Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అక్టోబరు 8న ఇండియా మొబైల్ కాంగ్రెస్‌ (ఐఎంసి) 10వ మహాసభకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీకారం


న్యూఢిల్లీలోని యశోభూమి వేదికగా ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 10వ మహాసభకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, అక్టోబరు 8న ఉదయం సుమారు 10 గంటలకు శ్రీకారం చుడతారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతినిధులు, సభికులనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.

“అవధుల్లేని విస్తరణ” ఇతివృత్తంగా టెలికమ్యూనికేషన్స్ విభాగం (డీఓటీ), సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) సంయుక్తంగా నిర్వహించే ఈ మహాసభ వాస్తవంగా ఇవాళ మొదలై  10వ తేదీ వరకూ కొనసాగుతుంది. డిజిటల్ ఆవిష్కరణలు, భావితరం సంధానం, సాంకేతికాధారిత వృద్ధిలో భారత్‌ సామర్థ్యం ఇనుమడించడాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.

ఈ మహాసభకు– “సృష్టి: భవిష్యత్తుకు రూపకల్పన, సంవర్ధన్: వృద్ధికి నవ్యోత్తేజం, సశక్త్: అవకాశాల విస్తరణ, సురక్ష: విశ్వసనీయత బలోపేతం” నాలుగు కీలక మూలస్తంభాలుగా ఉంటాయి. ఇది ఆవిష్కరణలు, భవిష్యత్తరం డిజిటల్ మౌలిక సదుపాయాలు, సాంకేతికత ఆధారిత ఆర్థిక వృద్ధి, సమ్మిళిత డిజిటల్ సౌలభ్యం, సురక్షిత–పటిష్ట డిజిటల్ వ్యవస్థల రూపకల్పనపై ఈ మహాసభ దృష్టి సారిస్తుంది. డిజిటల్ వ్యవస్థ అంతటా ఉద్భవిస్తున్న అవకాశాల అన్వేషణ దిశగా ప్రపంచ సాంకేతిక అగ్రగాములు, విధాన రూపకర్తలు, పరిశ్రమ నిపుణులు, అంకురాలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలను ఐఎంసీ-2026 ఒకే వేదికపైకి తెస్తుంది.

ఐదో తరం, 6వ తరం, భవిష్యత్‌ ఏఐ నెట్‌వర్కులు, సెమీకండక్టర్లు, నాన్–టెరెస్ట్రియల్ నెట్‌వర్కులు, సైబర్ భద్రత, క్వాంటం కమ్యూనికేషన్, వాణిజ్య సంస్థల రూపాంతరీకరణ, వర్తుల ఆర్థిక వ్యవస్థ, ఈఎస్‌జీ, ఎలక్ట్రానిక్స్ తయారీ సహా 9 నిర్దిష్ట పునాదులుగల రంగాలు ఈ మహాసభలలో ప్రధాన చర్చనీయాంశాలుగా ఉంటాయి. మరోవైపు ఈ కార్యక్రమంలో భాగంగా అత్యధునిక రవాణా, డియం అనుభవాలు, పారిశ్రామిక రోబోటిక్స్, రవాణా సాంకేతికత అనే నాలుగు కొత్త రంగాలకూ ఈ మహాసభ విస్తరిస్తుంది.

అసారి సైన్స్‌ కాంగ్రెస్‌లో 100కు పైగా దేశాల నుంచి 1.5 లక్షల మంది పాలుపంచుకుంటారని అంచనా. వీరిలో 500 మందికిపైగా భాగస్వాములు, ప్రదర్శన సంస్థలు, 600కు పైగా అంకుర సంస్థలు, 900 మందికిపైగా నిపుణ మేధావులు ఈ మహాసభలకు హాజరవుతారని అంచనా. ఇక సుమారు 2,000 దాకా సాంకేతిక పరిజ్ఞాన వినియోగ నిదర్శనాలపై 120కి పైగా చర్చాగోష్ఠులలో విశ్లేషణ సాగుతుంది.

 

***