Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాలకు వినియోగించుకోవడంలో సహకారం కోసం భారతదేశం, బాంగ్లాదేశ్ ల మధ్య సంతకాలైన ఎమ్ఒయు మంత్రివర్గం దృష్టికి


అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాలకు వినియోగించుకోవడంలో సహకారం కోసం భారతదేశం, బాంగ్లాదేశ్ ల మధ్య కుదిరిన అవగాహనపూర్వక ఒప్పంద పత్రాన్ని (ఎమ్ఒయు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఎమ్ఒయు పై 2017 ఏప్రిల్ లో న్యూ ఢిల్లీలో సంతకాలయ్యాయి.

అంతరిక్ష సంబంధ శాస్త్ర విజ్ఞానం, రిమోట్ సెన్సింగ్ ఆఫ్ అర్త్, శాటిలైట్ కమ్యూనికేషన్, ఇంకా ఉపగ్రహ ఆధారిత మార్గదర్శనం సహా సాంకేతిక శాస్త్ర విజ్ఞానం మరియు అప్లికేషన్ లు, స్పేస్ సైన్స్ అండ్ ప్లానెటరీ ఎక్స్ ప్లొరేషన్, స్పేస్ క్రాఫ్ట్, స్పేస్ సిస్టమ్స్ మరియు గ్రౌండ్ సిస్టమ్ ల వినియోగం, అప్లికేషన్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ వంటి రంగాలలో సహకారానికి ఈ ఎమ్ఒయు తోడ్పడనుంది.

అంతరిక్ష విభాగం/ భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (డిఒఎస్/ ఐఎస్ఆర్ఒ), మరియు బాంగ్లాదేశ్ టెలికమ్ రెగ్యులేటరీ కమిషన్ (బిటిఆర్ సి) ల సభ్యులతో కూడిన ఒక జాయింట్ వర్కింగ్ గ్రూపు ఏర్పాటుకు ఎమ్ఒయు బాట వేస్తుంది. అలా ఏర్పడే జాయింట్ వర్కింగ్ గ్రూపు ఈ ఎమ్ఒయు అమలుకు మార్గాలను, ఒక కాలావధితో సహా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తుంది.

భూమి యొక్క రిమోట్ సెన్సింగ్ రంగంలోనే కాక ఉపగ్రహ వార్తాప్రసారం, ఉపగ్రహ మార్గనిర్దేశకత్వం, అంతరిక్ష సంబంధ శాస్త్ర విజ్ఞానం మరియు అంతరిక్షంలో అన్వేషణ రంగాలలోనూ కొత్త కొత్త పరిశోధక కార్యకలాపాలను, అప్లికేషన్ రీతులను అన్వేషించడానికి ఎమ్ఒయు ఊతాన్ని అందించగలదు.

ఎమ్ఒయు లో భాగంగా చేపట్టే పనులకు ఆర్థిక సహాయాన్ని సంబంధిత పనులను నిర్వహించే సంస్థ సమకూర్చవలసివుంటుంది. ఆయా దేశాలలో అమలయ్యే బడ్జెట్ సంబంధిత నిబంధనల తాలూకు నియమావళికి మరియు అందుబాటులో ఉన్న వనరుల పరిమితులకు లోబడి ఈ ఆర్థిక సహాయాన్ని అందజేయాల్సివుంటుంది. ఈ ఎమ్ఒయులో భాగంగా చేపట్టే సంయుక్త పథకాలు, పనులు ఆయా కార్యకలాపాల రకం యొక్క మరియు సంబంధిత రంగం యొక్క వాణిజ్య లేదా వాణిజ్యేతర ప్రాతిపదికన చేపట్టేందుకు వీలు ఉంటుంది. అంతే కాక ఈ పథకాలను, పనులను పరస్పర చెల్లింపులు జరపకుండా గాని, లేదా పరిహారపూర్వక సర్దుబాట్లు లేదా కాంట్రాక్టుల ఆధారంగా గాని అమలుపరచాల్సివుంటుంది.

అంతరిక్ష సంబంధిత సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానాన్ని మానవాళి ప్రయోజనార్థం ఉపయోగించడంలో సంయుక్త కార్యకలాపాలను అభివృద్ధిపరచేందుకు ఈ ఎమ్ఒయు దోహదపడనుంది. ఈ రకంగా దేశంలో అన్ని వర్గాలకు మరియు ప్రాంతాలకు మేలు జరుగుతుంది.

పూర్వ రంగం:

అంతరిక్ష రంగంలో ఒకదానితో మరొకటి సహకరించుకొనేందుకు భారతదేశం, బాంగ్లాదేశ్ లు ఆసక్తిని వ్యక్తం చేశాయి. తదనుగుణంగా, అంతరిక్ష రంగంలో సహకారానికి గాను ఎమ్ఒయు ఫ్రేమ్ వర్క్ యొక్క నమూనాను భారతీయ హై కమిషన్ బాంగ్లాదేశ్ కు మరియు ఎమ్ఇఎ కు 2016 ఆగస్టు లో అందజేసింది. ప్రభుత్వ స్థాయిలో మరింత ముందుకు వెళ్లడానికిగాను ఈ పని చేయడమైంది. 2016 డిసెంబరు లో బాంగ్లాదేశ్ తన ఏకీభావాన్ని వ్యక్తంచేసింది. దీనితో 2017 ఏప్రిల్ 8వ తేదీన న్యూ ఢిల్లీ లో, అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాల కోసం వినియోగించుకోవడంలో సహకారానికి ఉద్దేశించిన ఒక ఎమ్ఒయు పైన సంతకాలు జరిగాయి.