పిఎంఇండియా
సౌర శక్తి సామర్థ్యాన్ని పెంచుకోవడంలో వార్షిక ప్రాతిపదికన ఇంతవరకు ఎన్నడూ లేనంత అత్యధిక స్థాయిని భారత్ అందుకొన్నట్లు తెలిపిన వ్యాసాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషీ చెప్పిన ప్రకారం, పునరుత్పాదక ఇంధన రంగంలో ఇది చెప్పుకోదగ్గ ప్రగతి ప్రస్థానం అని ప్రధాని వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ,
‘‘కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషీ అంటున్నట్లు, సౌర శక్తి సామర్థ్యాన్ని ఇదివరకు ఏ సంవత్సరంలో ఎరుగనంత ఎక్కువ స్థాయిలో భారత్ పెంచుకొంది’’ అని పేర్కొన్నారు.
***
India records highest-ever annual solar capacity addition, says Union Minister Shri @JoshiPralhadhttps://t.co/GF6bhiI6Xp
— PMO India (@PMOIndia) April 10, 2026
via NaMo App pic.twitter.com/PnBAWkEBrj