పిఎంఇండియా
నేడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఘన నివాళులు అర్పించారు. పూలేను ఒక దార్శనిక సామాజిక సంస్కర్తగా అభివర్ణించిన ప్రధాని.. ఆయన తన జీవితాన్ని సమానత్వం, న్యాయం, విద్య వంటి ఉన్నత ఆశయాల కోసమే అంకితం చేశారని కొనియాడారు.
మహిళలు, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడటంలో మహాత్మా పూలే ఒక మార్గదర్శిగా నిలిచారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. తన నిరంతర కృషి ద్వారా విద్యను మహిళల సాధికారతకు ఒక శక్తిమంతమైన సాధనంగా మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఈ సంవత్సరం ఆ మహానీయ సంస్కర్త 200వ జయంతి వేడుకలు ప్రారంభం కావడం అత్యంత విశేషమని అన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి ఒక ప్రత్యేక వ్యాసాన్ని కూడా రాశారు. మహాత్మా పూలే నేటికీ అనేక మందికి మార్గదర్శిగా నిలుస్తున్నారన్నారు. విద్య, అభ్యసనం, అందరి సంక్షేమం కోసం ఆయన ఇచ్చిన ప్రాధాన్యత నేటి కాలంలో ఎంతగానో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని తెలిపారు. సమాజ ప్రగతికి పూలే ఆలోచనలు మనందరికీ నిరంతరం దిశానిర్దేశం చేయాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా.. సమానత్వం, న్యాయం, విద్య అనే ఆదర్శాల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆ దార్శనిక సంఘ సంస్కర్తకు ఘన నివాళులర్పిస్తున్నాను. మహిళలు, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణలో ఆయన ఒక మార్గదర్శిగా నిలిచారు. ఆయన చేసిన కృషి ఫలితంగా విద్య సాధికారతకు ఒక శక్తిమంతమైన సాధనంగా రూపుదిద్దుకుంది. ఈ సంవత్సరం ఆయన 200వ జయంతి ఉత్సవాల ప్రారంభాన్ని మనం జరుపుకుంటున్నాం. సామాజిక ప్రగతి దిశగా సాగే ప్రస్థానంలో ఆయన ఆలోచనలు ప్రతి ఒక్కరికీ నిరంతరం దిశానిర్దేశం చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను.’’
మహాత్మా ఫూలే 200వ జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతున్న ఈ తరుణంలో.. ఆయన ఎందరో వ్యక్తులకు ఏ విధంగా మార్గదర్శిగా నిలుస్తున్నారు, విద్య, అభ్యాసనం, సర్వజన సంక్షేమంపై ఆయన కనబరిచిన ప్రాధాన్యత నేటి యుగానికి ఎంతటి సంబంధం కలిగి ఉన్నాయనే అంశాలపై నా భావాలను వ్యాసంలో రాశాను.’’
గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా ఫూలే 200వ జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఆయన తన జీవితమంతా విద్య, జ్ఞానం, ప్రజా సంక్షేమానికి అంకితం చేశారు. నేటికీ కోట్లాది దేశవాసులకు ఆయన ఎలా స్ఫూర్తిగా నిలిచారనే విషయాలపై నా ఆలోచనలను ఈ వ్యాసంలో పొందుపరిచాను.’’
***
On the birth anniversary of Mahatma Jyotirao Phule, paying tributes to a visionary social reformer who dedicated his life to the ideals of equality, justice and education. He was also a pioneer in championing the rights of women and the marginalised. Through his efforts,…
— Narendra Modi (@narendramodi) April 11, 2026
महात्मा ज्योतिराव फुले यांच्या जयंतीदिनी, समता, न्याय आणि शिक्षण या मूल्यांसाठी आपले जीवन समर्पित करणाऱ्या या द्रष्ट्या समाजसुधारकाला अभिवादन करतो. महिला आणि उपेक्षितांच्या हक्कांचा लढा सुरु करणारेही तेच होते. त्यांच्या प्रयत्नांमुळे शिक्षण हे सक्षमीकरणाचे एक शक्तिशाली साधन बनले.…
— Narendra Modi (@narendramodi) April 11, 2026
As we begin the 200th birth anniversary celebrations of Mahatma Phule, penned a few thoughts on how he is a guiding light for several people and how his emphasis on education, learning and welfare of all are relevant in today’s age.https://t.co/Q7cY1mB8k3
— Narendra Modi (@narendramodi) April 11, 2026
आपण महात्मा फुले यांच्या जयंतीच्या द्विशताब्दी वर्षात पाऊल ठेवत असल्याच्या पार्श्वभूमीवर, ते कशा प्रकारे अनेक लोकांसाठी मार्गदर्शक दीपस्तंभ ठरले आहेत तसेच त्यांनी शिक्षण, अध्ययन आणि सर्वांच्या कल्याणावर दिलेला भर आजच्या युगातही कसा समर्पक आहे, याबद्दलचे काही विचार लेखणीतून उतरवले…
— Narendra Modi (@narendramodi) April 11, 2026
महान समाज सुधारक महात्मा फुले की 200वीं जयंती वर्ष के समारोहों का शुभारंभ हो रहा है। उन्होंने अपना पूरा जीवन शिक्षा, ज्ञान और जन कल्याण को समर्पित कर दिया। वे कैसे आज भी करोड़ों देशवासियों के लिए प्रेरणापुंज बने हुए हैं, इसी को लेकर मैंने इस आलेख में अपने विचार रखे हैं।…
— Narendra Modi (@narendramodi) April 11, 2026