Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అందరికీ క్షేమం, జ్ఞానం, హితం కలగాలని కోరుతున్న ఓ సంస్కృ‌త సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


అందరికీ శ్రేయస్సుశుభాలుసురక్షశాంతిజ్ఞానంహితం కలగాలని ఆకాంక్షిస్తున్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారుభగవాన్ ఇంద్రుడుభగవాన్ సూర్యుడుభగవాన్ గరుడుడుభగవాన్ బృహస్పతిల ఆశీర్వాదాలు లభించాలనే అభ్యర్థన ఈ సుభాషితంలో ఇమిడి ఉంది.
‘‘
స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః
స్వస్తి నః పూషా విశ్వవేదాః
స్వస్తి నస్తాక్షర్యో అరిష్టనేమిః
స్వస్తి నో బృహస్పతిర్దధాతు’’ అనే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు.
ఈ సుభాషితం ‘‘యశోవంతుడు భగవాన్ ఇంద్రుడు మనకు శ్రేయాన్ని అనుగ్రహించుగాకయావత్తు విశ్వానికీ సాక్షీభూతుడూఅన్ని ప్రాణులను పోషించే వాడూ అయిన భగవాన్ సూర్యుడు మనకు శుభాలను ప్రసాదించు గాకవిఘ్న వినాశకుడైన భగవాన్ గరుడుడు మన అందరినీ రక్షించుగాకబుద్ధికి అధిపతి అయిన భగవాన్ బృహస్పతి శాంతినీవివేకాన్నీహితాన్నీ తన ఆశీస్సుల రూపంలో మనకు అందించు గాక’’ అనే సందేశాన్ని సూచిస్తున్నది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘
స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః
స్వస్తి నః పూషా విశ్వవేదాః
స్వస్తి నస్తాక్షర్యో అరిష్టనేమిః
స్వస్తి నో బృహస్పతిర్దధాతు’’ అని పేర్కొన్నారు.

 

***