్ 4 (1) (బి) కింద స్వచ్ఛంద ప్రకటన. కింద: https://www.pmindia.gov.in/ ->సమాచార హక్కు (ఆర్టిఐ) (డ్రాప్ డౌన్ మెనూ) -> సమాచార హక్కు (ఆర్టిఐ) చట్టం 2005 యొక్క సెక్షన్ 4 (1) (బి) కింద స్వచ్ఛంద ప్రకటన లో ఉంటాయి |
| సి. ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) | ||
| 12 | ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుండి నేను నా వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయాన్ని ఏ విధంగా పొందవచ్చు ? | వైద్య చికిత్స/శస్త్రచికిత్స కోసం ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి ఆర్థిక సహాయం మంజూరు కోసం ప్రధాన మంత్రిని అర్థిస్తూ ప్రభుత్వ ఆస్పత్రి/ పిఎమ్ఎన్ఆర్ఎఫ్ గుర్తించిన జాబితా లోని ప్రైవేటు ఆస్పత్రులలో ఒక సాధారణ దరఖాస్తు సమర్పిస్తే చాలు. దీంతో పాటు వైద్య ధ్రువీకరణ పత్రం/చికిత్స చేసే ఆస్పత్రి నుండి ఖర్చు అంచనా పత్రం, కుటుంబ వార్షికాదాయ ధ్రువీకరణ పత్రం జత చేయాలి. పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి ఆర్థిక సహాయంపై మార్గదర్శకాలు పిఎమ్ఒ వెబ్ సైట్ www.pmindia.nic.in లోను, ఇంకా https://pmnrf.gov.in వెబ్సైట్ లోనూ లభ్యమవుతాయి. |
| 13 | ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం పొందిన వ్యక్తుల వివరాలను అందించగలరని ప్రార్థిస్తున్నాను.
ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం కింద శ్రీ/శ్రీమతి………….గారికి ఇచ్చిన మొత్తం ఎంతో దయచేసి వెల్లడిస్తారా ? |
కోరిన సమాచారం పూర్తిగా వ్యక్తిగతం. దీనిని మూడో పక్షానికి వెల్లడించడం వ్యక్తి (వ్యక్తుల) తాలూకు గోప్యతకు అవాంఛనీయ రీతిలో భంగం కలిగించే ప్రమాదం ఉంది. అదీ కాక, ఆర్ టిఐ చట్టం లోని సెక్షన్ 8(1) (జె) లో భాగంగా మినహాయింపు కూడా వర్తిస్తుండడం చేత, ఈ సమాచారం అందజేయడం వీలుకాదు. |
| 14 | ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధికి రాబడి, ఖర్చు వివరాలను సంవత్సరాలవారీగా వెల్లడించండని కోరుతున్నాను . | ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి కి సంబంధించిన ఆదాయం, ఖర్చు వివరాలన్నీ ప్రధాన మంత్రి కార్యాలయ వెబ్సైట్ అయిన www.pmindia.gov.in తో పాటు https://pmnrf.gov.in వెబ్సైట్ లోనూ లభ్యమవుతాయి. |
| డి. సమాచార హక్కు చట్టం- 2005 లో భాగంగా దరఖాస్తులు, తొలి నివేదనలు | ||
| 15 | పిఎమ్ ఒ లోని సిపిఐఒ ను సంప్రతిచేందుకు ఆ అధికారి వివరాలు ఇవ్వగలరని ప్రార్థన . | సెంట్రల్ పబ్లిక్ ఇన్ ఫర్ మేషన్ ఆఫీసర్,
ప్రధాన మంత్రి కార్యాలయం, సౌత్ బ్లాక్, న్యూ ఢిల్లీ- 110011 టెలిఫోన్ : 011-23382590 ఫ్యాక్స్ నం : 011-23388157 ఇ-మెయిల్ : rti-pmo.applications[at]gov[dot]in |
| 16 | సమాచార హక్కు చట్టం లో భాగంగా పిఎమ్ఒ యొక్క అపెలిట్ అథారిటీ ని సంప్రతించేందుకు ఆ అధికారి వివరాలు ఇవ్వగలరని ప్రార్థన .
