Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అండ‌మాన్ అండ్‌ నికోబార్ ఐలాండ్స్ అనాట‌మీ రెగ్యులేష‌న్‌, 2016 ప్ర‌క‌ట‌న‌


అండ‌మాన్ అండ్‌ నికోబార్ ఐలాండ్స్ అనాట‌మీ రెగ్యులేష‌న్‌, 2016 ప్ర‌క‌ట‌న‌కు కేంద్ర మంత్రి మండ‌లి ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త వ‌హించారు. ఎవ‌రూ క్లెయిమ్ చేయ‌డానికి ముందుకు రాని మృత దేహాల‌ను అన్ని వైద్య వ్య‌వ‌స్థ‌లలోను మాన‌వ శ‌రీర నిర్మాణ అధ్య‌య‌నం కోసం వైద్య క‌ళాశాల‌కు అంద‌జేసేందుకు విధి విధానాల‌ను రూపొందించ‌డం కోసం ఈ అండ‌మాన్ అండ్‌ నికోబార్ ఐలాండ్స్ అనాట‌మీ రెగ్యులేష‌న్‌, 2016ను తీసుకు వ‌చ్చారు.

పూర్వ రంగం :

అండ‌మాన్ మ‌రియు నికోబార్ దీవుల పాల‌నా యంత్రాంగం పోర్ట్ బ్ల‌య‌ర్ లో జి.బి. పంత్ హాస్పిట‌ల్ స్థాయిని పెంచ‌డం ద్వారా 100 ప‌డ‌క‌ల వైద్య క‌ళాశాల‌ను ఏర్పాటు చేసింది. కొత్త‌గా ఆరంభ‌మైన అండ‌మాన్ అండ్ నికోబార్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్స్ 2015 సెప్టెంబ‌ర్ 1న మొద‌లైన ఎంబిబిఎస్ కోర్సు ఒక‌ట‌వ సంవ‌త్స‌రం విద్యార్థుల ప్ర‌వేశ ప్ర‌క్రియ‌ను పూర్తి చేసి, త‌ర‌గ‌తుల నిర్వ‌హ‌ణ‌ను ఆరంభించింది.