పిఎంఇండియా
అత్యధునాతనమైన సూపర్ స్పెషాలిటీ పబ్లిక్ హాస్పిటల్ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసర్చ్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అహమదాబాద్ లో నేడు ప్రారంభించారు. ఒక ఎయిర్ ఆంబులెన్స్ తో పాటు అన్ని ఆధునిక సౌకర్యాల తో కూడిన 1500 పడకలున్న ఈ ఆసుపత్రి ని అహమదాబాద్ నగర పాలక సంస్థ 78 మీటర్ల ఎత్తయిన భవనం లో నిర్మించింది.
ఆసుపత్రి లోని సదుపాయాల ను ప్రధాన మంత్రి పరిశీలించారు. ప్రపంచ శ్రేణి ఆసుపత్రి ని నెలకొల్పడం కోసం అహమదాబాద్ నగర పాలక సంస్థ చేసిన కృషి ని ఆయన హర్షించారు. ‘‘అహమదాబాద్ లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసర్చ్ ఆసుపత్రి దేశం లో ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల కు ఒక ఆదర్శ ఆసుపత్రి గా రుజువవుతుంద’’ని ఆయన అన్నారు.
750 కోట్ల రూపాయల వ్యయం తో, 17 అంతస్తుల లో నిర్మితమైన ఆసుపత్రి తక్కువ ఖర్చు లో ప్రపంచ శ్రేణి సేవల ను అందిస్తుంది. అంతేకాక దీని ని ‘ఆయుష్మాన్ భారత్’తో జోడించడమైంది. ఈ సందర్భం గా శ్రీ మోదీ సభికుల ను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ‘ఆయుష్మాన్ భారత్’ యొక్క ప్రాముఖ్యాన్ని గురించి వివరించారు. ‘‘ ‘ఆయుష్మాన్ భారత్’ వల్లనే చిన్న పట్టణాల లో సైతం నూతన ఆసుపత్రుల ఆవశ్యకత హెచ్చుతోంది. కొత్త ఆసుపత్రులు త్వరిత గతి న ఆరంభమవుతున్నాయి. వైద్యుల కు, పారామెడికల్ సిబ్బంది కి డిమాండు పెరుగుతోంది. తద్వారా ఆరోగ్య సంరక్షణ రంగం లో అనేక ఉద్యోగావకాశాలు యువతీయువకుల కు ఏర్పడనున్నాయ’’ని ప్రధాన మంత్రి అన్నారు.
గడచిన నాలుగు సంవత్సరాల కాలం లో ఆరోగ్య సంరక్షణ సదుపాయాల లో మరియు వైద్య విద్య లో ప్రధానమైన విస్తరణ చోటుచేసుకొందని, పౌరుల ఆరోగ్య సంరక్షణ అవసరాల ను నెరవేర్చడం లో ఇది ఎంతగానో సహాయకారి కాగలదని ప్రధాన మంత్రి చెప్పారు.
పేదల పట్ల శ్రద్ధ తీసుకోవడం, వారి ఇక్కట్టులను తీర్చడం అనే అంశాలు తెర మీదకు వచ్చాయని ప్రధాన మంత్రి తెలిపారు. ‘‘ప్రభుత్వం పేదల పక్షాన నిలబడుతుంది. వారి పట్ల ప్రభుత్వాని కి ఉన్న ప్రాథమ్యం ఆరోగ్య సంరక్షణ సేవల విస్తరణ లో ప్రతిబింబిస్తోంది. అంతేకాదు, జనరిక్ ఔషధాల ను ‘ప్రధాన మంత్రి జన ఔషధి యోజన’ లో భాగం గాతక్కువ ధరల కు సమకూర్చడం జరుగుతోంది. ప్రధాన మంత్రి జన ఔషధి కేంద్రాలు దేశం అంతటా దాదాపు 5000 సంఖ్య లో ఏర్పాటయ్యాయి’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
అందరికీ సమానావకాశాల ను కల్పించే దిశ గా తన ప్రభుత్వం దీక్షాబద్ధురాలై ఉందని, జనరల్ కేటగిరీ పేదల కు 10 శాతం రిజర్వేశన్ ఈ దిశగా వేసినటువంటి ఒక ముందంజ అని ప్రధాన మంత్రి అన్నారు. ఇందుకోసం విద్యా సంస్థల లో సీట్ల సంఖ్య ను 10 శాతం మేర పెంచడం జరుగుతోందని తెలిపారు. జనరల్ కేటగిరీ పేదల కు ప్రభుత్వ ఉద్యోగాల లో, విద్యా సంస్థల లో 10 శాతం రిజర్వేశన్ కల్పించాలన్న నిర్ణయాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం గా నిలచినందుకు గుజరాత్ ప్రభుత్వాన్ని ప్రధాన మంత్రి కొనియాడారు.
