పిఎంఇండియా
ప్రకృతి చూపే అపార కృపతోనూ, సూర్య దేవుని శక్తితోనూ, వర్షాలు అందించే పవిత్ర ఆశీస్సులతోనూ మన జీవితాల్లో సుఖ సమృద్ధులు కలుగుతాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేస్తూ, ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ఈ రోజు పంచుకున్నారు. భూమి సదా చైతన్య పూరితంగా, పచ్చదనంతో కళకళలాడుతూ, సమృద్ధంగా వర్ధిల్లాలని శ్రీ మోదీ నిండు మనసుతో ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘ప్రకృతి అపార కృప, సూర్యదేవుని శక్తి.. వీటితో పాటు వర్షాల పవిత్ర ఆశీర్వాదం కూడా మన అందరి జీవితాల్లో సుఖాన్నీ, సౌభాగ్యాన్నీ అందించి సమృద్ధం చేస్తున్నాయి. పచ్చదనమూ, సమృద్ధీ భూమి మీద ఎప్పటికీ విలసిల్లాలని కోరుకుంటున్నాను.
శం నో దేవః సవితా త్రాయమాణః శం నో భవన్తూషసో విభాతీః
శం నః పర్జన్యో భవతు ప్రజాభ్యః శం నః క్షేత్రస్య పతిరస్తు శంభుః’’ అని పేర్కొన్నారు.
పైన పేర్కొన్న సుభాషితానికి.. ప్రపంచాన్ని తేజస్సుతో రక్షిస్తున్న సూర్య భగవానుడు మనకు శుభాలు కలుగజేయు గాక; ప్రకాశమయ ప్రభాతాలు మన జీవితాల్లో సంతోషాన్ని, సంక్షేమాన్ని ప్రసాదించు గాక; వర్ష దేవత పర్జన్య మనకు సమృద్ధిని ప్రదానం చేయు గాక. పొలాలూ, పంటలూ, భూమీ.. వీటి యజమాని దయాదృష్టి మనకు సుఖ, సమృద్ధుల్ని అందించు గాక.. అని అర్థం.
****
प्रकृति की असीम कृपा, सूर्यदेव की ऊर्जा और वर्षा का पावन आशीर्वाद हम सभी के जीवन को सुख-सौभाग्य से समृद्ध करता है। मेरी कामना है कि धरती पर सदैव हरियाली और खुशहाली बनी रहे।
— Narendra Modi (@narendramodi) May 25, 2026
शं नो देवः सविता त्रायमाणः शं नो भवन्तूषसो विभातीः।
शं नः पर्जन्यो भवतु प्रजाभ्यः शं नः क्षेत्रस्य… pic.twitter.com/T2xock0Kjc