సమాచార హక్కు చట్టంలో భాగంగా నా తొలి నివేదనను పిఎమ్ఒ లో ఎవరికి ఇవ్వాలి ? |
డైరెక్టర్ (R)
ప్రధాన మంత్రి కార్యాలయం, సౌత్ బ్లాక్, న్యూ ఢిల్లీ-110011 టెలిఫోన్ : 011-23074072 (O) ఫ్యాక్స్ నం: 011-23388157/23019545/23016857 ఆర్ టి ఐ నివేదనల కోసం ఇ-మెయిల్ ఐడి: rti[dot]appeal[at]gov[dot]in |
| 17 | పిఎమ్ఒ నుండి సమాచారం పొందడం కోసం పౌరులకు ఏయే సదుపాయాలు ఉన్నాయి ?
పిఎమ్ఒ నుండి సమాచారం పొందేందుకు ఉన్న పద్ధతి ఏమిటి ? |
దీనికి సంబంధించిన వివరాలు పిఎమ్ఒ వెబ్సైట్ : https://www.pmindia.gov.in/ -> సమాచార హక్కు ( డ్రాప్ డౌన్ మెనూ నుండి) ->సమాచారాన్ని పొందే విధానంలో లభ్యమవుతాయి.
పిఎంఓ : https://www.pmindia.gov.in-> సమాచార హక్కు ( డ్రాప్ డౌన్ మెనూ నుండి)-> లో ఇచ్చిన సమాచారం అడిగేవారి(ఆర్టిఐ దరఖాస్తుదారుల)కి ముఖ్యమైన సలహాను పరిశీలించవలసిందిగా కూడా దరఖాస్తుదారులకు సూచించడమైంది. |
| ఈ. ఇతర సమాచారం | ||
| 18 | ../../….(తేదీ/నెల/ సంవత్సరం) నాడు నిర్వహించిన ‘ప్రగతి’ (పిఆర్ఎజిఎటిఐ) సమావేశ నిర్ణయం వివరాల నకలును దయచేసి అందించగలరు .
‘ప్రగతి’ సమావేశంలో …………. కు సంబంధించిన అంశంపై తీసుకున్న నిర్ణయం (నిర్ణయాల) వివరాలను దయచేసి అందించగలరు . |
‘ప్రగతి’ సమావేశాల నిర్ణయాల తాలూకు వివరాలు www.pragati.nic.in వెబ్సైట్లో లభ్యమవుతాయి.. |
| 19 | గౌరవనీయులైన ప్రధాన మంత్రి చేసిన ప్రకటనల వివరాలు దయచేసి అందించగలరు . | ప్రధాన మంత్రి వివిధ సందర్భాలలో అనేక ప్రకటనలు/ప్యాకేజీలను ప్రకటించారు. ఇవన్నీ ప్రధాన మంత్రి ప్రసంగాలలో భాగం కాబట్టి వాటి సమాచారమంతా పిఎమ్ఒ వెబ్సైట్ లోని (link: https://pmindia.gov.in/en/tag/pmspeech/) లింకు లో లభ్యమవుతాయి. |
| 20 | గౌరవనీయులైన ప్రధాన మంత్రి ……….. సందర్భంగా చేసిన ప్రసంగం నకలును దయచేసి అందించగలరు .
గౌరవనీయులైన ప్రధాన మంత్రి ../../….(తేదీ/నెల /సంవత్సరం)నాడు …………..లో చేసిన ప్రసంగం పాఠాన్ని దయచేసి అందించగలరు . |
ప్రధాన మంత్రి ప్రసంగాలన్నీ పిఎమ్ఒ వెబ్సైట్ లోని (link: https://pmindia.gov.in/en/tag/pmspeech/)లింకు లో లభ్యమవుతాయి. | వరుస సంఖ్య | ప్రశ్న | జవాబు |
|---|---|---|