గుజరాత్ ను తాను సందర్శించడం కొత్త సంవత్సరం లో ఇది మొదటి సారి అని, ప్రస్తుతం పండుగల కాలం లో ఇది చోటు చేసుకొందని చెప్తూ, అహమదాబాద్ ప్రజల కోసం ఒక పెద్ద ఆరోగ్య సంరక్షణ నిలయాన్ని అంకితం చేసేందుకు ఇంత కన్నా మంచి సమయం మరేది ఉంటుందంటూ ప్రధాన మంత్రి చమత్కరించారు. ఈ తరహా ప్రపంచ శ్రేణి ఆరోగ్య రక్షణ సదుపాయం తో ముందుకు వచ్చిన నగరపాలక సంస్థ లు దేశం లో అతి కొద్దే ఉన్నాయని ఆయన అన్నారు. అహమదాబాద్ పురపాలకాధ్యక్షుని గా ఆరోగ్యం, ఆరోగ్య రక్షణ మరియు పరిశుభ్రత ల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఒక ఉదాహరణ వలే నేతృత్వాన్ని అందిస్తూ సర్దార్ పటేల్ గారు పోషించిన పాత్ర ను ప్రధాన మంత్రి ప్రశంసించారు.
ప్రధాన మంత్రి కార్యక్రమం లో తన ప్రసంగం ముగింపు లో- అందరికీ సమాన అవకాశాన్ని కల్పించడం తో పాటు అభివృద్ధి కి కట్టుబడాలన్న సంకల్పాని కి అనుగుణం గా సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ అనేది ‘న్యూ ఇండియా’ ఆవిష్కారాని కి అనుసరించవలసిన మార్గం- అని స్పష్టం చేశారు.
750 करोड़ रुपए की लागत से बना सरदार वल्लभ भाई पटेल इंस्टीट्यूट ऑफ मेडिकल साइंस एंड रिसर्च आपकी सेवा के लिए समर्पित है।
— PMO India (@PMOIndia) January 17, 2019
इस विश्वस्तरीय अस्पताल के लिए आप सभी को बहुत-बहुत बधाई: PM
ये अस्पताल देश में सरकारी अस्पतालों के लिए एक मॉडल सिद्ध होने वाला है।
— PMO India (@PMOIndia) January 17, 2019
यहां के कमरे हों या फिर पूरा कैंपस, आधुनिकता और पर्यावरण का पूरा ध्यान रखा गया है।
1500 बेड वाला ये अस्पताल अहमदाबाद की स्वास्थ्य सुविधाओं को उच्च स्तर पर ले जाने वाला है: PM
सरकारी अस्पतालों में जाने से लोग बचते थे और प्राइवेट अस्पतालों में इलाज कर पाना सिर्फ साधन संपन्न लोगों के ही बस में था। ये देखकर बड़ी पीड़ा होती थी
— PMO India (@PMOIndia) January 17, 2019
इसी स्थिति से बाहर निकालने के लिए सरकार ने अनेक फैसले लिए थे
नए सरकारी अस्पताल बनवाने, नए मेडिकल कॉलेज बनवाने पर जोर दिया: PM
बीते चार वर्ष में स्वास्थ्य सुविधाओं के साथ-साथ मेडिकल एजुकेशन का भी अभूतपूर्व विस्तार किया गया है।
— PMO India (@PMOIndia) January 17, 2019
इस दौरान 18 हज़ार से अधिक MBBS और 13 हज़ार से ज्यादा पोस्ट ग्रेजुएट सीटें बढ़ाई गई हैं। यहां गुजरात में भी हज़ारों नई सीटें जोड़ी गई हैं: PM
आयुष्मान भारत जैसी योजना के कारण छोटे-छोटे कस्बों में भी ज़रूरत बढ़ रही है, नए अस्पताल भी तेज़ी से खुल रहे हैं,
— PMO India (@PMOIndia) January 17, 2019
नए अस्पताल खुल रहे हैं, तो डॉक्टरों और पैरामेडिक स्टाफ की भी मांग बढ़ रही है,
युवाओं के लिए रोज़गार के अनेक अवसर हेल्थ सेक्टर में आने वाले समय में बनने वाले हैं: PM
The Sardar Vallabhbhai Patel Institute of Medical Sciences and Research is an excellent public hospital, which will strengthen the efforts to provide quality healthcare to the poor.
— Narendra Modi (@narendramodi) January 17, 2019
Am glad to have inaugurated the hospital and seen parts of it. pic.twitter.com/Fbt0pwVxH7
For a long time, access to proper healthcare was considered out of reach for the poor. Ayushman Bharat changed that.
— Narendra Modi (@narendramodi) January 17, 2019
Ours is a Government that cares for the downtrodden and we want to ensure that they lead healthy lives. pic.twitter.com/F8S10bO03o