పిఎంఇండియా
సమకాలీన అంతర్జాతీయ స్థితిగతులు – భారత దేశానికున్న అవకాశాలు అనే అంశం పై రేపు ఉదయం న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు.
క్యాబినెట్ మంత్రులు, ఆర్ బీ ఐ, పారిశ్రామిక వర్గాలు, ప్రధాన బ్యాంకర్లు, ఆర్థిక రంగ నిపుణులు, వివిధ రంగాల నిపుణులు, ఉన్నత స్థాయి అధికారులతో కూడిన 40 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరౌనున్నారు.
సమకాలీన ఆర్థిక స్థితిగతులు, వాటిని భారత దేశం వినియోగించుకునే విధానాలపై ఈ కార్యక్రమంలో విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది.